ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
వేలిముద్రల అల్గారిథంలో వయసు మార్పును పరీక్షించడానికి బయోమెట్రిక్ ఛాలెంజ్ ప్రారంభించిన యూఐడీఏఐ, ఐఐఐటీ-హెచ్
* చిన్నారుల వేలిముద్ర ప్రామాణికతను పెంచడమే ఈ పోటీల లక్ష్యం
* బయోమెట్రిక్ చాలెంజ్ పోటీల్లో 7.7 లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు యూఐడీఏఐతో కలసి పనిచేసే అవకాశం
Posted On:
27 MAR 2025 7:21PM by PIB Hyderabad
బయోమెట్రిక్ అల్గారిథంలో వయసు మార్పులను పరీక్షించడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ), ఐఐఐటీ- హైదరాబాద్ సహకారంతో విస్తృత స్థాయిలో ఒక పోటీని ప్రారంభించింది. మార్పులకు శ్రీకారం చుట్టే బయోమెట్రిక్ పోటీల మొదటి దశలో వేలిముద్ర ప్రామాణికతపై దృష్టి సారిస్తారు. 5-10 ఏళ్ల వయసున్న చిన్నారుల్లో 1:1 సరిపోల్చే, 5-10 ఏళ్ల తర్వాత అప్టేడ్ చేసే అల్గారిథంలను పరీక్షిస్తారు. ఈ పోటీలో పాల్గొనేవారు సమర్పించిన అల్గారిథంను సురక్షితమైన పద్ధతుల్లో మూల్యాంకనం చేస్తారు. ఆ డేటాను ఇతర పోటీదారులు లేదా బయటి వారితో పంచు కోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
అంతర్జాతీయ స్థాయిలో పోటీల నిర్వహణ
యూఐడీఏఐకి మాత్రమే సొంతమైన, క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి బయోమెట్రిక్ నమూనాల కచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను, డెవలపర్లను ఆహ్వానించారు. ఈ పోటీలు మార్చి 25 నుంచి మే 25 వరకు జరుగుతాయి రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన వివరాలు https://biochallenge.uidai.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
ఈ పోటీల ద్వారా రూ. 7.7 లక్షల (9,000 యుఎస్ డాలర్లు) విలువైన బహుమతులతో పాటు బయోమెట్రిక్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో యూఐడీఏఐతో కలసి పనిచేసే అవకాశం లభిస్తుంది. వేలిముద్రలకు సంబంధించిన పోటీలు ముగిసిన తరువాత ఐరిష్, ముఖ గుర్తింపునకు సంబంధించిన పోటీలను యూఐడీఏఐ నిర్వహిస్తుంది. భారత్‌లో సుపరిపాలన, డిజిటల్ సమ్మిళితత్వానికి ప్రధాన కేంద్రంగా ఆధార్ పని చేస్తోంది. ఆధార్ నంబర్ ఉన్నవారు వివిధ సేవలు, ప్రయోజనాల పొందేందుకు గాను ప్రతి రోజూ దాదాపుగా 90 మిలియన్ల ప్రామీణీకరణ లావాదేవీలను నిర్వహిస్తున్నారు.
***
(Release ID: 2116059)