గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన చెత్త తొలగింపులో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన మహారాష్ట్ర పట్టణం... కరడ్

Posted On: 16 APR 2025 11:09AM by PIB Hyderabad

వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన చెత్త తొలగింపు దేశంలోని అన్ని ప్రాంతాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలుసక్రమమైన పద్ధతిలో ఈ శానిటరీ వ్యర్థాల తొలగింపును చేపట్టకపోతే అనేక పర్యావరణఆరోగ్య సమస్యలు తలెత్తుతాయిఇటువంటి జటిలమైన సమస్యకు మహారాష్ట్ర సతారా జిల్లాలోని కరడ్ అనే పట్టణం సమాధానం చూపుతూ మార్గదర్శిగా నిలుస్తోంది100 శాతం కచ్చితత్వంతో శానిటరీబయోమెడికల్ వ్యర్థాల సేకరణఇతర వ్యర్థాల నుంచి వాటిని వేరు చేయడంఇతర మార్గాల్లో వాటి వినియోగాలను చేపట్టడం వల్ల సమర్థమైనఅనుకూల పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ సాధ్యపడుతోందిదరిమిలా కరడ్ ఉన్నతస్థాయి ప్రమాణాలను నెలకొల్పినట్లు అయిందిశానిటరీ న్యాప్కిన్లుడైపర్లు వంటి ఇతర వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన చెత్తను సరైన పద్ధతిలో పారవేయడం వల్ల ఆరోగ్య సమస్యలుపర్యావరణానికి హానిసామాజిక ఇబ్బందులకు అడ్డుకట్ట వేయగలిగారు.

ఆసుపత్రులుఆరోగ్య కేంద్రాలుఇళ్ళుఇతర కేంద్రాల నుంచి ప్రతి రోజూ దాదాపు 300 నుంచి 350 కిలోల శానిటరీ వ్యర్థాలను స్థానిక వ్యవస్థ సేకరిస్తోంది. శానిటరీ వ్యర్థాలతో ముడిపడిన సామాజిక వివక్షనుకళంకాన్ని తొలగించడంలో స్థానిక పాలనా యంత్రాంగం విజయవంతం అయింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా సక్రమమైన శానిటరీ వ్యర్థాల నిర్వహణ ప్రాముఖ్యత గురించి అవగాహనా కల్పన,  నిర్లక్ష్యంగా పారవేయడం వల్ల కలిగే నష్టాలనూ తెలియజెప్పారుకార్యశాలలుసామాజిక కార్యక్రమాలుప్రచార కార్యక్రమాలుప్రకటనల ద్వారా పౌరుల్లో అవగాహన కల్పించడంలో పాలనా యంత్రాంగం విజయం సాధించడంతో ప్రజలు వివిధ రకాల వ్యర్థాలను వేర్వేరుగా ఉంచడం ద్వారా సహకరిస్తున్నారు.


నివాస ప్రాంతాల్లో మహిళల సాయంతో కరడ్ మునిసిపల్ కౌన్సిల్ చర్యలు తీసుకోవడంతో మహిళలు బృందాలుగా ఏర్పడి పారిశుద్ధ్య వ్యర్ధాల నిర్వహణలో సక్రమ పద్ధతుల పట్ల అవగాహనను పెంచుకునివాటి తొలగింపులో జాగ్రత్తలు తీసుకున్నారుఇందులో భాగంగా పట్టణంలోని పబ్లిక్ టాయిలెట్ల వద్ద ఎరుపు రంగు డబ్బాలను ఏర్పాటు చేశారుదాంతో మహిళలు శానిటరీ వ్యర్థాలను సులభంగా పారవేయగలుగుతున్నారు.  



పాఠశాలల్లో శానిటరీ న్యాప్కిన్ల వెండింగ్ మిషన్లుడిస్పోజల్ సౌకర్యాలను ఏర్పాటు చేయవలసిందిగా యాజమాన్యాలను ప్రోత్సహిస్తున్నారుపట్టణంలోని ఐఈసీ బృందాలు కూడా ప్రజలకు సక్రమమైన పారిశుద్ధ్య అలవాట్లను నేర్పుతున్నాయి – శానిటరీ ప్యాడ్ లను పారవేసే ముందు కాగితాల్లో చుట్టి పారవేయవలసిందిగా సూచిస్తున్నాయిఈ కార్యక్రమానికి స్పందిస్తూ అనేక పాఠశాలలు తమ ప్రాంగణాల్లో ఇన్సినరేటర్లను (వ్యర్థాలను కాల్చి బూడిద చేసే సౌలభ్యంఏర్పాటు చేశాయిఆపై మిగిలిపోయిన వ్యర్థాలను బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణా కేంద్రానికి పంపిస్తున్నారు.


 

నగరంలో శానిటరీ వ్యర్థాలను విడిగా సేకరించేందుకు చెత్త సేకరణ వాహనంలో విడిగా ఒక డబ్బాను ఉంచుతున్నారుఈ రకం చెత్తను సరైన విధంగా పారబోసేందుకు పారిశుద్ధ్య కార్మికులు ఈ వ్యర్థాలను వేరు వేరుగా సేకరిస్తారుఈ ఏర్పాటు వల్ల నిర్దిష్ట సామగ్రిని మాత్రమే మండిస్తారువేరు చేసిన వ్యర్థాలను కరాడ్ ఆసుపత్రి సంఘం తాను నిర్వహించే ఒక అధిక ఉష్ణోగ్రతతో పనిచేసే భస్మీకరణ యంత్రంలో వేస్తుందిఈ ప్రక్రియలో సేంద్రీయ పదార్థాల ఆక్సీకరణ చోటుచేసుకొంటుందిఫలితంగా వేడివాయువుబూడిద ఉత్పన్నమవుతాయిపర్యావరణంపై పడే ప్రభావాన్ని తగ్గించడానికిగాను వెలికివచ్చిన వాయువులను వడపోసి హానికారక పదార్థాల్ని తొలగిస్తారువాయు నాణ్యత ప్రమాణాలు నిర్దిష్ట స్థాయిలో ఉండేలా చూసేందుకు ఈ కేంద్రంలోని ఉద్గారాల్ని నిరంతరం పర్యవేక్షిస్తారుదీనిలో నియంత్రణపరమైన పొరపాట్లు జరగకుండారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎస్‌పీసీబీపర్యవేక్షక వ్యవస్థతో సంధానించిన వాస్తవాధారిత సమాచారాన్ని కూడా ఉపయోగించుకొంటారు.
శానిటరీ వ్యర్థాల తొలగింపును వేగవంతం చేయడానికికరాడ్ మున్సిపల్ కౌన్సిల్ (కేఎంసీశానిటరీబయోమెడికల్ వ్యర్థాలకు ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి కరాడ్ హాస్పిటల్ అసోసియేషన్ తో కలిసి పని చేస్తోందిఈ ఒప్పందంలో భాగంగాబయోమెడికల్ వ్యర్థాల శుద్ధి ప్లాంటు నిర్మాణానికి భూమిని కేటాయించిందిఈ ప్లాంటు కార్యకలాపాల నిర్వహణ బాధ్యతలను ఆసుపత్రి సంఘమే చూసుకోవాల్సి ఉంటుందిఒప్పందంలో భాగంగాఆసుపత్రి సంఘం రోజుకు 600 కిలోల ‘కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీ’ (సీబీడబ్ల్యూటీఎఫ్)ను ఏర్పాటు చేసిందిమున్సిపల్ కౌన్సిల్ ఎలాంటి చార్జీలను వసూలు చేయకుండా సేకరించిన శానిటరీ వ్యర్థాలను ఇక్కడ శుద్ధి చేస్తారునగరంలోని శానిటరీ వ్యర్థాలన్నింటినీ ఈ కేంద్రంలో మండించి వేస్తారు. 1200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకూ చేరుకోగలిగిన సామర్థ్యం కలిగిన ఒక కేంద్రీకృత భస్మీకరణ యంత్రాన్ని ఈ కేంద్రానికి సమకూర్చారుఅధిక ఉష్ణోగ్రత వద్ద పనిచేయగల ఈ యంత్రం మలినాలు వెలువరించే హానికారక పదార్థాలనుఆరోగ్యానికి చేటు చేసే ప్రమాదకర వ్యర్థాలను సాధ్యమైనంతగా తగ్గించి వేస్తుందిదీంతో పారిశుద్ధ్య కార్మికులు వారి విధులను సురక్షితంగా పూర్తి చేయగలుగుతారు.

 

 

కరాడ్ నగరంలో మెరుగుపరిచిన శానిటరీ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ఇటు ప్రజల ఆరోగ్య సంరక్షణతోపాటు అటు పర్యావరణ స్థిరత్వం విషయంలో కూడా చెప్పుకోదగిన సకారాత్మక ప్రభావాన్ని కలగజేసిందికరాడ్ ఆసుపత్రుల అసోసియేషన్ కుదుర్చుకొన్న ఒప్పందం కరాడ్ మున్సిపల్ కౌన్సిల్‌కు ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించగలిగిందిఇది ఇప్పుడు ఒక్క చెత్త సేకరణకురవాణాకు అయ్యే ఖర్చును మాత్రమే భరిస్తుందిఈ ఒప్పందం ఘన వ్యర్థాల నిర్వహణలోనూతరలింపులోనూ పబ్లిక్-ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీనమూనా ఎంత ప్రభావవంతమైందో ప్రధానంగా చాటిచెబుతోందిశానిటరీ వ్యర్థాలను నగరం శివారు ప్రదేశాల్లో కుమ్మరించడాన్ని అడ్డుకొనిపర్యావరణం అధ్వాన స్థితికి చేరకుండానూవ్యాధులు ప్రబలకుండానూ ఈ నగరం నివారించగలిగింది.
వ్యర్థాలను సరి అయిన విధంగా వేరు చేసిచైతన్యాన్ని పెంచిమరింత ఎక్కువ ప్రభావవంతమైన మౌలిక సదుపాయాలను సమకూర్చిశానిటరీ వ్యర్థాల నిర్వహణలో అసమతౌల్యత వల్ల ప్రజల ఆరోగ్యానికిపర్యావరణానికి అపాయాలు తలెత్తకుండా కరాడ్ పాలనా వ్యవస్థ చర్యలు తీసుకుందిదీంతో నగరంలో స్వచ్ఛత పెరగడం ఒక్కటే కాకుండాపరిసర ప్రాంతాల్లోని శానిటరీ వ్యర్థాలను ఒక పద్ధతి ప్రకారం తొలగించడంతోపాటు వాటిని సమర్థంగా తరలించకపోతే ఆ ప్రభావం ఉండేది మహిళల పైనేప్రత్యేకించి మహిళల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కూడా ఇది తన వంతు తోడ్పాటును అందించింది.

 

***


(Release ID: 2122274) Visitor Counter : 16