ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గౌరవ తులసీ గబ్బార్డ్ భేటీ
ID: 2112036 Final: GSR
ప్రధానమంత్రి కార్యాలయం
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గౌరవ తులసీ గబ్బార్డ్ భేటీ
వాషింగ్టన్ డీసీలో అధ్యక్షుడు ట్రంప్ తో అత్యంత ఫలవంతమైన చర్చలు జరిగాయని గుర్తు చేసుకున్న ప్రధాని
తన అమెరికా పర్యటన సందర్భంగా గౌరవ తులసీ గబ్బార్డ్ తో చర్చలను గుర్తు చేసుకున్న ప్రధాని..
సహకారాన్ని బలోపేతం చేయడంలో ఆమె పాత్ర ప్రశంసనీయమని కితాబు
అధ్యక్షుడిగా ట్రంప్ రెండో దఫా పదవీ కాలంలో ఆమె భారత పర్యటన విశిష్టతను ప్రస్తావించిన ప్రధాని
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని..
ఈ ఏడాదిలోనే అదీ సత్వరమే ఆయనను భారత్ కు ఆహ్వానించాలని భావిస్తున్నట్లు వెల్లడి
प्रविष्टि तिथि:
17 MAR 2025 8:52PM by PIB Hyderabad
అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గౌరవ తులసీ గబ్బార్డ్ ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
గత నెలలో తన వాషింగ్టన్ డీసీ పర్యటనను, అధ్యక్షుడు ట్రంప్ తో అత్యంత ఫలవంతంగా సాగిన చర్చలను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషంగా గుర్తు చేసుకున్నారు.
తన అమెరికా పర్యటన సందర్భంగా గౌరవ తులసీ గబ్బార్డ్ తో చర్చలను కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. రక్షణ, కీలక సాంకేతికతలు, ఉగ్రవాద నిరోధకత, అంతర్జాతీయ సవాళ్ల పరిష్కారం విషయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు.
అధ్యక్షుడిగా ట్రంప్ రెండో దఫా పదవీ కాలంలో అమెరికా నుంచి భారత్ కు తొలి జరిగిన పర్యటనగా.. ఆమె సందర్శన ఎంతో విశేషమైనదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారత ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిలో అదీ సత్వరమే ఆయనను భారత్ కు స్వాగతించడం కోసం తనతోపాటు 140 కోట్ల మంది భారతీయులు ఎదురుచూస్తున్నారని చెప్పారు.
(रिलीज़ आईडी: 2112221)
आगंतुक पटल : 45
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam