రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

‘టెక్‌కృతి- 2025’ను ఐఐటీ కాన్పూర్‌లో ప్రారంభించిన సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్..


సాంకేతిక పరిజ్ఞ‌ానం, ఔత్సాహిక పారిశ్రామికత్వం విషయాల్లో ఆసియాలో అతి పెద్ద అంతర్ కళాశాలల ఉత్సవం

Posted On: 28 MAR 2025 10:40AM by PIB Hyderabad

‘‘టెక్‌కృతి- 2025’ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్జనరల్ అనిల్ చౌహాన్ ఐఐటీ కాన్పూర్‌లో ప్రారంభించారుఇది సాంకేతిక పరిజ్ఞ‌ానంఔత్సాహిక పారిశ్రామికత్వం విషయాల్లో ఆసియాలో అతి పెద్ద అంతర కళాశాలల ఉత్సవం. ‘ఫైర్‌సైడ్ చాట్’ కార్యక్రమంలో ఆయన భారత సాయుధ దళాల్లో ఉన్నతీకరణఆధునికీకరణలు చోటుచేసుకోవాల్సిన ఆవశ్యకతపై ప్రసంగించారురాబోయే కాలంలో యుద్ధాల పరంగాప్రత్యేకించి సైబర్ జగతిలోకృత్రిమ మేధ రంగంలోక్వాంటమ్జ్ఞ‌ాన ప్రధాన రంగాల్లో ఎదురుకాగల సరికొత్త సవాళ్లకు ఎదురొడ్డడానికి ఎలా సన్నద్ధం కావాలో అనే విషయాలపై తన ద‌ృష్టి కోణాన్ని కూడా ఆయన వివరించారు.

ఈ సందర్భంగా జనరల్ అనిల్ చౌహాన్ తన ప్రసంగంలో భావి భద్రత సంబంధ సవాళ్లను ఎదిరించడానికి సాంకేతిక ప్రగతివ్యూహాత్మక ఆలోచన విధానంమార్పులకు తగ్గట్టు మనను మనం మలచుకోవడానికి ప్రాముఖ్యం ఇవ్వాలని స్పష్టం చేశారుక్రమశిక్షణదృఢత్వంధైర్య-సాహసాలుత్యాగం వంటి విలువలను ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ విద్యార్థులుపండితులుఎన్‌సీసీ క్యాడెట్లతో కూడిన యువ శ్రోతలలో ప్రేరణను నింపారు. ‘టెక్‌కృతి 2025’లో ఆయన చెప్పిన ఉత్సాహపూరితమైన విషయాలు విద్యార్థులలో రక్షణటెక్నాలజీ రంగాల్లో తమ కెరియర్‌ను తీర్చిదిద్దుకోవాలన్న స్ఫూర్తిని రగిలించాయి.

ప్రారంభ కార్యక్రమంలో ఏఓసీ-ఇన్-సీసెంట్రల్ ఎయిర్ కమాండ్‌ ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్‌తోపాటు ఐఐటీ కాన్పూర్ డైరెక్టరు ప్రొఫెసర్ మణీంద్ర అగ్రవాల్ఇతర అతిథులు పాల్గొన్నారుఈ సంవత్సర కార్యక్రమానికి ఇతివృత్తంగా ఎంపిక చేసిన ‘‘పంతా రేయి’’ టెక్నాలజీనవకల్పనలు నిరంతరంగా అభివృద్ది చెందుతూ ఉండడాన్ని ప్రధానంగా చాటిచెబుతోంది. ‘టెక్‌కృతి 2025’ టెక్నాలజీఔత్సాహిక పారిశ్రామికత్వంసహకారాలకు సంబంధించిన ఒక అసాధారణ ఉత్సవంలా మారే వాగ్దానాన్ని నెరవేరుస్తూమరో వైపు నుంచి పరిశోధననవకల్పనల హద్దులను విస్తరించనుంది.

రక్షాకృతి’ పేరుతో ఒక ప్రత్యేక విభాగం ‘టెక్‌కృతి 2025’లో ఒక ప్రముఖ విశేషాంశంగా నిలిచిందిఇది అత్యాధునిక రక్షణ రంగ టెక్నాలజీని కళ్లకు కట్టే అచ్చమైన డిఫెన్స్ ఎక్స్‌పోసాయుధ దళాలువిద్య రంగ ప్రముఖులురక్షణ పరిశ్రమ.. వీటి మధ్య మరింత సమన్వయం ఏర్పడాలని జనరల్ అనిల్ చౌహాన్ చెబుతూఔత్సాహిక టెక్నాలజిస్టులతో ముఖాముఖి సంభాషించారుఈ కార్యక్రమం పరిశోధకులకు పరిశ్రమ ప్రముఖులను కలుసుకోవడానికి ఒక చక్కని వేదికను అందించిందిఇది స్వయంచోదిత డ్రోన్ల వంటి ఉన్నత టెక్నాలజీలను అభివృద్ధిపరచడం, దేశ భద్రతను పటిష్టపరచడంతోపాటు దిగుమతులపై ఆధారపడడానికి వీలు కల్పించింది.

 

***


(Release ID: 2116098) Visitor Counter : 46