మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (పీఎం పోషణ్) పథకం ద్వారా అందించే ‘సరకుల ధరల’ పెంపు

Posted On: 10 APR 2025 11:27AM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన పీఎం పోషణ్ ద్వారా 10.36 లక్షల ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పాఠశాల పనిదినాల్లో బాలవాటిక, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న 11.20 కోట్ల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరును పెంచడంతో పాటు వారికి పౌష్ఠికాహారం అందించడమే ఈ పథకం లక్ష్యం.

పీఎం పోషణ్ పథకం ద్వారా విద్యార్థులకు ఆహారం సిద్ధం చేయడానికి దిగువన పేర్కొన్న వస్తువులను కొనుగోలు చేయడానికి అవసరమైన ఖర్చులను చెల్లిస్తారు.

 

Ingredients

Per student per meal quantity

Bal Vatika & Primary

Upper Primary

Pulses

20 gm

30 gm

Vegetables

50 gm

75 gm

Oil

5 gm

7.5 gm

Spices & Condiments

As per need

As per need

Fuel

As per need

As per need



వినియోగ ధరల సూచిక – గ్రామీణ కార్మికులు (సీపీఐ-ఆర్ఎల్) ఆధారంగా పీఎం పోషణ్ బాస్కెట్లో అందించే వస్తువులకు సంబంధించిన ద్రవ్యోల్బణ సమాచారాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లేబర్ బ్యూరో అందిస్తుంది. పీఎం  పోషణ్ కోసం సీపీఐ సూచీని రూపొందించారు. దీనికి అనుగుణంగా పీఎం పోషణ్ ద్వారా అందించే వస్తువుల ధరలను నిర్ణయిస్తారు. దేశంలోని 20 రాష్ట్రాల్లో 600 గ్రామాల నుంచి సేకరించిన నెలవారీ ధరల నమూనాల ఆధారంగా చండీగఢ్ లేబర్ బ్యూరో సీపీఐ-ఆర్ఎల్‌ను తయారుచేస్తుంది.

లేబర్ బ్యూరో ఇచ్చిన ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా వస్తువుల ధరలను విద్యా మంత్రిత్వ శాఖ 9.50 శాతం పెంచింది. ఈ ఏడాది మే 1 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. దీనివల్ల ఈ ఆర్థిక  సంవత్సరంలో అయ్యే రూ. 954 కోట్ల అదనపు వ్యయాన్ని కేంద్రం భరిస్తుంది. ఒక్కో విద్యార్థి భోజనానికి రోజుకి అయ్యే ఖర్చు:

(రూపాయల్లో)

 

Classes

Existing material cost

Enhanced material cost w.e.f. 01.05.2025

Enhancement

Bal Vatika 

6.19

6.78

0.59

Primary

6.19

6.78

0.59

Upper Primary

9.29

10.17

0.88



ఇవి ఈ ఆహార పదార్థాలకు నిర్దేశించిన కనీస ధరలు. అయితే నిర్దేశించిన వాటా కంటే ఎక్కువ మొత్తాన్ని అందించే స్వేచ్ఛ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉంటుంది. పీఎం పోషణ్ ద్వారా పౌష్ఠికాహారం అందించడానికి నిర్దేశించిన కనీస వాటా కంటే ఎక్కువ మొత్తాన్ని కొన్ని రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాలు తమ సొంత వనరుల నుంచి సమకూర్చుకొంటున్నాయి.

వీటికి అదనంగా, భారత ఆహార సంస్థ ద్వారా 26 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార  ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఆహారధాన్యాలకు ఏడాదికి అందించే సబ్సిడీ రూ. 9,000 కోట్లు, ఎఫ్‌సీఐ డిపోల నుంచి పాఠశాలలకు వాటిని రవాణా చేసేందుకు అయ్యే ఖర్చులతో కలిపి 100 శాతం వ్యయాన్ని కేంద్రమే భరిస్తోంది. ఈ పథకం ద్వారా ఆహార ధాన్యాలు, సరుకులతో కలిపి ఒక విద్యార్థి భోజనానికి అయ్యే ఖర్చు బాల వాటిక, ప్రాథమిక తరగతులకు సుమారుగా రూ. 12.13 కాగా, ప్రాథమికోన్నత తరగతులకు రూ. 17.62గా ఉంది.


 

***


(Release ID: 2120929) Visitor Counter : 33