ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ శివానంద బాబా మృతికి ప్రధాని సంతాపం
प्रविष्टि तिथि:
04 MAY 2025 10:58AM by PIB Hyderabad
కాశీ నివాసి, యోగా సాధకుడు శ్రీ శివానంద బాబా మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“యోగా సాధకుడు, కాశీ నివాసి శివానంద బాబా గారి మరణం అత్యంత విచారకరం. యోగా, ధ్యానానికి అంకితమైన ఆయన జీవితం దేశంలోని ప్రతి తరానికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. యోగా ద్వారా సమాజానికి సేవలందించిన ఆయనకు పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది.
శివానంద బాబా శివలోక ప్రయాణం కాశీ నివాసితులందరికి, ఆయన నుంచి ప్రేరణ పొందే లక్షలాది మందికి తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో ఆయనకు నివాళి అర్పిస్తున్నాను.’’
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2126825)
आगंतुक पटल : 48
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam