వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పాకిస్తాన్‌లో తయారయ్యే లేదా అక్కడి నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే అన్ని వస్తువుల దిగుమతులను నిషేధించిన భారత ప్రభుత్వం

Posted On: 03 MAY 2025 3:20PM by PIB Hyderabad

పాకిస్తాన్‌లో తయారైన లేదా అక్కడి నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే అన్ని వస్తువుల దిగుమతులను నిషేధిస్తూ వాణిజ్యపరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీఅధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇది పాకిస్థాన్ నుంచి నేరుగా లేదా మరే ఇతర వాణిజ్య మార్గం ద్వారా వస్తువుల దిగుమతిని నిషేధిస్తుంది

2025 మే 2న నోటిఫికేషన్ నంబర్ 06/2025-26 ద్వారా జారీ చేసిన ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయిఈ మేరకు ఎఫ్టీపీ 2023లో పేరా 2.20ఏ  అనే కొత్త పేరాగ్రాఫ్ ను జోడించారు

పాకిస్థాన్ నుంచి వచ్చే లేదా ఎగుమతి చేసే అన్ని వస్తువులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతి చేసుకోవడం లేదా రవాణా చేయడంస్వేచ్ఛగా దిగుమతి చేసుకోదగిన లేదా ఇతరత్రా అనుమతించినప్పటికీతదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటికి తక్షణమే నిషేధం వర్తిస్తుందిజాతీయ భద్రతప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు” నోటిఫికేషన్ తెలిపింది.

వివరమైన నోటిఫికేషన్ డీజీఎఫ్టీ అధికారిక వెబ్‌సైట్ https://dgft.gov.in లో అందుబాటులో ఉంది.

 

***


(Release ID: 2126567) Visitor Counter : 12