సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీబీ-శబ్ద్‌కు ఏడాది పూర్తి.. మీడియా సంస్థలకు సాయపడడానికి ఉచిత చందా గడువు 2026 మార్చి వరకు పొడిగింపు


* వారంలో ప్రతి రోజూ 50కి పైగా కేటగిరీలలో 1000కిపైగా కథలను చెప్పే న్యూస్ హబ్‌: ‘పీబీ-శబ్ద్‌’.. 1500మందికిపైగా విలేకరులు నేరుగా అందించే వివరాలకు తోడు గత కాల సమాచార సౌలభ్యం మరో అండ


* కొత్త పోర్టళ్లు దూరదర్శన్ (డీడీ), ఆకాశవాణి (ఏఐఆర్)ల విశ్వసనీయ భాండాగార సేవల్ని పొందడానికి మధ్యేమార్గంగా ఉపయోగపడుతున్న పీబీ-శబ్ద్‌

* భారత్‌లోని అన్ని ప్రధాన భాషల్లో టెక్స్ట్‌తోపాటు, శ్రవణ, దృశ్య, చిత్ర ప్రధాన కంటెంటు గుర్తింపు చిహ్నమేదీ లేకుండానే లభ్యం..

Posted On: 13 MAR 2025 3:00PM by PIB Hyderabad


 ప్రసార మాధ్యమ రంగ సంస్థలకు రోజువారీ వార్తా సామగ్రిని టెక్స్ట్, ఫోటోలు, శ్రవణ, దృశ్య ఫార్మేట్‌లలో.. గుర్తింపు చిహ్నం (లోగో) లేకుండా అందజేయడానికి ప్రసార భారతి-షేర్డ్ ఆడియో విజువల్స్ ఫర్ బ్రాడ్‌కాస్ట్ అండ్ డిసెమినేషన్ (పీబీ-ఎస్‌హెచ్ఏబీడీ.. ‘పీబీ-శబ్ద్’)ను 2024 మార్చి నెలలో ప్రారంభించారు. శబ్ద్ ఉచిత సేవలు 2026 మార్చి నెల వరకు అందుతూ ఉంటాయని ప్రసార భారతి ప్రకటిస్తోంది. ఇది మీడియా సంస్థలకు, ప్రత్యేకించి చిన్న చిన్న సంస్థలకు గొప్ప సహాయకారిగా ఉంటుంది.

విస్తృత కవరేజీకి ఉద్దేశించిన భారీ నెట్‌వర్క్

విలేకరులు, కరెస్పాండెంట్లు, స్ట్రింగర్లు.. 1500 మందికి పైగా ఉన్న దృఢ నెట్‌వర్క్, వీరికి తోడు 60 మందితో కూడిన సంపాదక విభాగాలు 24 గంటలూ పనిచేస్తూ ఉన్నాయి. ఈ బలగంతో పీబీ-శబ్ద్ దేశంలో ప్రతి ప్రాంతం నుంచి అత్యంత తాజా వార్తల సమాహారాన్ని అందిస్తోంది. వ్యవసాయం, టెక్నాలజీ, విదేశీ వ్యవహారాలు, రాజకీయ పరిణామాల వంటి 50కి పైగా న్యూస్ కేటగిరీలకు చెందిన 1000కి మించిన స్టోరీస్‌ను భారతదేశంలోని అన్ని ప్రధాన భాషలలో నిత్యం పొందుపరుస్తూ ఉన్నారు. ఈ బృహత్కార్యంలో ప్రధానకేంద్రంతోపాటు  ప్రాంతీయ వార్తా విభాగాలు పాలుపంచుకొంటున్నాయి.

పీబీ-శబ్ద్‌ ముఖ్య విశేషాంశాలు

పీబీ-శబ్ద్‌ ద్వారా అందించే కంటెంటులో గుర్తింపు చిహ్నమేదీ ఉండదు. ఈ ప్లాట్‌ఫారం నుంచి తీసుకొని ఉపయోగించుకొనే కంటెంటుకు ఎలాంటి సౌజన్యాన్ని పేర్కొనాల్సిన అవసరం ఉండదు. దీనికి అదనంగా, ఈ తరహా సేవలో ఒక లైవ్ ఫీడ్ ఫీచరు కూడా ఉంది. ఈ సర్వీసులో భాగంగా, జాతీయ ప్రాముఖ్యమున్న కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసార ఫుటే జీతోపాటు వివిధ పత్రికా విలేకరుల సమావేశాలను కూడా గుర్తింపుచిహ్నమేదీ లేకుండా అందుబాటులో ఉంటాయి.

లభ్యతను మెరుగుపరచడానికి ఆర్కైవల్ లైబ్రరీ రూపంలో ఒక మీడియా భాండాగారాన్ని అందుబాటులో ఉంచారు. దీంతో చందాదారులు ప్రత్యేకంగా సంగ్రహించిన ప్యాకేజీలతో సహా పాత సమాచారాన్ని ఇట్టే పొందవచ్చు.

స్పెషల్ ప్యాకేజీలను, ఇంటర్వ్యూలను, దేశవ్యాప్త నిత్య వాతావరణ సమాచారాన్ని, సంపాదకీయాలను పీబీశబ్ద్‌లో అదేపనిగా పొందుపరుస్తున్నారు. మీడియా సంస్థలు ఈ కంటెంటును తీసుకొని ఎలాంటి కాలయాపనకు తావు లేకుండా వెనువెంటనే సులభంగా ఉపయోగించుకొనటట్లు చూడాలనేదే పీబీశబ్ద్ ఉద్దేశం.  

మీడియా సంస్థలు   shabd.prasarbharati.org  ద్వారా లాగిన్ అయ్యి, పీబీశబ్ద్‌లో చేరవచ్చు.

తాజా సమాచారం కోసం ఎక్స్‌లోనూ, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పీబీ-శబ్ద్‌ను ఫాలో అవండి

మరిన్ని తాజా వివరాలను పొందడానికి,  ఎక్స్ (ఇదివరకటి ట్విటర్)లో అయితే  https://x.com/PBSHABD లోనూ, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే https://www.instagram.com/pbshabd/ లోనూ పీబీ-శబ్ద్ అందుబాటులో ఉంది.


 

***


(Release ID: 2111257) Visitor Counter : 24