ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బంగారం దొంగ రవాణా: స్మగ్లింగ్ రాకెట్ ను పట్టుకున్న డీఆర్ఐ


రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల విదేశీ బంగారంతోపాటు రూ.4.73 కోట్ల విలువైన ఇతర ఆస్తుల స్వాధీనం

Posted On: 05 MAR 2025 10:30AM by PIB Hyderabad

బంగారం దొంగ రవాణాను అరికట్టే చర్యల్లో భాగంగా… బంగారం దొంగ రవాణాను డెరైక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐవిజయవంతంగా పట్టుకుందిఒక ప్రయాణికురాలు విదేశాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న బంగారు బిస్కెట్లను బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారుఈ బంగారం విలువ రూ.12.56 కోట్లుడీఆర్ఐ అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు ఈ నెల 3న దుబాయి నుంచి బెంగళూరుకు చేరుకున్న ఎమిరేట్స్ విమానంలో బంగారం తెస్తున్న 33 ఏళ్ల ప్రయాణికురాలిని పట్టుకున్నారు. 14.2 కిలోగ్రాముల బంగారు బిస్కెట్లను ఆమె తనతో పాటు తీసుకువచ్చినట్లు విచారణలో తేలిందిరూ.12.56 కోట్ల విలువున్న ఈ బంగారాన్ని కస్టమ్స్ చట్టం-1962లోని నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్నారు.

డీఆర్ఐ అధికారులు బెంగళూరు లావెల్ రోడ్డులోని ఆమె నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. ఆమె తన భర్తతో పాటు నివసిస్తున్నారుసోదాలలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు నగలతోపాటు రూ.2.67 కోట్ల భారతీయ నగదు లభించిందినిందితురాలిని కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు.

ఈ కేసులో స్వాధీనం చేసుకొన్న వస్తువుల మొత్తం విలువ రూ.17.29 కోట్లుబంగారం రహస్య వ్యాపారంలో పాలుపంచుకొంటున్న ముఠాలకు దీంతో పెద్ద దెబ్బ తగిలినట్లయిందిబెంగళూరు విమానాశ్రయంలో ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఒక విశేషం

 

***


(Release ID: 2108435) Visitor Counter : 17