ప్రధాన మంత్రి కార్యాలయం
మహాత్మా ఫులే జయంతి.. ప్రధానమంత్రి నివాళులు
प्रविष्टि तिथि:
11 APR 2025 8:55AM by PIB Hyderabad
మహాత్మా ఫులే జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహాత్మా ఫులేకు నివాళులు అర్పించారు. మానవత్వానికి సిసలైన సేవకుడు మహాత్మా ఫులే అంటూ ప్రధాని ప్రశంసించారు.
‘‘ఎక్స్’’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘మానవతకు నిజమైన సేవకుడు మహాత్మా ఫులే. ఆయన జయంతి సందర్భంగా గౌరవపూర్వక నమస్సులు. సమాజంలో పీడిత వర్గాలు, దగాపడ్డ వర్గాల సంక్షేమం కోసం ఆయన తన జీవనాన్ని అంకితం చేశారు. దేశానికి మహాత్మా ఫులే అందించిన అమూల్యమైన తోడ్పాటు ప్రతి ఒక్క తరానికీ ప్రేరణను అందిస్తూనే ఉంటుంది.’’
(रिलीज़ आईडी: 2120926)
आगंतुक पटल : 36
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam