జాతీయ మానవ హక్కుల కమిషన్
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలోని
ప్రొపెల్లెంట్ మిక్సింగ్ యూనిట్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించినట్లు, మరో ముగ్గురు కార్మికులకు గాయలైనట్లు వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్ఆర్‌సీ
· రెండువారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందజేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ
प्रविष्टि तिथि:
05 MAY 2025 6:03PM by PIB Hyderabad
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, కాటేపల్లి గ్రామంలో పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలోని ప్రొపెల్లెంట్ మిక్సింగ్ యూనిట్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారని, మరో ముగ్గురు గాయపడినట్లు మీడియాలో వచ్చిన వార్తలను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ సంఘటన 2025, ఏప్రిల్ 29న జరిగిందని వార్తల్లో పేర్కొన్నారు.
ఈ వార్తల్లో పేర్కొన్న అంశాలు నిజమైతే.. ఇది బాధితుల మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన అంశాలను లేవెనెత్తుతున్నాయని కమిషన్ గమనించింది. కాబట్టి ఈ అంశంపై రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నివేదికలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించిన సమాచారం సైతం ఉంటుందని భావిస్తున్నారు.
మీడియా కథనాల ప్రకారం, 2025, ఏప్రిల్ 29న జరిగిన పేలుడు వల్ల ప్లాంట్‌లోని మిక్సింగ్ యూనిట్ మొత్తం కూలిపోయింది. వార్తల ప్రకారం, ఈ సంస్థ డీఆర్‌డీవోతో సహా వాణిజ్య, ప్రముఖ సంస్థల కోసం పేలుడు పదార్థాలను తయారుచేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2127220)
आगंतुक पटल : 34