యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025


10 పతకాలతో సత్తా చాటిన గాంధీనగర్ సాయ్ పవర్ లిఫ్టర్లు..

ప్రపంచ చాంపియన్ షిప్ ను గెలుచుకోవడమే లక్ష్యం

కేఐపీజీ-2025లో నాలుగు జాతీయ రికార్డులు.. వారంతా గాంధీనగర్ ఎస్ఏఐలోని ఎన్సీఓఈకి చెందినవారే

Posted On: 28 MAR 2025 1:37PM by PIB Hyderabad

 గాంధీనగర్ లోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) జాతీయ అత్యున్నత శిక్షణ కేంద్రానికి (ఎన్సీఓఈ) చెందిన పవర్ లిఫ్టింగ్ అథ్లెట్లు గురువారం (మార్చి 27ఢిల్లీలో ముగిసిన రెండో ఖేలో ఇండియా పారా గేమ్స్ లో సత్తా చాటారు. జేఎల్ఎన్ స్టేడియం కాంప్లెక్సులో జరిగిన పారా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఎన్సీఓఈ పవర్ లిఫ్టర్లు ఏడు స్వర్ణాలు సహా పది పతకాలను సొంతం చేసుకున్నారు.

పురుషుల 72 కేజీల విభాగంలో ఝందూ కుమార్మహిళల 45 కేజీల విభాగంలో జస్ప్రీత్ కౌర్మహిళల 61 కేజీల విభాగంలో సీమా రాణిపురుషుల 54 కేజీల విభాగంలో మనీశ్ కుమార్ స్వర్ణ పతకాలు సాధించి జాతీయ రికార్డులను బద్దలు కొట్టారు. వారం క్రితం నోయిడాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రికార్డులు నెలకొల్పిన ఝందూజస్ప్రీత్మనీశ్ ముగ్గురూ.. ఇప్పుడు తమ రికార్డులను తామే బద్దలుకొట్టారు.

2004 వేసవి పారాలింపిక్స్ లో 56 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన సాయ్గాంధీనగర్ పవర్ లిఫ్టింగ్ హెడ్ కోచ్ రాజీందర్ సింగ్ రహేలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఖేలో ఇండియా పారా గేమ్స్ కన్నా కొన్ని రోజుల ముందే జరిగిన జాతీయ ఛాంపియన్ షిప్ లలో స్వర్ణాలు సహా 12 పతకాలు గెలిచి జాతీయ రికార్డులు సృష్టించాం. ఈసారి స్వర్ణాలు, 3 రజతాలు సహా 10 పతకాలు సాధించడంతోపాటు జాతీయ రికార్డులు సృష్టించాం. మొత్తంగా వారం రోజుల్లోనే జాతీయ రికార్డులను బద్దలు కొట్టాంకేపీజీ అంతర్జాతీయ స్థాయి ప్రోత్సాహాన్నిసదుపాయాలను అందిస్తోందిఇప్పుడు మన అథ్లెట్లలో పోటీ భయం పోయిందివారు ఆత్మవిశ్వాసంతో ఉన్నారుఇకముందూ ఇలాగే మంచి ప్రదర్శన కొనసాగిస్తారు’’ అన్నారు.

కేఐపీజీ-2025లో జాతీయ రికార్డులను నెలకొల్పినవారితో సాయ్-గాంధీనగర్ సహచర అథ్లెట్లు గల్ఫామ్ అహ్మద్ (59 కేజీలు)సందేశ బీజీ (80 కేజీలు)పరమ్‌జీత్ కుమార్ (49 కేజీలుప్రధాన వేదికను పంచుకున్నారుఇదే కేంద్రానికి చెందిన శివ కుమార్ (49 కేజీలు)రాముభాయ్ బాబూభాయ్ (72 కేజీలు)రాహుల్ జోగ్రాజియా (88 కేజీలురజత పతకాలను గెలుచుకున్నారు.

2019లో ఎన్సీఓఈ (జాతీయ అత్యున్నత శిక్షణ కేంద్రం)గా నెలకొల్పిన సాయ్గాంధీనగర్.. దేశంలో పారా పవర్ లిఫ్టింగ్ లో ప్రధాన శిక్షణ కేంద్రంగా ఎదిగిందిఈ కేంద్రం కొన్నేళ్లుగా సాధిస్తున్న పురోగతిని రహేలు వివరించారు2016లో నేను సాయ్గాంధీనగర్ లో చేరానుఅప్పటినుంచి క్రమంగా మెరుగుపడుతున్నాం2022 నాటికి యువ అథ్లెట్లు శిక్షణ కోసం క్రమం తప్పకుండా రావడం మొదలైంది. గత నాలుగైదేళ్లలో ఈ కేంద్రం రూపురేఖలు మారిపోయాయి. మొదట ఇక్కడ ఆధునిక ఫిట్నెస్ సెంటర్ మాత్రమే ఉండేదికానీఇప్పుడు అంతర్జాతీయ పోటీల్లో ఉపయోగించే ప్రపంచ స్థాయి సౌకర్యాలుఎయిర్ కండిషనింగ్ఎలికో సెట్లతో కూడిన ప్రత్యేక పవర్ లిఫ్టింగ్ హాల్ ఇక్కడుందిమన రీకవరీ కేంద్రాలు కూడా అత్యుత్తమంగా ఉన్నాయి’’ అని రాజీందర్ సింగ్ రహేలు తెలిపారు.

ఇది స్థిరమైన దశల వారీ అభివృద్ధి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలుపరికరాల పరంగా సాయ్గాంధీనగర్ భారతదేశపు నం.1 పారా పవర్ లిఫ్టింగ్ కేంద్రంగా ఉంది” అని అర్జున పురస్కారాన్ని కూడా గెలుచుకున్న రహేలు వివరించారు.

కేఐపీజీ-2025లో విజయం సాధించడంతో.. ఈ 51 ఏళ్ల కోచ్ మరిన్ని పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. “ఈ అక్టోబరులో ఈజిప్టులో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్ లో కనీసం 3-4 పతకాలు గెలవడమే మా తదుపరి లక్ష్యంప్రస్తుతానికిప్రపంచ ఛాంపియన్ షిప్ లో పతకం సాధించిన ఏకైక భారతీయుడు పరమ్ జీత్ కుమార్. ఆయనా మా కేంద్రానికి చెందినవారే’’ అని ఆయన చెప్పారు.

వచ్చే ఏడాది కామన్వెల్త్ఆసియా క్రీడలు జరగనున్న నేపథ్యంలో పూర్తి అంకితభావంతో సన్నద్ధమవుతున్నాంభవిష్యత్ పారాలింపిక్ పతక విజేతలను ఈ కేంద్రం తీర్చిదిద్దుతుందిమేం చరిత్ర సృష్టించగలమని బలంగా నమ్ముతున్నాంమన అథ్లెట్లు సమర్థులువారు మంచి ప్రదర్శనలు కనబరుస్తారు’’ అని సాయ్ మీడియా విభాగంతో రహేలు చెప్పారు.

కేఐపీజీ- 2025... మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి: స్వాగతం కేఐపీజీ 2025

ఖేలో ఇండియా పారా గేమ్స్ గురించి:

ఖేలో ఇండియా పారా గేమ్స్ ఖేలో ఇండియా మిషన్ లో భాగంగా ఉన్నాయి. ప్రతిభావంతులైన అథ్లెట్లు తమ క్రీడాపోటీ నైపుణ్యాలను ప్రదర్శించడం కోసం అత్యుత్తమ వేదికగా ఇది నిలుస్తుందిఖేలో ఇండియా పారా గేమ్స్ తొలి ఎడిషన్ ను 2023 డిసెంబరులో న్యూఢిల్లీలో మూడు వేదికల్లో నిర్వహించారుఏడు క్రీడా విభాగాల్లో ఆ క్రీడలను నిర్వహించారు. కేఐపీజీ రెండో ఎడిషన్ ఈ ఏడాది మార్చి 20 – 27 మధ్య రాజధానిలో మూడు వేదికల్లో జరిగింది. ఆరు క్రీడల్లో ఈ పోటీలు నిర్వహించారు.  

 

***


(Release ID: 2116198) Visitor Counter : 37