సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సినిమా పోస్టర్ తయారీ పోటీ
Posted On:
24 FEB 2025 7:37PM by PIB Hyderabad
పరిచయం
భారతదేశానికి సినిమాతో గల ప్రగాఢమైన అనుబంధాన్ని ప్రతిబింబించే ప్రతిష్టాత్మక సినిమా పోస్టర్లు కథలు, భావోద్వేగాలను అందంగా చూపిస్తాయి. ఈ కళారూపానికి మరింత ప్రాముఖ్యత కల్పించడానికి, వరల్డ్ ఆడియో-విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ సీజన్ 1’ లో భాగంగా ఫిల్మ్ పోస్టర్ల తయారీ పోటీని ప్రవేశపెట్టింది. ఎన్ ఎఫ్ డి సి -నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్, ఇమేజ్‌నేషన్ స్ట్రీట్ ఆర్ట్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీ భారతీయ సినిమా పోస్టర్ల గొప్ప వారసత్వాన్ని చాటి చెబుతుంది. ఇప్పటికే 296 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ ఈవెంట్, సృజనాత్మకతను ఆవిష్కరించే ఉత్సాహభరిత వేడుక కానుంది. వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) మొదటి ఎడిషన్ మొత్తం మీడియా, వినోద రంగాలను ఒకటి చేసే ప్రత్యేక హబ్ గానూ, స్పోక్ ప్లాట్‌ఫారమ్ గానూ నిలిచింది.

ప్రపంచ దేశాల మీడియా, వినోద రంగాల దృష్టిని భారతదేశంపై కేంద్రీకరింపచేసి, ఆ ప్రతిభను భారత మీడియా, వినోద రంగాలతో అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకున్న అంతర్జాతీయ కార్యక్రమంగా దీనిని నిర్వహిస్తున్నారు.
2025 మే 1 నుంచి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్స్ లో ఈ సదస్సు జరగనుంది. బ్రాడ్ కాస్టింగ్ అండ్ ఇన్ఫోటైన్ మెంట్, ఎవిజిసి- ఎక్స్ఆర్, డిజిటల్ మీడియా అండ్ ఇన్నోవేషన్ , ఫిల్మ్స్-వేవ్స్ అనే నాలుగు కీలక అంశాలపై దృష్టి సారించడం ద్వారా భారతదేశ వినోద పరిశ్రమ భవిష్యత్తును ప్రదర్శించడానికి నాయకులు, ఆవిష్కర్తలు, సాంకేతిక నిపుణులను ఈ కార్యక్రమం ఏకతాటిపైకి తెస్తుంది
ఫిల్మ్ పోస్టర్ మేకింగ్ పోటీ నాల్గవ స్తంభం అయిన ఫిల్మ్స్ కిందకు వస్తుంది, ఇది భారతీయ సినిమా వైభవాన్ని జరుపుకోవడంపై కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రతీకాత్మక చిత్రపట పోస్టర్ల వెనుక ఉన్న కళాత్మక సంపద, కళాకృతిని ప్రముఖంగా చెబుతుంది. ముఖ్యంగా వాటిని సమకాలీన ప్రేక్షకుల కోసం కొత్తగా చూపించడంపై దృష్టి పెడుతుంది.
పోటీ విభాగాలు
ఫిల్మ్ పోస్టర్ మేకింగ్ పోటీ రెండు విభాగాలుగా ఉంటుంది.

డిజిటల్ పోస్టర్లు
రిజిస్ట్రేషన్
డిజిటల్ పోస్టర్ కేటగిరీ అక్టోబర్ 1 న ప్రారంభమైంది. మార్చి 15, 2025 వరకు తెరిచి ఉంటుంది. పాల్గొనడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ రుసుము లేదు. రిజిస్టర్ చేసుకోవడానికి వెబ్సైట్ను సందర్శించండి చిత్రంలో చూపించిన 20 శీర్షికల నుండి ఒక చలనచిత్రాన్ని ఎంచుకోండి::


ముఖ్యమైన గడువులు
అన్ని పోస్టర్లను టైమ్ లైన్ లో పేర్కొన నిర్ధిష్ట గడువులోగా సమర్పించాలి:
v.పోస్టర్ డిజైన్ ఎంట్రీలు ప్రారంభం: అక్టోబర్ 1 - మార్చి 15, 2025
v.తుది పోస్టర్ల సమర్పణ గడువు: మార్చి 15, 2025
v.విజేత ప్రకటన: 1 ఏప్రిల్ 2025
v.ఎంపికైన కళాకారుల ప్రదర్శన, అవార్డుల ప్రదానోత్సవం: ఏప్రిల్, 2025
పోస్టర్ల సమర్పణకు ప్రత్యేక మార్గదర్శకాలు:
*జెపిఇజి/పిఎన్జి ఫైల్ గా సిఎంవైకె లో 300 డిపిఐ వద్ద మీ పోస్టర్లను అప్ లోడ్ చేయండి. పోస్టర్ వర్టికల్ ఓరియెంటేషన్ లో ఉండాలి:
*ప్రామాణిక పరిమాణం: 24 x 36 అంగుళాలు (యాస్పెక్ట్ రేషియో 2:3)
*ప్రత్యామ్నాయ పరిమాణం: 18 x 24 అంగుళాలు (యాస్పెక్ట్ రేషియో 3:4)
*గరిష్ట ఫైల్ పరిమాణం: 10 MB
*ఈ క్రింది ఫైలు నామకరణ నిర్మాణంతో పోస్టర్ కు పేరు పెట్టండి: artistname_filmname_year_waves2024.jpeg
అవార్డులు-గుర్తింపు:
అత్యుత్తమ డిజిటల్ పోస్టర్లను ఎంపిక చేసి, టాప్ 20 పోస్టర్లను వేవ్స్ సమ్మిట్‌లో ప్రదర్శిస్తారు. అందులోని టాప్ 3 పోస్టర్లకు ప్రతిష్టాత్మక అవార్డులు లభిస్తాయి. నగదు బహుమతులు, డిజిటల్ ప్రశంసా పత్రాలు ప్రదానం చేస్తారు. వివరాలు:
చేతితో చిత్రించిన పోస్టర్లు
రిజిస్ట్రేషన్
ఎంపిక చేసిన కళా సంస్థల ద్వారా ఫిల్మ్ పోస్టర్ చేతి తయారీ పోటీలో పాల్గొనవచ్చు. పోటీని నిర్వహించడానికి ఆసక్తి ఉన్న సంస్థలు imagenationstreetart[at]gmail[dot]com with nfaifilmcircle@nfdcindia in cc. కు ఇమెయిల్ చేయవచ్చు.
డిజిటల్ పోస్టర్ మేకింగ్ లిస్ట్ లో ఉన్న విధంగానే 20 సినిమా టైటిల్స్ ఆధారంగా పోస్టర్లు ఉండాలి.
సెమీఫైనల్లో ప్రాతినిధ్యం వహించడానికి ప్రతి సంస్థ తమ అంతర్గత పోటీ నుండి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
ఈ పోటీ సంస్థల ద్వారా మాత్రమే ఉంటుంది. వ్యక్తిగత పోటీలకు అనుమతి లేదు.
ముఖ్యమైన గడువులు
v.ఇంటర్నల్ కాలేజీ పోటీలు: నవంబర్ 1 - మార్చి 15, 2025
vi.షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల ప్రకటన: 2025 ఏప్రిల్ 1
ఫినాలేకు మార్గదర్శకాలు
ప్రత్యక్షంగా చేత్తో పోస్టర్ తయారీ పోటీకి మార్గదర్శకాలు:
ప్రత్యక్షంగా చేత్తో పోస్టర్ తయారీ పోటీకి సినిమా టైటిల్స్ ఆప్షన్లను లైవ్ ఈవెంట్ కు 10 రోజుల ముందు ప్రకటిస్తారు.
పాల్గొనేవారు, వారి సంస్థలు అవసరమైన అన్ని వస్తువులను తెచ్చుకోవాలి.
పాల్గొనే వారికి నిర్వాహకులు ప్రయాణ వివరాలను తరువాత తెలియజేస్తారు.
ప్రత్యక్ష చేతి పెయింటింగ్ పోటీకి మార్గదర్శకాలు
సామగ్రి: పాల్గొనేవారు తమ స్వంత సామగ్రిని తీసుకురావాలి. చేత్తో వేసే పోస్టర్ డిజైన్‌కు అనుకూలమైన కాగితం ఉపయోగించాలి.
పోస్టర్ సైజు: 24 x 36 అంగుళాలు (నిలువు)
అవార్డులు-గుర్తింపు:
సమర్పించిన ఎంట్రీల నుండి జ్యూరీ ఎంపిక చేసిన మొత్తం 25 మంది ప్రత్యక్ష పోటీలో పాల్గొంటారు. వారు వేవ్స్ సమ్మిట్‌లో నిర్ణీత సమయ వ్యవధిలో చేతితో పోస్టర్‌లను తయారు చేయాలి. అగ్ర స్థానంలో నిలిచిన తొలి మూడు పోస్టర్లకు ప్రతిష్టాత్మక అవార్డులు అందుతాయి. మొదటి బహుమతి రూ.50,000, రెండో బహుమతి రూ.30,000, తృతీయ బహుమతి రూ.10,000 ఇస్తారు. మొదటి ముగ్గురు విజేతలకు సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. పాల్గొన్న ఇతరులకు డిజిటల్ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ తో పాటు నగదు బహుమతులు ఇస్తారు.
రిజిస్ట్రేషన్
ఈ పోటీలకు రిజిస్ట్రేషన్ 2025 ఫిబ్రవరి 5న ప్రారంభమయింది. 2025 మార్చి 5న ముగుస్తుంది. పాల్గొనడానికి ఎటువంటి రుసుము లేదు, వెబ్సైట్లో ఇచ్చిన లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఎంట్రీలను సమర్పించవచ్చు. పోస్టర్ సృష్టించడానికి అందుబాటులో ఉన్న 10 టైటిల్స్ నుండి ఒక సినిమాను ఎంచుకోవాలి.

ముఖ్యమైన గడువులు
అన్ని పోస్టర్లను టైమ్ లైన్ లో పేర్కొన్న నిర్ధిష్ట గడువులోగా సమర్పించాలి:
రిజిస్ట్రేషన్, సమర్పణ: ఫిబ్రవరి 5, 2025 - మార్చి 5, 2025
విజేతల ప్రకటన: ఏప్రిల్ 1, 2025
ప్రదర్శన- అవార్డు ప్రదానోత్సవం: ఏప్రిల్ 2025
అర్హత నిబంధనలు
భారతదేశం వెలుపల ఏ దేశానికి చెందిన వ్యక్తులయినా పాల్గొనవచ్చు.
పాల్గొనేవారు 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
పోస్టర్ల సమర్పణకు మార్గదర్శకాలు
*జెపిఇజి/పిఎన్జి ఫైల్ మాదిరి సిఎంవైకె లో 300 డిపిఐ వద్ద మీ పోస్టర్లను అప్ లోడ్ చేయండి. పోస్టర్ వర్టికల్ ఓరియెంటేషన్ లో ఉండాలి:
ప్రామాణిక పరిమాణం: 24 x 36 అంగుళాలు (యాస్పెక్ట్ రేషియో 2:3)
ప్రత్యామ్నాయ పరిమాణం: 18 x 24 అంగుళాలు (యాస్పెక్ట్ రేషియో 3:4)
గరిష్ట ఫైల్ పరిమాణం: 10 MB
అవార్డులు-గుర్తింపు:
అంతర్జాతీయ డిజిటల్ పోస్టర్ తయారీ పోటీ, అసాధారణ సృజనాత్మకతను గుర్తించి, విశేష ఎంట్రీలకు అవార్డులు, గుర్తింపును అందిస్తుంది.
ముఖ్యాంశాలు.
ఎంపిక చేసిన టాప్ 20 డిజిటల్ పోస్టర్లను వేవ్స్ సమ్మిట్ లో ప్రదర్శిస్తారు.
ప్రదర్శన నుంచి టాప్ 3 పోస్టర్ల కు ప్రతిష్ఠాత్మక అవార్డులను అందచేస్తారు.
అవార్డులకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.
ముగింపు
వేవ్స్ సమ్మిట్‌లో నిర్వహించే ఫిల్మ్ పోస్టర్ తయారీ పోటీ, డిజిటల్, చేతి చిత్ర కళారూపాల్లో సృజనాత్మకతను ప్రదర్శించడానికి ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఈ వేదిక ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు కలుసుకుని, సృష్టించి, వినోద పరిశ్రమ ఉజ్వల భవిష్యత్తులో భాగస్వాములు కావచ్చు. ఈ కార్యక్రమం, 2025 మేలో వేవ్స్ సమ్మిట్‌లో ప్రతిష్టాత్మక ప్రదర్శన, అవార్డు ప్రదానోత్సవంతో ముగుస్తుంది.
References:
-
https://wavesindia.org/challenges-2025
-
https://www.nfdcindia.com/waves-poster-challenge-2025/
-
https://x.com/WAVESummitIndia/status/1845466425575735387
***
(Release ID: 2106003)
Visitor Counter : 27