భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
ఈ ఏడాది నైరుతి వర్ష రుతువులో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం!...
నైరుతి రుతుపవనాల వేళలో కురిసే వర్షాలకు సంబంధించి ఐఎండీ దీర్ఘ కాలిక ముందస్తు అంచనా
రుతుపవన ఆధారిత వర్షపాతం దేశవ్యాప్త దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ)తో పోల్చినప్పుడు 105 శాతంగా ఉండొచ్చు.. ఈ అంచనాలో 5 శాతం అటు (ఎక్కువ గాని), ఇటు (5 తక్కువ గాని) తేడాకు సైతం ఆస్కారం
లా నినా వంటి వాతావరణపరమైన తటస్థ పరిస్థితి తలెత్తవచ్చు.. తటస్థ ఈఎన్ఎస్ఓ వర్షకాలం పొడవునా కొనసాగేందుకు అవకాశం
2025 వర్షరుతువు రావడానికి ముందు తటస్థంగా ఉన్న హిందూ మహాసముద్ర ద్విధ్రువ ప్రాంతాలు... పూర్తి వర్షకాలంమంతటా తటస్థ ఐఓడీ లక్షణాలనే శీతోష్ణస్థితి నమూనాలు కనబరచవచ్చు
గత మూడు నెలలుగా యూరేషియాలో సామాన్య స్థాయి కన్నా తక్కువగా మంచు కురవడం భారతీయ వానాకాలానికి ఉత్తేజాన్ని అందించవచ్చు
Posted On:
15 APR 2025 5:45PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు
• 2025లో యావత్తు దేశంలో నైరుతి రుతుపవనాలు (జూన్ మొదలు సెప్టెంబరు మధ్య కాలం) సామాన్యం కన్నా ఎక్కువ (దీర్ఘకాలిక సగటు [ఎల్‌పీఏ]తో పోల్చి చూసినప్పుడు 104 శాతానికి మించి) వర్షాలను అందిస్తాయన్న అంచనా ఉంది. పరిమాణాత్మకంగా చూస్తే, దేశమంతటా రుతుపవనాధారిత వానలు 5 శాతం మేర ఎక్కువో లేదా తక్కువో ఉంటూ, ఎల్‌పీఏతో పోలిస్తే 105 శాతంగా నమోదయ్యే వీలు ఉంది. 1971-2020 మధ్య కాలానికి పూర్తి దేశంలో రుతుపవన వర్షాల దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ) 87 సెంటీమీటర్లుగా నమోదైంది.
• భూమధ్యరేఖకు చేరువగా ఉన్న పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుతం తటస్థ ఎల్ నినో-దక్షిణ డోలనం (ఈఎన్ఎస్ఓ) స్థితి విస్తరించి ఉంది. ఏమైనా, వాతావరణ ప్రసరణ లక్షణాలు ‘లా నినా’ స్థితులను తలపిస్తున్నాయి. అత్యంత తాజా మాన్‌సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్ (ఎంఎంసీఎఫ్ఎస్)తోపాటు ఇతరత్రా వాతావరణ నమూనా అంచనాలను బట్టిచూడగా, వర్షరుతువు వేళ తటస్థ ఈఎన్ఎస్ఓ స్థితే కొనసాగేటట్లు అనిపిస్తోంది.
• ప్రస్తుతానికి, హిందూ మహాసముద్రం ఎగువభాగంలో తటస్థ హిందూ మహాసముద్ర ద్విధ్రువ (ఇండియన్ ఓషన్ డైపోల్..ఐఓడీ) స్థితులు ఏర్పడ్డాయి. అత్యంత తాజా శీతోష్ణ స్థితి నమూనాల తాలూకు ముందస్తు అంచనాలు నైరుతి రుతుపవనాలు ప్రధానంగా ఉండే వర్ష రుతువులో తటస్థ ఐఓడీ స్థితులే కొనసాగేందుకు ఆస్కారముందని సూచిస్తున్నాయి.
• గత మూడు నెలల (ఈ ఏడాది జనవరి మొదలు మార్చి నెల మధ్య) కాలంలో భూగ్రహ ఉత్తరార్థ గోళంతోపాటు యూరేషియాలో హిమపాత ప్రాంతాలు సాధారణం కన్నా తక్కువ స్థితిని కలిగి ఉన్నాయి. ఉత్తరార్థ గోళంతోపాటు యూరేషియాలో శీతరుతువులోనూ, వసంత కాలంలోనూ మంచు కురిసే ప్రాంతాలు సాధారణంగా ఆ తరువాతి భారతీయ వేసవికాలపు రుతుపవన వర్షాలతో విలోమ సంబంధాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. వాతావరణ విభాగం 2025 మే నెల చివరి వారంలో రుతుపవన ఆధారిత వర్షపాతం విషయంలో సవరించిన ముందస్తు అంచనాలను విడుదల చేయనుంది.
దేశమంతటా 2025 నైరుతి రుతుపవనాల కాలం (జూన్-సెప్టెంబరు)లో వర్షాల ముందస్తు అంచనా ఇలా ఉంది:
దేశంలో పూర్తి వర్ష రుతువు (జూన్ నుంచి సెప్టెంబరు) వర్షపాత సంబంధిత అయిదు కేటగిరీల సంభావ్యత ముందస్తు అంచనాలను ఈ కింద పట్టికలో గమనించవచ్చు. ఇవి నైరుతి రుతుపవన వర్షాలు సామాన్యం కన్నా ఎక్కువగా గాని, లేదా అంతకన్నా అధికంగా (ఎల్‌పీఏ లో 104 శాతానికి మించి) ఉండేందుకు ప్రబలమైన అవకాశాలు (59 శాతం మేరకు) ఉన్నాయని సూచిస్తున్నాయి.
కేటగిరీ
|
వర్షపాతం పరిధి
(ఎల్‌పీఏలో ఎంత శాతమంటే)
|
వరకు సాధ్యమనే విషయంలో ముందస్తు అంచనా
|
శీతోష్ణస్థితి సంభావ్యత (శాతంలో)
|
లోటు
|
< 90
|
2
|
16
|
మామూలు కన్నా దిగువన
|
90 - 95
|
9
|
17
|
మామూలు
|
96 -104
|
30
|
33
|
మామూలు కన్నా ఎగువన
|
105-110
|
33
|
16
|
అధిక
|
> 110
|
26
|
17
|
2025 సంవత్సరంలో జూన్ నుంచి సెప్టెంబరు మధ్య వర్షాలకు సంబంధించి మూడు శ్రేణుల (సాధారణం కన్నా ఎక్కువ, సాధారణం, సాధారణం కన్నా తక్కువ)..అవకాశాలతో కూడిన ముందస్తు అంచనాల ప్రాంతీయ విస్తరణ తీరును 1వ చిత్రంలో చూడవచ్చు. దీనిని గమనించినప్పుడు వాయవ్య, ఈశాన్య విభాగాల్లో కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలావరకు భాగాలలో సాధారణం నుంచి ఎక్కువ రుతుపవన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. భారత్‌లోని దక్షిణ ద్వీపకల్పంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవ్వొచ్చనిపిస్తోంది.
***
(Release ID: 2122159)
Visitor Counter : 32