హోం మంత్రిత్వ శాఖ
పద్మ పురస్కారాలు-2026 నామినేషన్లకు చివరి తేదీ 2025 జులై 31
Posted On:
20 MAY 2025 3:26PM by PIB Hyderabad
2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న పద్మ పురస్కారాలు-2026కు నామినేషన్లు, సిఫారసుల స్వీకరణ ఈ సంవత్సరం మార్చి నెల 15న ప్రారంభించారు. పద్మ పురస్కారాలకు నామినేషన్లను సమర్పించడానికి ఆఖరు తేదీ ఈ ఏడాది జులై 31. పద్మ పురస్కారాలకు నామినేషన్లను, సిఫారసులను రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in)లో ఆన్‌లైన్‌లో మాత్రమే తీసుకుంటారు.
పద్మ పురస్కారాలయిన పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ సర్వోన్నత పౌర పురస్కారాల్లో భాగంగా ఉన్నాయి. 1954వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ పురస్కారాలను ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. దేశానికి అత్యుత్తమ సేవలు అందించిన వారికి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. పద్మ పురస్కారాలను కళ, సాహిత్యం-విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్సు-ఇంజినీరింగ్, ప్రజా వ్యవహారాలు, సివిల్ సర్వీసు, వ్యాపార రంగం-పరిశ్రమ వంటి రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి అంందిస్తున్నారు. జాతి, వృత్తి, పదవి, స్త్రీపురుష భేదం లేకుండా ఈ పురస్కారాలను పొందడానికి అర్హులే. వైద్యులు, శాస్త్రవేత్తలు మినహా ఇతర ప్రభుత్వ అధికారులందరూ ఈ పద్మ పురస్కారాలకు అర్హులు కారు.
పద్మ పురస్కారాలను ప్రజా పద్మాలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ కారణంగా, పౌరులందరికీ వారి వారి నామినేషన్లను, సిఫారసులను పేర్కొనాల్సిందిగా కోరడమైంది. పౌరులు స్వయంగా తమను తాము సైతం నామినేట్ చేసుకోవచ్చును. మహిళలు, సమాజంలోని బలహీన వర్గాలు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, దివ్యాంగులు, సమాజానికి నిస్వార్థంగా సేవ చేస్తున్న వారు.. వీరిలో నుంచి శ్రేష్ఠత్వం, సాధించిన విజయాల వాస్తవ గుర్తింపునకు యోగ్యమైనవిగా ఉంటే ఆ తరహా ప్రతిభావంతులను వెలికితీసేందుకు ఉమ్మడి ప్రయత్నాలను చేయవచ్చును.
నామినేషన్లు, సిఫారసులలో పైన పేర్కొన్న పోర్టల్‌లో లభ్యమయ్యే నమూనా ప్రకారం సందర్భానుసారంగా అడుగుతున్న వివరాలను ప్రస్తావించి ఉండాలి. ఇది 800 పదాలకు మించకూడదు. సిఫారసు చేస్తున్న వ్యక్తి అతడు లేదా ఆమె చెందిన రంగానికి, విభాగానికి ఏయే విశిష్ట, అసాధారణ సేవలను అందించారన్నది లేక ఏయే విజయాలను సాధించారన్నది స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించిన విస్తృత వివరణను హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైటు (https://mha.gov.in)తో పాటు పద్మ పురస్కారాల పోర్టల్ ( https://padmaawards.gov.in )లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ పురస్కారాలకు సంబంధించిన విధివిధానాలు, నియమావళి వెబ్‌సైట్‌లో https://padmaawards.gov.in/AboutAwards.aspx అన్న వెబ్ చిరునామాలో లింకులో లభ్యమవుతున్నాయి.
***
(Release ID: 2129940)
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam