రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వేల్లో నాలుగు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం
లైన్ సామర్థ్యాన్ని పెంచడం, భారతీయ రైల్వేలు- ప్రయాణికులు, సరుకులను సజావుగా, వేగంగా రవాణా చేసే లక్ష్యంతో చేపట్టనున్న నాలుగు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు
ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడంతో పాటు సరుకు రవాణా వ్యయం, చమురు దిగుమతులు, కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడనున్న కార్యక్రమాలు
సుస్థిరమైన, సమర్థమైన రైల్వే కార్యకలాపాలకు ఊతం
బొగ్గు, ఇనుము, ఇతర ఖనిజాల రవాణా కోసం కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సరుకు రవాణా సామర్థ్యం పెంచడమే ఈ ప్రాజెక్టుల లక్ష్యం
రవాణా వ్యవస్థ క్రమబద్ధీకరణతో పాటు వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఊతమివ్వనున్న ప్రాజెక్టులు
2030-31 నాటికి పూర్తవనున్న ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.18,658 కోట్లు
ఈ ప్రాజెక్టులు నిర్మాణం ద్వారా దాదాపు 379 లక్షల పనిగంటల ప్రత్యక్ష ఉపాధి
Posted On:
04 APR 2025 3:03PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రూ. 18,658 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి 3 రాష్ట్రాల్లోని 15 జిల్లాలను కవర్ చేసే ఈ నాలుగు ప్రాజెక్టులు భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను దాదాపు 1247 కిలోమీటర్ల మేర విస్తరించనున్నాయి.
ఈ ప్రాజెక్టుల్లో భాగంగా చేపట్టనున్న పనులు:
i. సంబల్‌పూర్ - జరప్డా 3వ, 4వ లైన్
ii. ఝర్సుగూడ - సాసన్ 3వ, 4వ లైన్
iii. ఖర్సియా - నయా రాయ్‌పూర్ - పర్మల్కాసా 5వ, 6వ లైన్
iv. గోండియా - బల్లార్షా డబ్లింగ్
పెరగనున్న లైన్ సామర్థ్యం రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే భారతీయ రైల్వేలకు సమర్థమైన, విశ్వసనీయమైన సేవలను అందించే శక్తిని ఇస్తుంది. ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదనలు రైల్వే కార్యకలాపాలను సులభతరం చేయడంతో పాటు, రద్దీని తగ్గిస్తూ, భారతీయ రైల్వేల్లో అత్యంత రద్దీగా ఉండే విభాగాల్లో అత్యంత అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధిని చేయనున్నాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నూతన భారత్ దార్శనికతకు అనుగుణంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి ఊతమివ్వడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి/స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ వారిని "ఆత్మనిర్భర్"గా మార్చనున్నాయి.
***
(Release ID: 2119117)
Visitor Counter : 6