WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రత్యేక ప్రదర్శనలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలతో ప్రపంచవ్యాప్త పరిధిని విస్తరించనున్న వేవ్స్ బజార్

 Posted On: 31 MAR 2025 11:55AM |   Location: PIB Hyderabad

మీడియా, వినోద పరిశ్రమ (మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ -  ఎంఅండ్ఇ) కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రధాన గ్లోబల్ ఈ-మార్కెట్‌ప్లేస్ అయిన వేవ్స్ బజార్, 2025 మే 1 నుంచి 4 వరకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ప్రారంభ ఎడిషన్‌లో శక్తిమంతమైన ప్రభావాన్ని చూపేందుకు సిద్ధంగా ఉంది. వేవ్స్ 2025 కు ప్రధాన భాగంగా, ఈ-మార్కెట్‌ప్లేస్ సినిమా, టీవీ, ఏవీజీసీ  (యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్,  కామిక్స్) రంగాలకు చెందిన పరిశ్రమ నాయకులను ఏకతాటిపైకి తెస్తుంది, సహకారం, కంటెంట్( విషయం) ప్రదర్శన, వ్యాపార విస్తరణకు అపూర్వ అవకాశాలను అందిస్తుంది.

భారతదేశాన్ని గ్లోబల్ కంటెంట్ హబ్‌గా తీర్చిదిద్దే  గొప్ప లక్ష్యంతో, వేవ్స్ బజార్ ప్రత్యేక విభాగాలను ప్రదర్శించనుంది. వీటిలో వ్యూయింగ్ రూమ్(వీక్షణ గదులు),మార్కెట్ స్క్రీనింగ్స్, కొనుగోలు, అమ్మకందారుల సమావేశాలు,  అలాగే విలక్షణమైన పిచ్‌రూమ్ ఉంటాయి. ఇవి విలువైన అనుసంధానాలను సృష్టించేందుకు, సరిహద్దులను దాటి భాగస్వామ్యాలను ప్రోత్సహించేందుకు సహాయపడతాయి.

వ్యూయింగ్ రూమ్, మార్కెట్ కోసం స్క్రీనింగ్లు, కొత్త కంటెంట్లను అందించే విభాగాలు

వేవ్స్ బజార్‌లో సినిమాలు, సిరీస్‌లు, ఏవీజీసీ ప్రాజెక్టుల ప్రత్యేక స్క్రీనింగ్‌లను నిర్వహిస్తారు. ఇవి కొనుగోలుదారులు, సేల్స్ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు కొత్త ఆకర్షణీయమైన కంటెంట్‌ను ప్రత్యేకంగా చూడటానికి అనుమతిస్తాయి. వ్యూయింగ్ రూమ్ పరిశ్రమ నిపుణులకు కొత్త శీర్షికలను (టైటిల్స్) అన్వేషించేందుకు,  కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ప్రదేశాన్ని అందిస్తుంది. మరోవైపు, మార్కెట్ స్క్రీనింగ్ ల ద్వారా ఎంపిక చేసిన ప్రాజెక్టులను ప్రపంచ ప్రేక్షకులకు ప్రదర్శించడంతో పాటు, కంటెంట్ పంపిణీ, లైసెన్సింగ్, సిండికేషన్ ఒప్పందాల కోసం అవకాశాలను సృష్టిస్తాయి.

కొనుగోలు, అమ్మకందారుల సమావేశాలు: ప్రపంచ భాగస్వామ్యాలకు అవకాశాలు
ఫిక్కీ ఫ్రేమ్స్ కంటెంట్ మార్కెట్‌ప్లేస్‌ భాగస్వామ్యంతో, నిర్మాతలు, స్టూడియోలు, బ్రాడ్‌కాస్టర్‌లు, ప్లాట్‌ఫామ్‌లు వంటి కీలక భాగస్వామ్యుల మధ్య ముఖాముఖి సమావేశాలకు వీలు కల్పించే వ్యవస్థాగత కొనుగోలు, అమ్మకందారుల విభాగాన్ని వేవ్స్ బజార్  అందిస్తుంది. ఈ నిర్దేశిత బీ2బీ పరస్పర సమావేశాలు ఒప్పందాలు చేసుకోవడానికి, ఉమ్మడిగా ప్రొడక్షన్లకు, కంటెంట్ కొనుగోళ్లకు వేగవంతమైన మార్గాన్ని కల్పిస్తాయి. ఇవి అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తూ, పరిశ్రమ సంబంధాలను మరింత బలపరుస్తాయి.

పెట్టుబడిదారుల వద్దకు ఆలోచనలు చేరుకునే పిచ్ రూమ్

పిచ్‌రూమ్ సృజనకర్తలు, చిత్రనిర్మాతలు, కంటెంట్ ఆవిష్కర్తలకు తమ అత్యుత్తమ భావనలను పెట్టుబడిదారులు, నిర్మాతలు, కమిషనింగ్ ఎడిటర్ల ఎదుట ప్రదర్శించే శక్తిమంతమైన వేదికను అందిస్తుంది. ఉత్తమ ఉన్నత ప్రతిభను,  వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు రూపుదిద్దుకున్న పిచ్‌రూమ్, కొత్త కంటెంట్ వెంచర్లు, అవకాశమున్న సంయుక్త నిర్మాణాలకు ప్రారంభ వేదికగా సేవలందిస్తుంది. పరిశ్రమ నిర్ణయాధికారులు తప్పనిసరిగా పాల్గొనవలసిన ప్రదేశంగా ఇది మారనుంది.

వేవ్స్ బజార్ కు మద్దతు తెలిపిన పరిశ్రమ నేతలు

కంటెంట్ వ్యాపారాన్ని, భాగస్వామ్యాలను మార్చే సామర్ధ్యం ఉన్న వేవ్స్ బజార్ ను ప్రముఖ సంస్థలు ప్రశంసించాయి. "వేవ్స్ బజార్ లోని వివిధ విభాగాలలో పాల్గొనడానికి మేము ఉత్సాహంగా ఉన్నాం”  అని పనోరమా స్టూడియోస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీ మురళీధర్ ఛట్వానీ,  ఫిల్మ్ అక్విజిషన్స్ అండ్ సిండికేషన్ హెడ్ శ్రీ రజత్ గోస్వామి తెలిపారు. “ఈ మార్కెట్‌ప్లేస్ మా ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు, విలువైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసేందుకు, వినోద పరిశ్రమలో మా అంతర్జాతీయ పరిధిని విస్తరించేందుకు అద్భుతమైన వేదికను అందిస్తుంది” అన్నారు.

గ్లోబల్ కంటెంట్,  వ్యూహాత్మక భాగస్వామ్యాలకు  ప్రవేశ ద్వారం

కంటెంట్ సృష్టికర్తలు, కొనుగోలుదారులు పెట్టుబడిదారులకు గేమ్ ఛేంజర్ గా మారడానికి వేవ్స్ బజార్ సిద్ధంగా ఉంది, కొత్త కంటెంట్ ను కనుగొనడానికి, భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడానికి,  పంపిణీ,  సహ నిర్మాణ అవకాశాలను అన్వేషించడానికి ఇది ప్రభావవంతమైన వేదికను అందిస్తుంది. వేవ్స్ బజార్ ను వ్యూహాత్మక ఎదుగుదల,  అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసం ఉపయోగించుకోవడానికి రావాల్సిందిగా కొనుగోలుదారులు, అమ్మకందారులు, పెట్టుబడిదారులు, మీడియా, వినోద పరిశ్రమ నిపుణులను ఈ సదస్సు ఆహ్వానిస్తోంది.

రిజిస్ట్రేషన్లు, మరిన్ని వివరాల కోసం సందర్శించండి:  WAVES Bazaar

వేవ్స్ గురించి

ప్రపంచ ఆడియో విజువల్,  ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) మొదటి సదస్సును మీడియా, వినోద రంగాలకు ఒక మైలురాయిగా భారత ప్రభుత్వం 2025 మే 1 నుంచి  4 వరకు మహారాష్ట్రలోని ముంబయిలో నిర్వహించనుంది.

మీరు పరిశ్రమ నిపుణుడు, పెట్టుబడిదారు, సృష్టికర్త లేదా ఆవిష్కర్త అయితే ఈ సదస్సు  మీరు మీడియా, వినోద రంగాలకు అనుసంధానం కావడానికి, భాగస్వామ్యంతో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు, అందించేందుకు అంతర్జాతీయ స్థాయి వేదికను అందిస్తుంది.

కంటెంట్ సృష్టి, మేధో సంపత్తి, సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా భారతదేశ సృజనాత్మక శక్తిని పెంచడానికి వేవ్స్ సిద్ధంగా ఉంది. ఇది ప్రధానంగా దృష్టి సారించే రంగాలలో బ్రాడ్ కాస్టింగ్, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, ఫిల్మ్స్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, సౌండ్ అండ్ మ్యూజిక్, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, జనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఎక్స్ టెండెడ్ రియాలిటీ (ఎక్స్ ఆర్) ఉన్నాయి.

ఏవైనా ప్రశ్నలున్నాయా? సమాధానాలు  ఇక్కడ.

పీఐబీ టీమ్ - వేవ్స్  నుంచి ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోండి.

వేవ్స్ కు  ఇప్పుడే  రిజిస్టర్ చేసుకోండి


Release ID: (Release ID: 2117133)   |   Visitor Counter: 4