వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2025 విజేతను ప్రకటించిన డీపీఐఐటీ, స్ట్రైడ్ వెంచర్స్: గెలిచిన సంస్థలో రూ. 10 కోట్ల వరకు పెట్టుబడి

Posted On: 22 APR 2025 4:28PM by PIB Hyderabad

భారత్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2025 పోటీల విజేతగాబౌయాన్సీ ప్లాస్టిక్ ఫర్ ఛేంజ్ రీసైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంకుర సంస్థను పరిశ్రమలుఅంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీప్రకటించిందిస్టార్టప్ ఇండియాస్ట్రైడ్ వెంచర్స్ భాగస్వామ్యంతో డీపీఐఐటీ ఈ పోటీలను నిర్వహించిందిప్రభావవంతమైన దేశీయ అంకుర సంస్థలను గుర్తించివాటిని అభివృద్ధి చేయడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం.

30 రోజుల పాటు 120 అంకుర సంస్థల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం విజేతను ఎంపిక చేశారుసుస్థిరతఫిన్ టెక్-మొబిలిటీ రంగంలో పనిచేస్తున్న దేశంలో 22 రాష్ట్రాలకు చెందిన అంకుర సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయి.

ఈ పోటీల్లో విజేతగా నిలిచిన ప్లాస్టిక్ ఫర్ ఛేంజ్‌ 2015లో ప్రారంభమైందిఈ సంస్థ ఫెయిర్ ట్రేడ్ ధ్రువీకరించిన రీసైకిల్డ్ ప్లాస్టిక్ సరఫరా వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించిందిరీసైక్లింగ్ యూనిట్లకు అధిక నాణ్యత కలిగిన ఆర్‌పీఈటీఆర్‌హెచ్‌డీపీఈఆర్‌పీపీ సామగ్రిని సరఫరా చేసేందుకు ప్లాస్టిక్ వ్యర్థాలను న్యాయబద్ధంగా సేకరించడంపై కూడా ఈ సంస్థ ప్రస్తుతం దృష్టి సారించిందిఅసంఘటిత రంగంలో చెత్తప్లాస్టిక్ సేకరించే వారితో నేరుగా పనిచేస్తూ.. వారిని సంఘటిత ఆర్థిక వ్యవస్థతో అనుసంధానిస్తోందిఈ సంస్థకు ప్రస్తుతం 20,000 టన్నుల సేకరణ సామర్థ్యం ఉందిదాన్ని మరింత విస్తరించి భారతీయ ప్లాస్టిక్ రీసైక్లింగ్ రంగంలో తనదైన ముద్ర వేయడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది.

భారత్‌లో పెట్టుబడి రుణాలు అందించే అతి పెద్ద సంస్థ స్ట్రైడ్ వెంచర్స్ గడచిన ఐదేళ్లలో 170కి పైగా కొత్త తరం అంకుర సంస్థల్లో ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టిందిఈ సంస్థ ఇప్పుడు సింగపూర్అబుదాబిరియాద్లండన్‌‌లకు తన కార్యకలాపాలను విస్తరించిందిఈ ఏడాది ఆరంభంలో డీపీఐఐటీతో స్ట్రైడ్ వెంచర్స్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసిందిదీని ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న కొత్త అంకుర సంస్థలకు పెట్టుబడినెట్వర్క్మార్కెట్ అవకాశాలతో పాటు మార్గదర్శకత్వాన్ని అందిస్తుందిఅలాగే భారతీయ అంకుర సంస్థలు అంతర్జాతీయ స్థాయికి చేరుకొనేలా తోడ్పాటు అందిస్తుంది.

భారత్ స్టార్టప్ గ్రాండ్ పోటీలను స్ట్రైడ్ వెంచర్స్ నిర్వహించడం ఇదే తొలిసారివిజేతగా నిలిచిన సంస్థలో రూ. 10 కోట్ల వరకు పెట్టుబడి పెడతానని స్ట్రైడ్ వెంచర్స్ ప్రకటించిందిదీనితో పాటుగా భారత్‌ సుస్థిరపునర్వినియోగ ఆర్థిక వ్యవస్థలో అంకుర సంస్థలు చేస్తున్న కృషిని పెంపొందిస్తుందిఅలాగే వాటికి అవసరమైన తోడ్పాటుమార్గదర్శకత్వం అందిస్తూ తనకు సంబధించిన వ్యవస్థలను ఉపయోగించుకొనేందుకు స్ట్రైడ్ అవకాశం కల్పిస్తుంది.

 

***


(Release ID: 2123632) Visitor Counter : 4