@font-face { font-family: 'Poppins'; src: url('/fonts/Poppins-Regular.ttf') format('truetype'); font-weight: 400; font-style: normal; } body { font-family: 'Poppins', sans-serif; } .hero { background: linear-gradient(to right, #003973, #e5e5be); color: white; padding: 60px 30px; text-align: center; } .hero h1 { font-size: 2.5rem; font-weight: 700; } .hero h4 { font-weight: 300; } .article-box { background: white; border-radius: 10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 40px 30px; margin-top: -40px; position: relative; z-index: 1; } .meta-info { font-size: 1em; color: #6c757d; text-align: center; } .alert-warning { font-weight: bold; font-size: 1.05rem; } .section-footer { margin-top: 40px; padding: 20px 0; font-size: 0.95rem; color: #555; border-top: 1px solid #ddd; } .global-footer { background: #343a40; color: white; padding: 40px 20px 20px; margin-top: 60px; } .social-icons i { font-size: 1.4rem; margin: 0 10px; color: #ccc; } .social-icons a:hover i { color: #fff; } .languages { font-size: 0.9rem; color: #aaa; } footer { background-image: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); } body { background: #f5f8fa; } .innner-page-main-about-us-content-right-part { background:#ffffff; border:none; width: 100% !important; float: left; border-radius:10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 0px 30px 40px 30px; margin-top: 3px; } .event-heading-background { background: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); color: white; padding: 20px 0; margin: 0px -30px 20px; padding: 10px 20px; } .viewsreleaseEvent { background-color: #fff3cd; padding: 20px 10px; box-shadow: 0 .5rem 1rem rgba(0, 0, 0, .15) !important; } } @media print { .hero { padding-top: 20px !important; padding-bottom: 20px !important; } .article-box { padding-top: 20px !important; } }
WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రపంచ వేదికకు చేరుకున్న భారత గేమింగ్ విప్లవం:


వేవ్స్ సమిట్ లో ‘భారత్ టెక్ ట్రయంఫ్ ప్రోగ్రాం’ మూడో సీజన్ విజేతలు 20 మంది

మే 1 నుంచీ 4 వరకూ జరిగే కార్యక్రమంలో ప్రపంచ పెట్టుబడిదార్లు, ప్రచురణకర్తలు, పరిశ్రమల ప్రముఖుల ముందు విలక్షణమైన గేమ్ లు, స్వదేశీ గేమింగ్ ఐపీల ప్రదర్శన

 Posted On: 27 FEB 2025 6:19PM |   Location: PIB Hyderabad

ముంబయిఫిబ్రవరి 272025: 

ఫిబ్రవరి 26, బుధవారం నాడు ముగిసిన ‘భారత్ టెక్ ట్రయంఫ్ ప్రోగ్రాం’ (బీటీటీపీమూడో సీజన్ ఫైనల్స్ పోటీలో 20 మంది గేమింగ్ డెవలపర్లను విజేతలుగా ప్రకటించారువీరు మార్చి 17 నుంచీ 21 వరకూ శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే జీడీసీ 2025 పోటీలుభారత్ లో ఏప్రిల్ 3,4,5 తేదీల్లో జరిగే స్టార్టప్ మహాకుంభ్మే నుంచీ వరకూ జరిగే వేవ్స్ సదస్సులో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారుప్రపంచ పెట్టుబడిదార్లుప్రచురణకర్తలుపరిశ్రమల ప్రముఖుల ముందు విలక్షణమైన గేమ్ లుస్వదేశీ గేమింగ్ ఐపీలను ప్రదర్శిస్తారు.

భారత గేమింగ్ రంగంలో ప్రతిభ కనపర్చేవారిని ప్రోత్సహించేందుకు కేంద్ర సమాచారప్రసార మంత్రిత్వశాఖ...  వాణిజ్యపరిశ్రమల శాఖకు చెందిన పరిశ్రమలుఅంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగాలూ సంయుక్తంగా బీటీటీపీని నిర్వహిస్తున్నాయిబీటీటీపీ అనేది ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఈఐసీ), విన్జో గేమ్స్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.  

టెక్ ట్రయంఫ్ ప్రోగ్రాం’ మూడో సీజన్జాతీయఅంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందేందుకు రాచబాట 

ఇప్పటివరకూ జరిగిన మూడు సంచికల్లో దేశంలోని 1500 మంది అత్యుత్తమ గేమ్ డెవలపర్లువిద్యార్థులనూ ఆకర్షించిన బీటీటీపీ- ప్రపంచ సాంకేతికతఐపీల  కోసం మేడ్ ఇన్ ఇండియా’ సృజన, వ్యవస్థాపకతను పెంపొందించే గొప్ప వేదికగా మారింది. భాగస్వామ్యంవ్యాపార విస్తృతి, ఎగుమతి అవకాశాలపరంగా ఈ విడత కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది. యావత్ దేశాన్ని ఆకర్షించిన ఈ మూడో సంచికలో 1000కి పైగా గేమింగ్ స్టూడియోలుఇండీ డెవలపర్లు, ఐఐటీలుఐఐఎంల విద్యార్థులు, పర్సనల్ కంప్యూటర్లు, మొబైల్కన్సోల్ఇమ్మర్సివ్  ప్లాట్‌ఫారమ్‌లలోని టెక్ స్టార్టప్‌లు వంటి విభిన్న రంగాల వారు పాల్గొన్నారుమరింత సమాచారం కోసం   www.thetechtriumph.com  సైట్ ను సందర్శించండి.

సీజన్ 3లో  విజయాన్ని వరించిన గేమ్‌లను డాముఖేష్ అఘి (భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక అధ్యక్షులుసీఈఓ), పద్మశ్రీ ప్రశాంత్ ప్రకాష్ (యాక్సెల్ పార్టనర్స్ వ్యవస్థాపక భాగస్వామి), అర్చన జహాగిర్దార్ (రుకం క్యాపిటల్ సంస్థాపకులుమేనేజింగ్ పార్ట్‌నర్), డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్కలారి క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ రాజు సహా దేశ మేటి పెట్టుబడిదారులువాణిజ్యవేత్తలతో కూడిన జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు.

టెక్ ట్రయంఫ్ ప్రోగ్రాం (భారత్ సంచికసీజన్ విజేతల జాబితా ఇక్కడ

సృజనవృద్ధిసాంకేతికత ఎగుమతిఐపీల పరంగా కీలక మలుపు వద్ద భారత గేమింగ్ రంగం

ఒకవైపు భారతీయ గేమింగ్ పరిశ్రమ అద్భుతమైన వృద్ధి కనపరుస్తున్న కీలక సమయంలో బీటీటీపీ ప్రభావం కూడా బలమైన ముద్ర చూపుతోందిభారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (యూఎస్ఐఎస్పీఎఫ్నివేదిక ప్రకారంప్రస్తుతం భారతీయ గేమింగ్ రంగం విలువ సుమారు బిలియన్ డాలర్లుగా ఉండగా, 2034 నాటికి అది 60 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనాఈ అవకాశాన్ని అంది పుచ్చుకుని  భారతదేశాన్ని ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్గేమింగ్ సాంకేతికతస్వదేశీ ఐపీ సృష్టి వంటి రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు బీటీటీపీ సరైన సమయంలో ఆవిర్భవించిందని చెప్పవచ్చు. "ప్రపంచం కోసం భారతదేశంలో తయారీఅనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నినాదానికి అనుగుణంగా బీటీటీపీను రూపొందించారుగేమింగ్ఏవీజీసీ (యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్), డిజిటల్ స్టోరీ టెల్లింగ్‌లో అవకాశాలను చేజిక్కించుకోవాలని భారతీయ సృజనకర్తలకు ప్రధాని ఇచ్చిన పిలుపు కార్యక్రమానికి స్ఫూర్తిగా నిలుస్తోందిఒకవైపు ప్రధానమంత్రి ఆశయాలుఆకాంక్షలను నెరవేర్చే కార్యక్రమంగామరోవైపు  భారతీయ గేమ్ డెవలపర్ల ప్రతిభను వెలికితీసే కార్యక్రమంగానే కాక, 60 బిలియన్ డాలర్ల గ్లోబల్ గేమింగ్ మార్కెట్‌గా భారత్ అవతరించగలిగే అవకాశాన్ని బీటీటీపీ వంటి ప్రత్యేక వ్యూహంతో రూపొందించిన కార్యక్రమం నెరవేర్చగలదుబీటీటీపీను ఈ రంగంలో భాగస్వాములైనవారి సామూహిక ఆకాంక్షల సమీకరణగా చూడవచ్చు.

సమాచారప్రసార మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి  సి సెంథిల్ రాజన్ మాట్లాడుతూ, "ప్రస్తుతం సుమారు 2.6 లక్షల నిపుణుల సేవలను వినియోగించుకుంటున్న భారతదేశ ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగం గణనీయంగా విస్తరించబోతోంది, 2032 నాటికి 23 లక్షల మందికి ఉపాధి కల్పించగలదని అంచనా…  భారతీయ గేమింగ్ నిపుణులు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అత్యంత విజయవంతమైన ప్రాజెక్టులకు సారధ్యం వహిస్తున్నారు...  సృజనకుసాంకేతిక ఆవిష్కరణలకూ భారత్ సాటిలేని గమ్యంగా అవతరించనుందని వీరి సామర్థ్యం రుజువు చేస్తోందిఅన్నారుమంత్రిత్వశాఖ ప్రారంభించిన వేవ్స్ఏవీజీసీ-ఎక్స్ఆర్  నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వంటి వ్యూహాత్మక కార్యక్రమాలు దేశాన్ని ఏవీసీజీ ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో సహాయ పడతాయని చెప్పారుభారతదేశ ఏవీజీసీ రంగం భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న సమాచారప్రసార మంత్రిత్వ శాఖఈ రంగం ఆర్థిక వృద్ధిఉద్యోగ కల్పనకు చోదకశక్తిగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించిందని చెప్పారు. ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’, ‘టెక్ ట్రయంఫ్ ప్రోగ్రామ్’ వంటి కార్యక్రమాల ద్వారా వేవ్స్ పరిశ్రమ రంగంవిద్యాసంస్థల మధ్య సహకారంకంటెంట్ సృష్టికి ప్రోత్సాహం కల్పిస్తుందనీఅంతర్జాతీయ భాగస్వామ్యాలను సులభతరం చేస్తుందనీ అన్నారు.  

వేవ్స్-2025 నేపథ్యం:

మీడియావినోద రంగాల్లో మైలురాయిగా నిలువనున్న ‘ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్’-వేవ్స్ తొలి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం మహారాష్ట్ర ముంబయిలో మే నుంచి వరకూ నిర్వహిస్తుంది.  

మీరు పరిశ్రమల్లో పని చేసేవారైనాపెట్టుబడిదారులుసృజనకారులు లేదా ఆవిష్కర్తలైనాఇతరులతో అనుసంధానమయ్యేందుకుమీ సృజనకు పదును పెట్టుకునేందుకుమీడియాఎంటర్టైన్మెంట్ రంగాల్లో భాగస్వామ్యానికి వేవ్స్ సమిట్ అనువైన వేదికను కల్పిస్తుంది.

కంటెంట్ సృష్టిమేధో సంపత్తిసాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగాసృజనలో అగ్రగామిగాభారత్ స్థానాన్ని వేవ్స్ ఎన్నో రెట్లు పటిష్ఠపరచనుందిసమిట్ లో  ప్రసార రంగంప్రింట్ మీడియాటెలివిజన్రేడియోసినిమాయానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్ఆడియోసంగీతంఅడ్వర్టైజింగ్డిజిటల్ మీడియాసోషల్ మీడియా వేదికలుజనరేటివ్ ఏఐఆగ్మెంటెడ్ రియాలిటీవర్చువల్ రియాలిటీఎక్స్‌టెన్డెడ్ రియాలిటీ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

మీ సందేహాలకు ఇక్కడ సమాధానం లభిస్తుంది.

మాతో ప్రయాణాన్ని మొదలుపెట్టండివేవ్స్ లో  ఇప్పుడే  నమోదు చేసుకోండి (త్వరలో విడుదల!)

మమ్మల్ని ఈ కింది సోషల్ మీడియా వేదికలపై అనుసరించండి: @PIBMumbai    /PIBMumbai /pibmumbai pibmumbai[at]gmail[dot]com /PIBMumbai /pibmumbai


Release ID: (Release ID: 2106889)   |   Visitor Counter: 49