ప్రధాన మంత్రి కార్యాలయం
ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ప్రముఖులతో ప్రధానమంత్రి భేటీ
Posted On:
01 MAR 2025 4:07PM by PIB Hyderabad
న్యూదిల్లీలోని భారత్ మండపం వేదికగా నేడు నిర్వహించిన ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఇందులో కార్లోస్ మాంటెస్, ప్రొఫెసర్ జొనాథన్ ఫ్లెమింగ్, డాక్టర్ ఆన్ లీబర్ట్, ప్రొఫెసర్ వెసెల్లిన్ పోపౌస్కీ, డాక్టర్ బ్రియాన్ గ్రీన్, అలెక్ రాస్, ఓలెగ్ ఆర్టెమియేవ్, మైక్ మాసిమినో తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ఈ విధంగా పేర్కొన్నారు:
"ఈరోజు ఎన్ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో కార్లోస్ మోంటెస్‌తో సంభాషించాను. సామాజిక ఆవిష్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కృషి గొప్పది. డిజిటల్ టెక్నాలజీ, ఫిన్‌టెక్, ఇతర రంగాల్లో భారత్ సాధించిన పురోగతిని ఆయన ప్రశంసించారు."
"ఎంఐటీ స్లోవన్ మేనేజ్‌మెంట్ స్కూల్ కు చెందిన ప్రొఫెసర్ జోనాథన్ ఫ్లెమింగ్‌ను కలిశాను. ఆయన జీవ శాస్త్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చేసిన కృషి ఆదర్శప్రాయమైనది. ఈ రంగంలో రానున్న ప్రతిభావంతులకు, ఆవిష్కరణలకు మార్గనిర్దేశం చేయాలనుకుంటున్న ఆయన అభిరుచి కూడా అంతే స్ఫూర్తిదాయకం"
"డాక్టర్ ఆన్ లీబర్ట్‌ను కలవడం ఆనందంగా ఉంది. పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో ఆమె కృషి ప్రశంసనీయం. రానున్న కాలంలో ఎంతో మందికి మెరుగైన జీవనాన్ని అందించనున్నారు.”
``ప్రొఫెసర్ వెస్సెలిన్ పోపౌస్కీని కలవడం చాలా ఆనందదాయకం. రోజు రోజుకీ వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో అంతర్జాతీయ సంబంధాలు, భౌగోళిక రాజకీయాలపై ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైనది.”
"భౌతిక, గణిత శాస్త్రాల పట్ల ప్రబలమైన ఆసక్తిని కలిగిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ బ్రియాన్ గ్రీన్‌ను కలవడం సంతోషంగా ఉంది. ఆయన రచనలకు విస్తృత ప్రశంసలు లభించాయి. ఇవి రాబోయే కాలంలో విద్యాపరమైన చర్చకు అవకాశం కల్పిస్తాయి. @bgreene"
"ఈ రోజు అలెక్ రాస్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఆవిష్కరణ, అభ్యాసానికి సంబంధించిన అంశాలకు పెద్దపీట వేస్తూ, గొప్ప ఆలోచనాపరుడిగా, రచయితగా ఆయన తనదైన ముద్ర వేశారు."
"రష్యాకు చెందిన ప్రముఖ వ్యోమగామి శ్రీ ఒలెగ్ ఆర్టెమియేవ్‌ను కలవడం సంతోషంగా ఉంది. అత్యంత మార్గదర్శకమైన పలు సాహసయాత్రలు చేయడంలో ఆయన ముందున్నారు. ఆయన సాధించిన విజయాలు ఎంతో మంది యువతను సైన్స్, అంతరిక్ష ప్రపంచంలో దూసుకెళ్లేలా ప్రేరేపించాయి. @OlegMKS”
"ప్రఖ్యాత వ్యోమగామి మైక్ మాసిమినోను కలవడం ఆనందంగా ఉంది. అంతరిక్షం పట్ల ఆయనకున్న మక్కువ, దాన్ని యువతలో ప్రాచుర్యంలోకి తీసుకురావడం అందరికీ తెలిసిందే. అభ్యసన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. @Astro_Mike"
(Release ID: 2107330)
Visitor Counter : 21
Read this release in:
Bengali
,
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam