ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం


* పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

Posted On: 04 APR 2025 3:21PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఓ ప్రమాద ఘటనలో ప్రాణనష్టం జరిగినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంబంధికులకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడ్డవారికి రూ.50,000 వంతున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు.


సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా తెలిపింది:


‘‘మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఓ ప్రమాద ఘటనలో ప్రాణనష్టం జరగడం విచారకరం. తమ ప్రియతములను కోల్పోయినవారికి నేను సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఘటనలో ప్రభావితులైన వ్యక్తులకు స్థానిక పాలనయంత్రాంగం అవసరమైన సహాయాన్ని అందిస్తోంది.


పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను మృతుల సంబంధికులకు ఇస్తారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఇస్తారు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ @narendramodi”

 

 

"महाराष्ट्रातील नांदेड इथल्या अपघातात झालेल्या जीवितहानीबद्दल दु:ख झाले. या अपघातात ज्यांनी आपले प्रियजन गमावले आहेत त्यांच्याप्रती शोकसंवेदना. जखमी लवकर बरे होवोत अशी प्रार्थना करतो. या दुर्घटनेतील पिडीतांना स्थानिक प्रशासन मदत करत आहे. प्रधानमंत्री राष्ट्रीय मदत निधीतून मृतांच्या कुटुंबियांना प्रत्येकी दोन लाख रुपयांची मदत दिली जाईल. जखमींना 50 हजार रुपयांची मदत दिली जाईल: पंतप्रधान @narendramodi"

 

 

***

MJPS/SR


(Release ID: 2118801) Visitor Counter : 20