ప్రధాన మంత్రి కార్యాలయం
డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సేన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రపంచ పరిణామాలపై చర్చించిన ఇరువురు నేతలు
త్వరలో జరగనున్న భారత్-నార్డిక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నార్వేలో సమావేశం కానున్న ఇరువురు నేతలు..
ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటన
Posted On:
15 APR 2025 6:02PM by PIB Hyderabad
డెన్మార్క్ ప్రధాన మంత్రి గౌరవ మెట్టె ఫ్రెడరిక్ సన్‌తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రపంచ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.
2020లో వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం (గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్) ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో జరిగిన చర్చలను గుర్తు చేసుకున్న నాయకులు వివిధ రంగాలలో ఈ భాగస్వామ్యాన్ని విస్తరించటం గురించి ప్రస్తావించారు. ఇది భారతదేశంలో హరిత పరివర్తనకు ఉపయోగపడే విధంగా డెన్మార్క్ పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించిందని అన్నారు. పరస్పర ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలు చర్చించారు.
ఈ ఏడాది చివర్లో నార్వేలో జరగనున్న 3వ భారత్- నార్డిక్ శిఖరాగ్ర సదస్సు, ఇందులో భాగంగా ప్రధాని ఫ్రెడెరిక్సేన్‌తో భేటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
(Release ID: 2121992)
Visitor Counter : 38
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam