ఉప రాష్ట్రపతి సచివాలయం
మహావీర్ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు
Posted On:
09 APR 2025 4:26PM by PIB Hyderabad
మహావీర్ జయంతి పర్వదిన సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కడ్ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఉపరాష్ట్రపతి సందేశ పాఠం:
"మహావీర్ జయంతి పావన సందర్భంలో నా సహ పౌరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అహింస, సత్యం, అపరిగ్రహం (బంధన-రహితం) వంటి మహావీర జైనుని బోధనలు మనను సంవేదనతో కూడిన సార్వత్రిక సమభావన వైపు నడిపించగల నిత్య చైతన్య దీప్తులు. సకల ప్రాణులకు సమానత, వివిధ దృక్కోణాలకు సమాన గౌరవం వంటి మహావీరుని బోధనలు నేటి ప్రపంచానికి దిశా నిర్దేశం చేసే సూత్రాలు.
ఈ మహావీర్ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని జీవితం, ఆదర్శాల నుంచి స్ఫూర్తి పొంది ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఆత్మ నిగ్రహం, సార్వత్రిక సమాభావనలను అలవర్చుకొందాం. సమాజంలో సహనం, శాంతి, వివేకాలను పాదుకొల్పేందుకు కాలానికి అతీతమైన జైనుని జ్ఞాన సంపద మనకు మార్గం చూపగలదు.”
ఇదే సందేశం హిందీలో:
"महावीर जयंती के पावन अवसर पर, मैं सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ देता हूँ।
भगवान महावीर के शाश्वत उपदेश—अहिंसा, सत्य और अपरिग्रह—हमें एक अधिक करुणामय और समरस विश्व की ओर अग्रसर होने की प्रेरणा देते हैं। सभी जीवों की समानता और विभिन्न विचारों के प्रति सम्मान का उनका गहन संदेश आज के समय में और भी प्रासंगिक है।
इस महावीर जयंती पर, आइए हम उनके जीवन और आदर्शों से प्रेरणा लेकर आत्मानुशासन, संयम और सार्वभौमिक करुणा को अपनाएँ। भगवान महावीर की कालजयी शिक्षाएँ हमारे समाज में सहिष्णुता, समझ और शांति की भावना को सुदृढ़ करें—यही कामना है।"
(Release ID: 2120552)
Visitor Counter : 31