సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ముంబయిలో ‘‘వేవ్స్’’ నిర్వహించిన కాస్ ప్లే చాంపియన్షిప్ వైల్డ్ కార్డ్ ప్రదర్శన- విజయవంతం అయింది. ఉవ్వెత్తున తరలివచ్చిన అభిమానులతో ఉత్సాహం వెల్లివిరిసింది.
ముంబయిలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్ వేదికగా ఏప్రిల్ 19న ఈ కార్యక్రమాన్ని- క్రియేటర్స్ స్ట్రీట్,
ఇండియన్ కామిక్స్ అసోసియేషన్ (ఐసీఏ), మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఈఏఐ) సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. దిగ్గజ పాప్ కల్చరల్ ఫెస్టివల్ నిర్వాహక సంస్థ ఎపికో కాన్ దీనికి నేతృత్వం వహించింది.
Posted On:
19 APR 2025 9:02PM
|
Location:
PIB Hyderabad
వేవ్స్ కాస్ ప్లే ఛాంపియన్షిప్ పోటీ గ్రాండ్ ఫినాలే కోసం తుది పోటీగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50కి పైగా అగ్రశ్రేణి కాస్ ప్లేయర్లు- తమ అద్వితీయ వేషధారణ, నటనా పటిమలతో అభిమానులను ఆకట్టుకున్నారు.
వార్ఫ్ స్ట్రీట్ స్టూడియో వ్యవస్థాపక సీఈఓ వెంకటేశ్, ఫర్బిడెన్ వర్స్ అజయ్ కృష్ణ, ఇండియన్ కామిక్స్ అసోసియేషన్ కార్యదర్శి అనాది అభిలాష్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ పోటీలో 30 మందిని మే 1 నుంచి 4 వరకు ముంబయి జియో వరల్డ్ సెంటర్ లో జరిగే వేవ్స్ గ్రాండ్ ఫినాలే పోటీకి ఎంపిక చేశారు.
భారతీయ ఘన సాంస్కృతిక వారసత్వాన్ని ఆవిష్కరించే రీతిలో నృసింహ స్వామి దివ్యరూప ప్రదర్శన, సెలబ్రిటీలు, సృజనకారులు, దేశ కాస్ ప్లే రంగ ప్రముఖుల రాక కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫోటోలు, అప్రయత్న ప్రదర్శనలు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
నాటి కార్యక్రమం క్వాలిఫయర్ పోటీగా కాక సాంస్కృతికంగా అద్భుతంగా జరిగిందంటూ అందరి మన్ననలను చూరగొంది. నానాటికీ పుంజుకుంటున్న దేశ కాస్ ప్లే విప్లవాన్ని పట్టి చూపే విధంగా కాస్ ప్లే సమూహ ఉత్సాహం, సృజనాత్మకత, యువజన కోలాహలం కనువిందు చేశాయి. మునుపెన్నడూ లేని విధంగా రూపుదిద్దుకుంటున్న కాస్ ప్లే ఉద్యమానికి నాందిగా నిలిచిన వైల్డ్ కార్డ్ పోటీల్లోని ప్రతి క్షణాన్ని ఆహూతులు ఆస్వాదించడంతో కార్యక్రమం విజయవంతం అయింది. ముంబయి కార్యక్రమంలో పాల్గొన్న కళాకారుల అద్భుతమైన నైపుణ్యం, ప్రదర్శనలు దేశ కాస్ ప్లే రంగ భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండబోతోందనే సంకేతాలనందిస్తున్నాయి.
“ఈ పోటీ భారత్ కాస్ ప్లే ఉద్యమ శక్తిని చాటింది” అని ఒక జ్యూరీ సభ్యుడు వ్యాఖ్యానించారు. “కార్యక్రమంలో మనం చవి చూసిన ఉత్సాహం, భాగస్వాముల కృషి, ధరించే పాత్రల పట్ల కళాకారుల ప్రేమ, ఇవన్నీ ఏటికేడాది పెరుగుతున్నాయి” అన్నారు.
దేశ అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొనే తుది పోటీలో విజేతలకు నగదు సహా ఇతర బహుమతులను అందజేస్తారు. తుది పోటీల్లో యానిమేషన్, సినిమా, గేమింగ్ రంగంలోని పేరొందిన స్టూడియోల ప్రతినిధులు జ్యూరీ సభ్యులగా పాల్గొంటారు. ఐసీఏ, ఫర్బిడెన్ వర్స్, టీవీఏజీఏ, ఎంఈఏఐ, క్రియేటర్ స్ట్రీట్, పాప్ సంస్కృతి చిరునామా – ఎపికో సంస్థల భాగస్వామ్యం ఈ ఛాంపియన్షిప్ స్థాయికి పెంచిందని చెప్పక తప్పదు.
***
Release ID:
(Release ID: 2123114)
| Visitor Counter:
19