మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
జంతు సంరక్షకులకు సన్మానం.. సంరక్షణ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న సంక్షేమ బోర్డు
హాజరు కానున్న కేంద్ర సహాయ మంత్రులు ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్, శ్రీ జార్జ్ కురియన్
Posted On:
26 FEB 2025 2:59PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో గురువారం ప్రాణిమిత్ర, జీవదయ పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నట్టు భారత జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్ల్యూబీఐ) ప్రకటించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రులు ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘేల్, శ్రీ జార్జ్ కురియన్ హాజరుకానున్నారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ, పశుసంవర్ధక శాఖ కమిషనర్, ఏడబ్ల్యూబీఐ చైర్మన్ డాక్టర్ అభిజిత్ మిత్రా, రాష్ట్రాల జంతు సంక్షేమ బోర్డులు, జిల్లా జంతు హింస నిరోధక సొసైటీలు (ఎస్పీసీఏలు), గో సేవా ఆయోగ్ లు, జంతు ప్రేమికులు, జంతు సంక్షేమ సంస్థల ప్రతినిధులు ఈ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొంటారు.
ప్రాణిమిత్ర, జీవదయ అనే రెండు విభాగాల్లో అవార్డులు అందించనున్నారు. అయిదు ఉప విభాగాల కింద ప్రాణిమిత్ర పురస్కారాన్ని అందిస్తారు. సంరక్షణ (వ్యక్తిగత), సృజనాత్మక ఆలోచన (వ్యక్తిగత), జీవిత పర్యంత జంతు సేవ (వ్యక్తిగత) పురస్కారాలతోపాటు కార్పొరేట్, పీఎస్ యూలు, ప్రభుత్వ సంస్థలు, సహకార సంస్థల విభాగాల్లో ఒక్కో జంతు సంక్షేమ సంస్థకు రెండు పురస్కారాలను అందిస్తారు. జీవదయ పురస్కారాన్ని - వ్యక్తిగత, జంతు సంక్షేమ సంస్థలు, పాఠశాలలు/ విద్యాసంస్థలు/ ఉపాధ్యాయులు లేదా విద్యార్థులు అనే మూడు ఉప విభాగాల్లో అందిస్తారు:
జంతు సంక్షేమం, సంరక్షణ కోసం విశేష కృషి చేసిన అత్యుత్తమ వ్యక్తులు, సంస్థలను గుర్తించడం ఈ కార్యక్రమ లక్ష్యం. సమాజంలో జంతువుల పట్ల దయ, కరుణను గౌరవించి ప్రోత్సహించడంతోపాటు వాటిపై మానవతా దృక్పథంతో వ్యవహరించేలా పౌరుల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.
భారత జంతు సంరక్షణ బోర్డు గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(Release ID: 2106555)
Visitor Counter : 18