గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైల్వేలు మన ఆర్థిక వ్యవస్థలో, మన గుర్తింపులో ఓ భాగం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని


• పునరభివృద్ధి పనులు పూర్తి అయిన ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ ప్రారంభం

Posted On: 22 MAY 2025 2:02PM by PIB Hyderabad

భారతీయ రైల్వేలు మన ఆర్థిక వ్యవస్థలో భాగం మాత్రమే కాదనీమన గుర్తింపులోనూ ఒక భాగమేనని కేంద్ర గ్రామీణాభివృద్ధికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని అన్నారుఅమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరభివృద్ధి పనులు పూర్తి అయిన ఆంధ్రప్రదేశ్‌లోని సూళ్ళూరుపేట రైల్వే స్టేషనును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ రోజు ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడారుభారతీయ రైల్వేలు ప్రతి రోజూ రెండు కోట్ల మందికి పైగా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయనీఅంతేకాకుండా ప్రపంచంలో చాలా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న యాజమాన్య సంస్థ కూడా భారతీయ రైల్వేలనీ మంత్రి అన్నారు.

ప్రస్తుతం భారత్‌లో మౌలిక సదుపాయాల కల్పన అంటే అది ఒక్క సౌకర్యాల గురించే కాదనీఅది విశ్వాసాన్ని పెంపొందించడం గురించి కూడానని మంత్రి వ్యాఖ్యానించారుమనకు సులభంగా చేరుకోగలిగేసమర్ధమైనమన దేశ గౌరవానికి అద్దం పట్టే స్టేషన్లు అవసరమని చెప్పారు. ‘‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలోరైల్వేలకు భారత అభివృద్ధి కార్యక్రమాల పట్టికలో కీలక స్థానాన్ని ఇచ్చాంఆయన విధానం స్పష్టంరైల్వే రంగంలో మౌలిక సదుపాయాలలో మార్పు తీసుకురావాలిప్రయాణికులకు కలిగే అనుభూతులను పెంపొందించాలిరైల్వే స్టేషన్లను మన దేశ పట్టణ ప్రాంత పునరుద్ధరణ కృషితో అనుసంధానించాలి’’ అని మంత్రి వివరించారు.

దేశంలో 1,300కు పైగా స్టేషన్లకు సరికొత్త రూపురేఖలను కల్పించాలనే ఉద్దేశంతో అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని రూపొదించినట్లు శ్రీ పెమ్మసాని తెలిపారురూ.14.5 కోట్ల ఖర్చుతో సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్ పునరభివృద్ధి పనులను చేశారని తెలిపారుఈ స్టేషన్ పవిత్రమైన తిరుపతి జిల్లాలో ఉండడంతో భారతీయ రైల్వే చిత్రపటంలో ఈ స్టేషనుకు తనదైన ప్రత్యేక స్థానం ఉందిఅదీకాకమన దేశంలో ప్రధాన స్పేస్‌పోర్టు అయిన శ్రీహరికోటకు చాలా దగ్గరగా ఉన్న రైల్వేస్టేషన్ కూడా సూళ్లూరుపేటయే.

గత 11 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన వివిధ రైల్వే ప్రాజెక్టులను గురించి మంత్రి ప్రస్తావిస్తూ... 2025–26లో బడ్జెటు కేటాయింపు రూ.9,417 కోట్లకు పెరిగిందనీఇది 2009–14లో కేటాయించిన దాని కన్నా 10 రెట్లకు పైగానే అనీ తెలిపారుమొత్తం 414 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలను జోడించారనీ, 1,217 కి.మీమేర రైలుమార్గాల డబ్లింగ్ పూర్తి చేశారనీమొత్తం 3,748 కి.మీమేర రైలుమార్గాన్ని విద్యుదీకరించారన్నారుఅమృత్ భారత్ స్టేషన్ స్కీము ఒక్క దానిలో భాగంగానేఆంధ్ర ప్రదేశ్‌లో 73 స్టేషన్ల పునరభివృద్ధి పనులు కొనసాగుతున్నాయనిఇదొక రికార్డనీ మంత్రి చెప్పారు.‌

 

***


(Release ID: 2130575)