ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోల్‌కతాలో అగ్నిప్రమాదం...ప్రాణనష్టం... ప్రధానమంత్రి సంతాపం


* పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

प्रविष्टि तिथि: 30 APR 2025 9:34AM by PIB Hyderabad

కోల్‌కతాలో అగ్నిప్రమాదం సంభవించి ప్రాణ నష్టానికి దారి తీసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వ్యక్తులకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను వారి సంబంధికులకు చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 వంతున ఇవ్వనున్నారు.


ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:


‘‘కోల్‌కతాలో అగ్నిప్రమాదం ప్రాణనష్టానికి దారితీయడం బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క వ్యక్తికి ‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి’ (పీఎం ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ఆ వ్యక్తి కుటుంబానికి అందజేస్తాం. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున అందిస్తాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi’’ అని తెలిపింది.

 

 

“কলকাতায় অগ্নিকান্ডে প্রাণহানির ঘটনায় আমি মর্মাহত। যারা প্রিয়জনদের হারিয়েছেন, তাঁদের সমবেদনা জানাচ্ছি এবং আহতদের দ্রুত আরোগ্য কামনা করছি। প্রধানমন্ত্রী জাতীয় ত্রাণ তহবিল থেকে মৃতদের প্রত্যেকের নিকটাত্মীয়কে ২ লক্ষ টাকা করে এবং আহতদের ৫০,০০০ টাকা করে আর্থিক সহায়তা দেওয়া হবে : প্রধানমন্ত্রী @narendramodi

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2125384) आगंतुक पटल : 33
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam