ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పదవీ బాధ్యతలు స్వీకరించిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌కు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందన


· భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చ

· ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా...

· ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కోవడంపై ఉమ్మడి నిబద్ధతను పునుద్ఘాటించిన నాయకులు

· ఛాన్సలర్ మెర్జ్‌ను భారత్‌కు ఆహ్వానించిన ప్రధాని

Posted On: 20 MAY 2025 7:38PM by PIB Hyderabad

జర్మనీ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఫ్రెడరిక్ మెర్జ్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు టెలిఫోన్‌లో సంభాషించి, అభినందనలు తెలిపారు.

గత 25 సంవత్సరాలుగా భారత్ - జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో అద్భుతమైన పురోగతిపై చర్చించారు. వాణిజ్యం - పెట్టుబడి, రక్షణ - భద్రత, ఆవిష్కరణ - సాంకేతికత వంటి రంగాలు సహా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేలా సన్నిహితంగా పనిచేయడానికి నాయకులిద్దరూ అంగీకరించారు. జర్మనీ పురోగతిలో భారతీయ ప్రవాసుల సానుకూల కృషిపైనా వారిద్దరూ చర్చించారు.

ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వారు చర్చించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ఎదుర్కోవడంలో ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారు.

భారత్‌ను సందర్శించాల్సిందిగా జర్మనీ ఛాన్సలర్ మెర్జ్‌ను భారత ప్రధానమంత్రి శ్ర నరేంద్ర మోదీ ఆహ్వానించారు. సంప్రదింపులను కొనసాగించడానికి నాయకులిద్దరూ అంగీకరించారు.  


(Release ID: 2130089)