ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కరుణతో నిండిన ప్రభుత్వం, పేదల సంక్షేమానికి అంకితం : పీఎం


గడచిన 11 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రతి చర్య సేవ, సుపరిపాలన, పేదలకు సంక్షేమం అందించడానికే అంకితమైంది: పీఎం

సమగ్రాభివృద్ధి కోసం మా ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రయత్నాలు గొప్ప మార్పులకు నాంది పలికి, పేదలు, అణగారిన వర్గాల వారికి ప్రయోజనం

प्रविष्टि तिथि: 05 JUN 2025 9:45AM by PIB Hyderabad

దేశంలో పరివర్తనాత్మకమైనసమ్మిళిత పరిపాలన 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వం పేదల సంక్షేమం పట్ల చెక్కుచెదరని నిబద్ధతతో పనిచేస్తుందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారుకరుణతో నిండిన తమ ప్రభుత్వం సాధికారతమౌలిక వసతులుసమ్మిళితత్వంపై దృష్టి సారించి 25 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.

పీఎం ఆవాస యోజనపీఎం ఉజ్వల యోజనజనధన్ యోజనఆయుష్మాన్ భారత్ లాంటి మార్పులకు శ్రీకారం చుట్టిన పథకాలు తీసుకొచ్చిన ప్రభావం గురించి ప్రధానమంత్రి వివరించారుఈ పథకాలు గృహనిర్మాణంస్వచ్ఛమైన వంట ఇంధనంబ్యాంకింగ్ఆరోగ్య సేవలను అందించినట్లు ప్రధాని తెలియజేశారుప్రయోజనాలను పారదర్శకంగాసమర్థంగా అందించడంలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), డిజిటల్ సమ్మిళితత్వంగ్రామీణ మౌలిక వసతుల ప్రాధాన్యాన్ని వివరించారు.

ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘కరుణతో నిండిన ప్రభుత్వంపేదల సంక్షేమానికి అంకితం

గడచిన దశాబ్దంలో సాధికారితమౌలిక వసతులుసమ్మిళితత్వంపై దృష్టి సారించి పేదరికం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను విముక్తులను చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలను చేపట్టిందిమేం చేపట్టిన అన్ని కీలక పథకాలు పేదల జీవితాల్లో మార్పులను తీసుకొచ్చాయిపీఎం ఆవాస యోజనపీఎం ఉజ్వల యోజనజన ధన్ యోజనఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు గృహనిర్మాణంస్వచ్ఛమైన వంట ఇంధనంబ్యాంకింగ్ఆరోగ్య సేవలను ప్రజలకు అందించాయిడీబీటీడిజిటల్ సమ్మిళితత్వంగ్రామీణ మౌలిక వసతులు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను చివరి వ్యక్తి వరకు వేగంగా చేరవేశాయి.

వాటి కారణంగానే 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని ఓడించారుప్రతి పౌరుడూ గౌరవప్రదంగా జీవించడానికి వీలున్న సమ్మిళితమైనస్వావలంబన సాధించిన భారత్‌‌ను నిర్మించడానికి ఎన్డీయే కట్టుబడి ఉంటుంది.’’

#11YearsOfGaribKalyan

‘‘గత 11 ఏళ్లలో మా ప్రభుత్వం వేసిన ప్రతి అడుగూ... సేవసుపరిపాలనపేదల సంక్షేమానికే అంకితమైందిఈ సమయంలో మేం సాధించిన విజయాలు అనూహ్యమైనవే కాదు, 140 కోట్ల మంది జీవితాలను సులభతరం చేస్తున్నాయిదేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ ప్రయత్నాలతో అభివృద్ధి చెందినస్వావలంబన సాధించిన భారత్ లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తామని నేను విశ్వసిస్తున్నాను.

#11YearsOfGaribKalyan"

సమగ్రాభివృద్ధి దిశగా మా ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు గొప్ప మార్పులకు దారి తీశాయిఅలాగే పేదలుఅణగారిన వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చాయి.

#11YearsOfGaribKalyan"


(रिलीज़ आईडी: 2134432) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Bengali-TR , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada