మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రజాపాలనలో గొప్ప ప్రతిభకు ప్రధాని పురస్కారం (నూతన ఆవిష్కరణ కేటగిరీ)...
‘పోషణ్ ట్రాకర్’ యాప్‌ను రూపొందించిన మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికి అందజేత
प्रविष्टि तिथि:
21 APR 2025 2:35PM by PIB Hyderabad
ప్రజాపాలనలో గొప్ప ప్రతిభకు ప్రధాని పురస్కారాన్ని (నూతన ఆవిష్కరణ కేటగిరీ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ మలిక్ ఈ రోజు అందుకున్నారు. ఈ పురస్కారాన్ని దేశమంతటా పోషణ సేవల అందజేతలో విప్లవాత్మకమైన మార్పును తెచ్చిన గొప్ప యాప్ ‘పోషణ్ ట్రాకర్’ను రూపొందించినందుకు గాను శ్రీ అనిల్ మలిక్‌కు అందజేశారు.
‘పోషణ్ ట్రాకర్’ మొబైల్ ఆధారిత అప్లికేషన్. దీనిని పోషణ ప్రధాన సేవలు, బాలల సంరక్షణ సేవలకు సంబంధించిన సమాచారాన్ని వాస్తవ కాల ప్రాతిపదికన అందజేయడానికి ఆంగన్‌వాడీ కార్యకర్తలు ఉపయోగిస్తున్నారు.
(रिलीज़ आईडी: 2123326)
आगंतुक पटल : 34