ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడిశా ప్రభ 2024లో పాల్గొననున్న ప్రధానమంత్రి
Posted On:
23 NOV 2024 7:51PM by PIB Hyderabad
‘ఒడిశా ప్రభ 2024’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం సాయంత్రం ఐదున్నర సమయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు.
న్యూఢిల్లీలోని ఒడిశా సమాజ్ ట్రస్టు ప్రతిష్ఠాత్మకంగా ఒడిశా ప్రభ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనిద్వారా ఒడిశా వారసత్వాన్ని పరిరక్షించడంలో, దానిని ప్రోత్సహించడంలో విలువైన సహకారాన్ని అందిస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఈ ఏడాది ఒడిశా ప్రభ కార్యక్రమాన్ని నవంబర్ 22 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నారు. వర్ణశోభితమైన సంస్కృతీ రూపాలను ప్రదర్శిస్తూ, ఒడిశా ఘనమైన వారసత్వాన్ని ఇది కళ్లకు కడుతుంది. దాంతోపాటు శక్తిమంతమైన రాష్ట్ర సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ విలువలు ఇందులో ప్రతిబింబిస్తాయి. ప్రముఖులు, వివిధ రంగాల్లో నిపుణుల ఆధ్వర్యంలో జాతీయస్థాయి సదస్సు లేదా నిపుణుల సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు.
(Release ID: 2106349)
Visitor Counter : 14
Read this release in:
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam