బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు మంత్రిత్వ శాఖపెట్టుబడుల అవకాశాలు, వాణిజ్య బొగ్గు గనుల వేలంపై ముంబయిలో రోడ్ షో నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖ


గనుల భద్రత, సామాజిక సంక్షేమంలో ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన బొగ్గు శాఖ మంత్రి
వాణిజ్య బొగ్గు గనుల 12వ దశ వేలంలో భూగర్బ గనులకు స్థానం

प्रविष्टि तिथि: 28 FEB 2025 2:49PM by PIB Hyderabad

బొగ్గు రంగంలోవాణిజ్య బొగ్గు గనుల వేలంలో పెట్టుబడుల అవకాశాలను ప్రోత్సహించే దిశగా చేపడుతున్న చర్యల్లో భాగంగా బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ రోజు ముంబయిలో ఓ రోడ్ షోను నిర్వహించిందిఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి హాజరయ్యారుబొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగనుల వేలం ప్రక్రియను నిర్వహించే అధికారి (నామినేటెడ్ అథారిటీశ్రీమతి రూపిందర్ బ్రార్మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుభారత్‌లో బొగ్గు తవ్వకాల భవిష్యత్తుకు సంబంధించిన చర్చల్లో నిపుణులుపారిశ్రామిక దిగ్గజాలుపెట్టుబడిదారులువిధాన నిపుణులు సైతం భాగం పంచుకున్నారు.

ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికిసుస్థిర గనుల తవ్వక విధానాలను ప్రోత్సహించే వ్యూహాత్మక వేదికగా ఈ రోడ్ షో పని చేసిందివిధాన సంస్కరణలుసులభతర వ్యాపార పద్ధతులుసాంకేతిక పురోగతులపై ప్రధాన దృష్టి సారించిందిఅలాగే పర్యావరణ సుస్థిరతకుదీర్ఘకాల ఇంధన భద్రతకు భరోసా ఇస్తూనే భారత బొగ్గు రంగం పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడంలో ప్రభుత్వ నిబద్ధతను సైతం తెలియజేస్తుంది.

భారత్ ఆర్థిక వృద్ధిలో ముఖ్యంగా ఇంధన భద్రతను కల్పించడంలో, పెరుగుతున్న పారిశ్రామికవిద్యుత్ రంగ డిమాండ్లను నెరవేర్చడంలో బొగ్గు పోషిస్తున్న కీలకపాత్రను కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి తన కీలకోపన్యాసంలో వివరించారుదేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికిదిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికిసుస్థిరమైన మైనింగ్ పద్ధతులను పాటించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ఘాటించారు.

దేశంలో బొగ్గు ఉత్పత్తిలో సాధించిన గణనీయమైన వృద్ధి గురించి వివరిస్తూ, పరిశ్రమలువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఉన్న ఇంధన అవసరాలను సమర్థవంతంగా తీర్చగలిగిందని మంత్రి స్పష్టం చేశారువిద్యుత్ ఉత్పత్తిదారులువాణిజ్య వినియోగదారులకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం ద్వారా డిమాండ్ సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారుదేశ ఇంధన రంగానికి బొగ్గు వెన్నెముక లాంటిదనివిద్యుత్ ఉత్పత్తిలో 70 శాతానికి పైగా వాటా కలిగి ఉందని మంత్రి తెలిపారువాణిజ్య బొగ్గు తవ్వకాల్లో ప్రైవేటు రంగం భాగస్వామ్యాన్ని పెంపొందించడానికిసులభతర వాణిజ్య విధానాలను ప్రోత్సహించడానికిపర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు మైనింగ్ కార్యకలాపాల్లో ఆటోమేషన్డిజిటల్ మానిటరింగ్ లాంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించడంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి కూడా ఆయన వివరించారువీటికి అదనంగాప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న భూమిలో పెద్ద ఎత్తున అటవీకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు మంత్రి తెలియజేశారుతద్వారా ఎకో-పార్కులుగ్రీన్ బెల్టుజీవవైవిధ్య జోన్లను అభివృద్ధి చేయవచ్చుఅలాగే గనుల మూసివేత ప్రణాళిక ప్రకారంవ్యవసాయంఅటవీగనుల పర్యాటకంతో సహా స్థానికులకు ప్రయోజనం చేకూరేలా మైనింగ్ పూర్తయిన గనులను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా పయనిస్తూ, 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం దేశం కృషి చేస్తోందని శ్రీ కిషన్ రెడ్డి అన్నారుఈ తరుణంలో గనుల భద్రతపునరావాసంనైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూసమాజ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారుసుస్థిరత గురించి ప్రధానంగా వివరిస్తూబొగ్గుపై ఆధారపడిన సమాజాల సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారుఅలాగే కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామనిఈ అంశంలో బొగ్గు సంస్థలు ఉత్తమమైన భద్రతా విధానాను పాటించాలని కోరారుఅంతేకాకుండా  ప్రకృతిని పరిరక్షించేందుకుఈ రంగంలో సుస్థిరతను దీర్ఘకాలం కొనసాగించేందుకు పర్యావరణహిత మైనింగ్ పద్ధతులను అనుసరించాలని సూచించారు.

బొగ్గు రంగంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు చురుకైన విధానాన్ని మంత్రిత్వశాఖ అమలు చేస్తోందని బొగ్గుమంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ తెలిపారుప్రాజెక్టులు అనుమతి పొందడం నుంచి అమలు వరకు ప్రతి దశలోనూ పెట్టుబడిదారులకు సహాయం అందించేందుకు మంత్రిత్వశాఖ కట్టుబడి ఉందని తెలిపారునియంత్రణ సంస్థలుసహ మంత్రిత్వ శాఖలను సమన్వయం చేయడం ద్వారా ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసేందుకు అనుమతులు వేగవంతం చేస్తామని తెలిపారు.

బొగ్గు  గనుల కేటాయింపు ప్రక్రియలో అడ్డంకులను తగ్గించడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికిమంత్రిత్వ శాఖ అనుమతులకు త్వరితగతిన ఆమోదం తెలుపుతోందని ఆయన పేర్కొన్నారు.  గనుల తవ్వకం పూర్తయిన ప్రదేశాల్లో జీవవైవిద్యాన్ని పరిరక్షించేందుకు అటవీకరణను చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని తెలియజేశారుఅలాగే గనుల మూసివేత ప్రక్రియలో బాధ్యతాయుతమైన పద్ధతులను అవలంబించడంభారత సుస్థిర లక్ష్యాలకు అనుగుణంగా మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడంపై మంత్రిత్వ శాఖ దృష్టి సారించిందని తెలిపారుత్వరలో జరగనున్న 12వ దశ వేలం ప్రక్రియలో భూగర్భ గనులను కూడా చేరుస్తున్నామనిఅదనపు ఆర్థిక ప్రోత్సహకాలు అందిస్తామని ఆయన ప్రకటించారుత్వరలో జరిగే బొగ్గు గనుల వేలంలో పాల్గొనాల్సిందిగా పారిశ్రామిక దిగ్గజాలనుపెట్టుబడిదారులను ఆహ్వానించారునియంత్రణా సంస్థల మద్ధతుఆర్థిక ప్రోత్సహకాలువ్యాపారంలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు వ్యవస్థీకృత విధానాలతో సహా ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారుపెట్టుబడులుఆవిష్కరణలకు దేశీయ బొగ్గు రంగం అపారమైన అవకాశాలను అందిస్తుందనిస్వయం సమృద్ధి సాధించినస్థిరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుందని అన్నారు.

బొగ్గు మైనింగ్‌లో ప్రైవేటు రంగం భాగస్వామ్యానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యం గురించి బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శినామినేటెడ్ అథారిటీ అయిన శ్రీమతి రూపిందర్ బ్రార్ తన స్వాగతోపన్యాసంలో వివరించారుపారదర్శకమైనపోటీతత్వం నిండినపెట్టుబడిదారులకు అనుకూలమైన బొగ్గు రంగాన్ని తీర్చిదిద్దడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఆమె తెలియజేశారుపెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న ప్రోత్సాహకాల గురించి ప్రస్తావిస్తూ సుదీర్ఘాభివృద్ధి దిశగా విధానాలు రూపొందించాలని నిపుణులను ఆమె కోరారువిద్యుత్ ఉత్పత్తితో పాటు ఇతర అవసరాలకు సైతం బొగ్గు వినియోగించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని దీనివల్ల బొగ్గును వినియోగ వస్తువుగా మార్కెట్ చేసుకోవడానికి మైనింగ్ సంస్థలకు మరింత సౌలభ్యం ఏర్పడిందని అన్నారు.

పెట్టుబడి సామర్థ్యంనియంత్రణల్లో సంస్కరణలుసుస్థిర చర్యలుబొగ్గు గ్యాసిఫికేషన్ విధానాలపై రోడ్ షోలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివరంగా చర్చించారువిధాన రూపకర్తలుపారిశ్రామికవేత్తల మధ్య ప్రత్యక్ష సంభాషణకు ఒక వేదికను ఈ రోడ్ షో కల్పించిందితద్వారా త్వరలో జరగబోయే బొగ్గు గనులు వేలంసాంకేతిక పురోగతులుసుస్థిరమైన బొగ్గు మైనింగ్‌లో ఉత్తమ పద్ధతులుసులభతర వ్యాపార పద్ధతులకు విధానపరమైన తోడ్పాటుప్రాజెక్టు ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడం తదితర అంశాలపై ఆలోచనాత్మక చర్చలు సాగాయి.

రోడ్ షోలో భాగంగా నిర్వహిచిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో విధానాలువేలం ప్రక్రియబొగ్గు రంగంలో వృద్ధికి అవకాశాలపై తమ సందేహాలను అధికారులను అడిగి పెట్టుబడిదారులు నివృత్తి చేసుకున్నారుసందేహాలకు సమగ్రంగా సమాధానాలు ఇవ్వడం ద్వారా ఈ రంగంలో అనుసరిస్తున్న పారదర్శకమైనపెట్టుబడిదారులకు అనుకూలమైన విధానంపై నమ్మకం ఏర్పడింది.

భారత్‌లో బొగ్గు తవ్వకాలల్లో పెట్టుబడులను ప్రోత్సహించడందేశీయంగా ఉత్పత్తిని పెంపొందించడంసుస్థిర భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రయత్నాల్లో ముఖ్యమైనది ఈ ముంబై రోడ్ షోపెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలోపేతం చేయడానికిఆవిష్కరణలను ప్రోత్సహించడానికిఆత్మ నిర్భర భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశ ఇందన భద్రతా లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేస్తోంది.

 

***


(रिलीज़ आईडी: 2107281) आगंतुक पटल : 41
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil