రక్షణ మంత్రిత్వ శాఖ
భారత సైన్యం ఆధునికీకరణ కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాకు విరాళాలు ఇవ్వండంటూ వాట్సాప్‌లో తప్పుదోవ పట్టిస్తున్న సందేశం
Posted On:
27 APR 2025 6:20PM by PIB Hyderabad
భారత సైన్యం ఆధునికీకరణతోపాటు విధినిర్వహణలో అమరులైన సైనికుల కోసం లేదా గాయపడ్డ జవానుల కోసం ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతాకు విరాళాలు ఇవ్వండంటూ తప్పుదోవ పట్టిస్తున్న సందేశమొకటి వాట్సాప్‌లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు మంత్రిమండలిలో ఒక నిర్ణయం జరిగిందని ఈ సందేశం తెలియజేయడమే కాకుండా, ఈ ప్రతిపాదనను తీసుకువచ్చింది సినీనటుడు శ్రీ అక్షయ్ కుమార్ అని కూడా ప్రస్తావిస్తోందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆ సందేశంలో ఖాతా వివరాలను తప్పుగా ఇచ్చిన కారణంగా ఆన్‌లైన్‌లో పంపుతున్న విరాళాలు నిరాకరణకు గురి అవుతున్నాయని ప్రకటనలో తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తీరాలి, ఈ తరహా మోసపూరిత సందేశాల వలలో పడకూడదంటూ ప్రకటనలో హితవు పలికారు.
పోరాట కార్యకలాపాల్లో అమరులయ్యే లేదా దివ్యాంగులయ్యే జవానుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని వెల్లడించారు.
‘ఆర్మ్‌డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాల్టీ వెల్ఫేర్ ఫండ్’ (ఏఎఫ్‌బీసీడబ్ల్యూఎఫ్)ను ప్రభుత్వం 2020వ సంవత్సరంలో ఏర్పాటు చేసింది. ఈ నిధిని సైనిక కార్యకలాపాల్లో ప్రాణత్యాగం చేసిన లేదా తీవ్రంగా గాయపడ్డ పదాతిదళాల సైనికుల, నావికాదళ సైనికుల, వాయు సేన సైనికుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఉపయోగిస్తున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖలో ని మాజీ సైనికోద్యోగుల సంక్షేమ విభాగం పక్షాన ఈ నిధికి సంబంధించిన ఖాతాలను భారత సైన్యం నిర్వహిస్తోంది. విరాళాలు ఇవ్వదలచుకొనే వారు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాల్టీ వెల్ఫేర్ ఫండ్ ఖాతాకే నేరుగా విరాళాన్ని ఇవ్వవచ్చు. బ్యాంకు ఖాతాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
1st Account
Fund Name
|
Armed Forces Battle Casualties Welfare Fund
|
Bank Name
|
Canara Bank, South Block, Defence Headquarters New Delhi – 110011
|
IFSC Code
|
CNRB0019055
|
Account No
|
90552010165915
|
Type of A/c
|
Saving
|
2nd Account
Fund Name
|
Armed Forces Battle Casualties Welfare Fund
|
Bank Name
|
State Bank of India, Parliament Street, New Delhi – 110011
|
IFSC Code
|
SBIN0000691
|
Account No
|
40650628094
|
Type of A/c
|
Saving
|
ఏఎఫ్బీసీడబ్ల్యూఎఫ్ పేరిట న్యూ ఢిల్లీ లో చెల్లుబాటయ్యే విధంగా డిమాండ్ డ్రాఫ్ట్ తీసి పోస్ట్ ద్వారా ఈ కింది చిరునామాకు తమ విరాళాలు పంపవచ్చు.
Accounts Section
Adjutant General’s Branch
Ceremonial & Welfare Directorate
Room No 281-B, South Block
IHQ of MoD (Army), New Delhi – 110011
***
(Release ID: 2124835)
Visitor Counter : 16