ఉప రాష్ట్రపతి సచివాలయం
మే 15న రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
జైపూర్‌లో భైరాన్ సింగ్ షెఖావత్ స్మారక గ్రంథాలయాన్ని
ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి
Posted On:
14 MAY 2025 12:41PM by PIB Hyderabad
భారత ఉపరాష్ట్రపతి మాన్య శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి డాక్టర్ శ్రీమతి సుదేశ్ ధన్‌ఖడ్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఒక రోజు పర్యటించనున్నారు. పూర్వ ఉపరాష్ట్రపతి వర్ధంతి సందర్భంగా జైపూర్‌లో భైరాన్ సింగ్ షెఖావత్ స్మారక గ్రంథాలయాన్ని శ్రీ ధన్‌ఖడ్ ప్రారంభిస్తారు.
శ్రీ భైరాన్ సింగ్ షెఖావత్ 2002 ఆగస్టు 19 నుంచి 2007 జులై 21 మధ్య కాలంలో దేశానికి 11వ ఉపరాష్ట్రపతి గాను, రాజ్య సభకు ఎక్స్-అఫీషియో చైర్మన్‌గాను సేవలు అందించారు. 1952లో రాజస్థాన్ విధాన సభ సభ్యునిగా ప్రజాజీవనంలో తన కెరియర్‌ను మొదలుపెట్టిన శ్రీ భైరాన్ సింగ్ షెఖావత్ ఆ తరువాత రాజస్థాన్‌కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా సేవ చేశారు.
శ్రీ భైరాన్ సింగ్ షెఖావత్ 15వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి జైపూర్ వెళ్తారు. ఆ తరువాత ఓ హెలికాప్టర్‌లో ప్రయాణించి, విద్యాధర్ నగర్ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమ స్థలానికి చేరుకొంటారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా, కేంద్ర పర్యటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ శర్మ, పార్లమెంట్ సభ్యుడు శ్రీ మదన్ రాథోడ్‌తో పాటు ఇతర ప్రముఖ అతిథులు కూడా పాల్గొంటారు.
***
(Release ID: 2128658)