భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పెట్టుబడి, ఉపాధి అవకాశాలు, వృద్ధిని ప్రోత్సహించేందుకు ఆటోమొబైల్, ఆటో విడిభాగాల రంగాల్లో పీఎల్ఐ పథకం
Posted On:
27 MAR 2025 11:59AM by PIB Hyderabad
ఆటోమొబైల్, ఆటో విడిభాగాల రంగానికి సంబంధించి రూ. 25,938 కోట్లు ఖర్చయ్యే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి (పీఎల్ఐ) కేంద్ర మంత్రివర్గం 15.09.2021న ఆమోదం తెలిపింది. ఉత్పాదన ఖర్చు సేకరణ అవరోధాలను తొలగించేందుకు ఉద్దేశించిన పీఎల్ఐ-ఆటో పథకం, దేశీయంగా ఏఏటీ (అత్యాధునిక ఆటోమోటివ్ సాంకేతికత) ఉత్పత్తుల తయారీకి ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఏఏటీ ఉత్పత్తుల దేశీయ ఉత్పాదనకు అవసరమైన తాజా పెట్టుబడులను పెట్టేందుకు పరిశ్రమలకు ప్రోత్సాహం, తద్వారా ఉపాధి అవకాశాల పెంపు జరిగేలా పథకాన్ని రూపొందించారు. ఆమోదం పొందిన మార్గదర్శకాల ఆధారంగా పీఎల్ఐ-ఆటో పథకం అమలవుతోంది.
మారుతున్న పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా పీఎల్ఐ-ఆటో పథకం స్పందిస్తోంది. సంబంధిత వర్గాలతో విస్తృత సంప్రదింపుల అనంతరం 19 ఏఏటీ వాహనాలు, 103 ఏఏటీ విడిభాగాల యూనిట్లు 09.11.2021 నాటికి పథకం కిందకి వస్తాయని భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రకటించింది.
మేక్ ఇన్ ఇండియా ప్రచారాన్ని ప్రోత్సహించేందుకు, అధునాతన ఆటోమోటివ్ ఉత్పత్తుల దేశీయ తయారీని పెంచేందుకు, ప్రోత్సాహకాల లబ్ధి పొందేందుకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా 50% డీవీఏని సాధించాలి. దిగుమతుల తగ్గింపు, దేశీయ, ప్రపంచ సరఫరా వ్యవస్థలను ఏకకాలంలో సృష్టించడం అనే రెండు ఫలితాలను సాధించడం డీవీఏ ప్రమాణం లక్ష్యం. పీఎల్ఐ-ఆటో స్కీమ్ మార్గదర్శకాలు, ఎస్ఓపీలను కూడా సంబంధిత పక్షాలతో విస్తృత శ్రేణి సంప్రదింపుల అనంతరమే రూపొందించారు. దేశీయ విలువ జోడింపును(డీవీఏ) గణించే ప్రక్రియను ప్రామాణీకరించడానికి, సమష్టిగా అనుసరించవలసిన ప్రక్రియను పేర్కొనే ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)తో టెస్టింగ్ ఏజెన్సీలు ముందుకు వచ్చాయి. భాగస్వాములందరికీ ఉన్నత స్థాయి భరోసాను కల్పించడం ఎస్ఓపీ లక్ష్యం. ఇప్పటివరకు, 6 ఓఈఎంలు 66 ఆమోదించబడిన వేరియంట్‌ల కోసం డీవీఏ సర్టిఫికేట్‌ను పొందగా మరో 7 విడిభాగాల తయారీదార్లు 22 ఆమోదించబడిన వేరియంట్‌లకు డీవీఏ ప్రమాణపత్రాన్ని పొందాయి. ప్రస్తుతం ఓఈఎం విభాగం కింద ఆరుగురు దరఖాస్తుదారులు 66 వేరియంట్‌లకు డీవీఏ ధృవీకరణను పొందగా కాంపోనెంట్ ఛాంపియన్ కేటగిరీ కింద ఏడుగురు దరఖాస్తుదారులు 22 వేరియంట్‌లకు డీవీఏ ధృవీకరణను పొందారు.
పెట్టుబడులు, ఉపాధి, అమ్మకాలు, పెరుగుతున్న పంపిణీ సొమ్ముల దృష్ట్యా పథకం ప్రభావం:
పెట్టుబడులు: డిసెంబర్ 2024 నాటికి పథకం కింద రూ. 25,000 కోట్ల విలువగల మూలధన పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకొచ్చాయి. కొత్త ఉత్పాదక వ్యవస్థలు, పాత వాటి నవీకరణ ఖర్చు కూడా ఇందులో మిళితమై ఉంది. ఈవీ తయారీ సామర్ధ్య మెరుగుదల కోసం భారీ పెట్టుబడులను పెట్టేందుకు టాటా మోటర్లు, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.
ఉపాధి: ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థల నిర్వహణ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ) వంటి రంగాల్లో పథకం వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించింది. ముఖ్యంగా, తయారీ కేంద్రాల్లోని ఈవీ యూనిట్లు పెద్దయెత్తున స్థానిక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.
అమ్మకాలు: ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), కీలక విడిభాగాలు వంటి రంగాల్లో అమ్మకాల్లో ఊపందుకున్నాయి. ఈవీల్లో కొత్త రకం మోడళ్ళ విడుదల అమ్మకాల్లో వృద్ధికి దారితీసింది.
పంపిణీ: పథకం తొలిసారి 2023-24 ఆర్థిక సంవత్సరంలో అమలవగా, సంబంధిత నిధుల పంపిణీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగింది. ఇప్పటివరకూ పథకం ద్వారా మొత్తం రూ. 322 కోట్లను ప్రోత్సాహకాల రూపేణా పంపిణీ చేశారు.
Parameter
|
Actual Reported up to Dec-2024 (Cumulative)
|
Investment (₹ crore)
|
25,219
|
Incremental Sales (Base Year FY2019-20) (₹ crore)
|
15,230
|
Employment (nos.)
|
38,186
|
Incentive Disbursement (₹ crore)
|
322
|
దేశ ఆటోమోటివ్ ఉత్పాదన వాతావరణాన్ని సుసంపన్నం చేయడంలో పీఎల్ఐ-ఆటో పథకం పరివర్తనాత్మక పాత్ర పోషిస్తోంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశ పరిశ్రమలను ప్రపంచ సరఫరా వ్యవవస్థలతో అనుసంధానించడం అదనంగా సమకూరుతున్న ప్రయోజనాలు.
****
(Release ID: 2115703)
Visitor Counter : 24