ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏప్రిల్ 21న పౌర సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి ప్రజా పరిపాలనలో విశిష్ట సేవలకుగాను ప్రధానమంత్రి అవార్డులను ప్రదానం చేయనున్న శ్రీ నరేంద్ర మోదీ

प्रविष्टि तिथि: 19 APR 2025 1:16PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17వ జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21న ఉదయం 11 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సివిల్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారుప్రజా పరిపాలనలో విశిష్ట సేవలకు గాను ప్రధానమంత్రి అవార్డులను ఆయన ప్రదానం చేయనున్నారు.

భారతదేశం అంతటా ఉన్న సివిల్ సర్వీసెస్‌ అధికారులు తమను తాము ప్రజా ప్రయోజనాలకు అంకితం చేసుకోవాలనిప్రజా సేవకు కట్టుబడి ఉండాలనిచేస్తున్న పనిలో ఔన్నత్యానికి కృషి చేయాలని ప్రధాన మంత్రి ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారుఈ ఏడాది జిల్లాల సమగ్ర అభివృద్ధిఆశావహ బ్లాక్‌ల కార్యక్రమంఆవిష్కరణలు తదితర విభాగాల్లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకు 16 అవార్డులను మోదీ ప్రదానం చేయనున్నారుసామాన్యుల సంక్షేమం కోసం చేసిన కృషికి ఈ అవార్డుల ద్వారా గుర్తింపు లభిస్తుంది


(रिलीज़ आईडी: 2122972) आगंतुक पटल : 66
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam