బొగ్గు మంత్రిత్వ శాఖ
దేశీయ బొగ్గు నిల్వల ద్వారా ఇంధన భద్రత
Posted On:
26 MAR 2025 12:59PM by PIB Hyderabad
దేశ ఇంధన భద్రతకు సరిపడా దేశీయ బొగ్గు నిల్వలు భారత్ లో ఉన్నాయి. ఇది దేశ 55% ఇంధన అవసరాలను తీరుస్తుంది. జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రకారం 2024 ఏప్రిల్ 1 నాటికి దేశంలో బొగ్గు వనరులు 389.42 బిలియన్ టన్నులు, లిగ్నైట్ వనరులు 47.29 బిలియన్ టన్నులు.
దేశంలోని బొగ్గు నిల్వలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాం. వెలికితీత, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచడం కోసం మానవ జోక్యాన్ని తగ్గించేలా భారీ ఉత్పత్తి సాంకేతికతలను బొగ్గు కంపెనీలు ప్రవేశపెట్టాయి. ఇది ఉత్పాదకతను పెంచుతుంది, వ్యయాలను తగ్గిస్తుంది, భద్రతను మెరుగుపరుస్తుంది. బొగ్గును తొలచడం కోసం భూగర్భంలో నిరంతర గని తవ్వకం, ఓపెన్‌కాస్ట్ గనులలో ఉపరితలంలో తవ్వకం కోసం కూడా కార్మికులను నియమించారు. ఖనిజ నిక్షేపాలకు పైన ఉన్న మట్టి, రాళ్లను తొలగించడం కోసం భారీ మట్టి తవ్వకపు యంత్రాలను ఏర్పాటు చేశారు.
దేశ ఇంధన అవసరాలను తీర్చేలా దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో ఇప్పటివరకు అత్యధిక బొగ్గు ఉత్పత్తి 2023-24లో జరిగింది. 2023-2024లో దేశం మొత్తం మీద దేశీయ బొగ్గు ఉత్పత్తి 997.826 మిలియన్ టన్నులు. 2022-23లో జరిగిన 893.191 మిలియన్ టన్నులతో పోలిస్తే దాదాపు 11.71% వృద్ధిని సాధించింది. ప్రస్తుత 2024-25 సంవత్సరంలో ఈ ఫిబ్రవరి వరకు దేశంలో బొగ్గు ఉత్పత్తి 929.15 మిలియన్ టన్నులు (తాత్కాలిక). గతేడాది 2023-24 ఇదే సమయంలో ఉన్న 881.16 మిలియన్ టన్నులతో పోలిస్తే ఇది 5.45% పెరిగింది.
ఇంధన భద్రత కోసం దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం కింది చర్యలు తీసుకుంది:
i. బొగ్గు బ్లాకుల అభివృద్ధిని వేగవంతం చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తోంది.
ii. గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం, 2021 [ఎంఎండీఆర్ చట్టం] అమలు ద్వారా తమ ఆధీనంలో గనులున్న (అణు ఖనిజాలు కాకుండా) యజమానులు తమ వార్షిక ఖనిజ (బొగ్గుతో సహా) ఉత్పత్తిలో 50% వరకు బహిరంగ మార్కెటులో విక్రయించడానికి వీలు కల్పిస్తారు. గనితో అనుసంధానమై ఉన్న ప్లాంట్లు అన్నింటికీ సరిపడా ఉత్పత్తులను సమకూర్చిన అనంతరం, కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ అవకాశం లభిస్తుంది. ఇందుకోసం కొంత అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
iii. బొగ్గు గనుల కార్యకలాపాలను వేగవంతం చేయడానికి బొగ్గు రంగం కోసం అన్ని రకాల ఆమోదాలు ఒకే చోట లభించేలా (సింగిల్ విండో క్లియరెన్స్) పోర్టల్.
iv. బొగ్గు గనుల్లో ముందస్తుగా కార్యకలాపాలను ప్రారంభించేలా వివిధ ఆమోదాలు/ అనుమతులు పొందడం కోసం బొగ్గు బ్లాకుల కేటాయింపును పొందిన సంస్థలకు సహాయపడేలా ప్రాజెక్టు పర్యవేక్షణ యూనిట్.
v. ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన వాణిజ్యపరమైన మైనింగ్ వేలం 2020లో ప్రారంభమైంది. వాణిజ్యపరమైన మైనింగ్ పథకం కింద.. నిర్ణీత ఉత్పత్తి తేదీ కన్నా ముందుగానే ఉత్పత్తి అయిన బొగ్గుకు, ఆ పరిమాణం మేరకు తుది ధరపై 50% రాయితీని కల్పిస్తారు. అంతేకాకుండా, బొగ్గును సంశ్లిష్ట వాయువుగా మార్చడం (గ్యాసిఫికేషన్) లేదా ద్రవీకరణం (లిక్విఫికేషన్)పై (తుదిధరలో 50 శాతం రాయితీ) ప్రోత్సాహకాలను అందించారు.
vi. వాణిజ్యపరంగా బొగ్గు తవ్వకాలకు సంబంధించి నిబంధనలు, షరతులు బొగ్గు వినియోగంపై ఎటువంటి పరిమితి లేకుండా చాలా సరళంగా ఉంటాయి. ఇవి బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి, ముందస్తు చెల్లింపు మొత్తాన్ని తగ్గించడానికి, నెలవారీ చెల్లింపులకు సంబంధించి ముందస్తు చెల్లింపు మొత్తాన్ని సర్దుబాటు చేయడానికి కొత్త కంపెనీలకు అవకాశాన్నిస్తాయి. బొగ్గు గనుల నిర్వహణలో సౌలభ్యాన్ని కల్పించేలా వాటి సమర్థతా ప్రమాణాలను సరళీకరిస్తాయి. పారదర్శకంగా బిడ్డింగ్ ప్రక్రియ జరుగుతుందది. అంతేకాకుండా ప్రభుత్వ లేదా ఆర్బీఐ ముందస్తు అనుమతి అవసరం లేకుండానే (ఆటోమేటిక్ రూట్) 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి అవకాశం ఉంటుంది. జాతీయ బొగ్గు సూచీ ఆధారంగా ఆదాయ భాగస్వామ్య నమూనాకు వీలు కల్పిస్తాయి.
పైన పేర్కొన్న అంశాలతోపాటు దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడం కోసం బొగ్గు కంపెనీలు కింది చర్యలు తీసుకున్నాయి:
బొగ్గు ఉత్పత్తిని పెంచడం కోసం బొగ్గు కంపెనీలు అనేక చర్యలు తీసుకున్నాయి. భూగర్భ గనుల్లో సాధ్యమైన ప్రతిచోటా భారీ ఉత్పత్తి సాంకేతికతలను; ముఖ్యంగా అంతరాయం లేకుండా బొగ్గును తొలచి, లోడ్ చేసే యంత్రాలనూ.. హైవాల్ మైనర్లను ప్రవేశపెట్టడం.
ఓపెన్ కాస్ట్ గనుల్లోని అధిక సామర్థ్యం గల ఎక్స్ కవేటర్లు, డంపర్లు, ఉపరితల మైనర్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం. దానితోపాటు బొగ్గు తరలింపు కోసం బొగ్గు నిర్వహణ ప్లాంట్లు, క్రషర్లు, మొబైల్ క్రషర్లు, ప్రీ-వెయిట్-బిన్‌ల వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం.
ప్రస్తుత దిగుమతి విధానం ప్రకారం బొగ్గును ఓపెన్ జనరల్ లైసెన్స్ కింద ఉంచారు. వినియోగదారులు తమ ఒప్పంద ధరల ప్రకారం తమకు నచ్చిన దగ్గరి నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవచ్చు. ఇందుకోసం నిర్ణీత సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
గత రెండు సంవత్సరాలు- ప్రస్తుత సంవత్సరం (డిసెంబర్ 2024 వరకు) దిగుమతి చేసుకున్న బొగ్గు వివరాలు కింది విధంగా ఉన్నాయి:
బొగ్గు దిగుమతి
(పరిమాణం మిలియన్ టన్నుల్లో, విలువ రూ. మిలియన్లలో)
|
|
కోకింగ్ బొగ్గు
|
కోకింగేతర బొగ్గు
|
మొత్తం బొగ్గు
|
|
పరిమాణం
|
విలువ
|
పరిమాణం
|
విలువ
|
పరిమాణం
|
విలువ
|
2022-23
|
56.05
|
1538399.74
|
181.62
|
2297444.02
|
237.67
|
3835843.76
|
2023-24
|
58.81
|
1330003.62
|
205.72
|
1772150.89
|
264.53
|
3102154.51
|
2023-24-డిసెంబర్-23
|
44.39
|
974011.49
|
155.80
|
1363711.82
|
200.19
|
2337723.31
|
2024-25-డిసెంబర్-24
|
42.75
|
798179.53
|
140.67
|
1116387.09
|
183.42
|
1914566.62
|
వృద్ధి %
|
-3.68
|
-18.05
|
-9.72
|
-18.14
|
-8.38
|
-18.10
|
బొగ్గు దిగుమతులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కింది చర్యలు తీసుకుంది:
i. దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడం
ii. కోకింగ్ బొగ్గు దిగుమతులను తగ్గించి ఉక్కు రంగానికి కోకింగ్ బొగ్గు సరఫరాను పెంచడం కోసం ‘కోకింగ్ కోల్ మిషన్’ ప్రారంభం.
బొగ్గు గనుల తవ్వకాలు ప్రాదేశిక నిర్దిష్ట కార్యకలాపాలు. సుస్థిర మైనింగ్ కోసం ప్రణాళిక, అమలు ద్వారా పర్యావరణ ప్రభావాల విషయంలో అవి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఆమోదం పొందిన పర్యావరణ నిర్వహణ ప్రణాళిక ప్రకారం పర్యావరణ నియంత్రణ చర్యలు చేపడతారు.
మైనింగ్‌కు ముందు, మైనింగ్ తరువాత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి వివరణాత్మక పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నిర్వహించి ‘పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ)’లను సిద్ధం చేస్తారు. అదే ప్రాతిపదికన పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తారు. పర్యావరణ అనుమతుల మంజూరు సమయంలో ఈఎంపీల అమలు కోసం షరతులు/ మితీకరణ చర్యలను నిర్దేశిస్తారు. ప్రాజెక్టు ప్రతిపాదకులు వీటిని పాటించాలి. పర్యవరణ అనుమతులు పొందిన అనంతరం, సంబంధిత రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల జల, వాయు చట్టాల నిబంధనల ప్రకారం.. ప్రాజెక్ట్ ప్రతిపాదకులు వ్యవస్థాపనకు అనుమతి (కన్సెంట్ టు ఎస్టాబ్లిష్- సీటీఈ)ని కూడా పొందుతారు. ఇది ఒకసారి పొందితే సరిపోతుంది. నిర్వహణానుమతులనూ (కన్సెంట్ టు ఆపరేట్- సీటీవో) పొందాల్సి ఉంటుంది- ఇది నిర్దేశిత కాలం మేరకు ఉంటుంది. పర్యావరణ అనుమతులు, సీటీవో మొదలైన వాటిలో నిర్దేశించిన షరతులను పాటిస్తున్నదీ లేనిదీ పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుల వంటి నియంత్రణ సంస్థలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి.
దేశంలోని బొగ్గు గనులలో పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడం కోసం- మొక్కలు నాటడం/ జీవ పునరుద్ధరణ, సామాజిక ఉపయోగం కోసం గనుల నీటి వినియోగం, పర్యావరణ పార్కుల అభివృద్ధి, తక్కువ ఇంధనంతో మంచి ఫలితాలనిచ్చే చర్యలను అవలంభించడం వంటి వివిధ సుస్థిర, పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి లోకసభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2115696)
Visitor Counter : 14