సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రెజొనేట్: ఈడీఎం చాలెంజ్
ఎలక్ట్రానిక్ సంగీతంలో విప్లవానికి శ్రీకారం
Posted On:
19 FEB 2025 3:20PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్ సంగీతంలో విప్లవానికి శ్రీకారం
పరిచయం: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (డబ్ల్యూఏవీఈఎస్.. ‘వేవ్స్’)లో కేంద్ర స్థానాన్ని రెజొనేట్: ది ఈడీఎం చాలెంజ్ తీసుకోబోతోంది. దీనిలో భాగంగా స్వరకల్పన, ప్రత్యక్ష ప్రదర్శన (లైవ్ పర్ఫార్మెన్స్)లో సరికొత్త పోకడలు, సృజనశీలత, సహకారాన్నీ ఓ ఉత్సవంలా నిర్వహించుకోవడానికి ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ (ఈడీఎం)లో ప్రపంచంలోని ప్రతిభావంతులు ఒకే వేదిక మీదకు రాబోతున్నారు. సమాచార, ప్రసార శాఖ సహకారంతో భారతీయ సంగీత పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం ‘‘క్రియేట్ ఇన్ ఇండియా చాలెంజ్’’లో ఓ భాగంగా ఉంది. మిశ్రమ సంగీతం (ఫ్యుషన్), ఎలక్ట్రానిక్ మ్యూజిక్, కళాత్మక సమర్పణ (డీజేయింగ్ ఆర్టిస్ట్రీ)లో ప్రపంచ కూడలి (గ్లోబల్ హబ్)గా భారత్ హోదాను పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశం.
వేవ్స్‌లో నాలుగు ముఖ్య విభాగాలు ఉన్నాయి. అవి.. ప్రసారం- విజ్ఞానం మిళితమైన వినోదం; ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్టులు, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ); డిజిటల్ మీడియా- నవకల్సన; ఫిలింస్ అనేవే. ఈడీఎం చాలెంజ్ అనేది ప్రసారం- విజ్ఞానం మిళితమైన వినోదం విభాగంలో ఓ భాగంగా ఉంది. దీనిలో సాంప్రదాయక పద్ధతులను అనుసరిస్తూనే, మార్పులకు లోనవుతూ ఉండే తరహాల్లో కూడా సమాచారాన్ని, వినోదాన్ని అందించడంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఈ విభాగం కంటెంటు రూపకల్పనకు పెద్ద పీట వేస్తుంది; పౌరులకు సమాచారాన్ని అందించి వారికి సాధికారతను కల్పిస్తుంది; 21వ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్లను లెక్కలోకి తీసుకొంటూ సంగీతాన్ని, వినోదాన్ని ప్రపంచ ప్రేక్షకుల చెంతకు చేర్చడానికి కొత్త కొత్త పద్ధతుల్ని ఈ విభాగం అన్వేషిస్తుంది.
ఈ ఏడాదిలో మే నెల 1 నుంచి 4 వరకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్స్‌లో వేవ్స్ ను నిర్వహించనున్నారు. భారత మీడియా, వినోద (ఎం అండ్ ఈ) పరిశ్రమ మరింత ఉన్నత శిఖరాలను చేరుకొనేలా చూసేందుకు సిద్ధం చేసిన ఒక ప్రతిష్ఠాత్మక వేదిక- వేవ్స్. పరిశ్రమ ప్రముఖులు, ఆసక్తిదారులు (స్టేక్ హోల్డర్స్), సృజనశీలురు కొత్త అవకాశాలను అన్వేషించేలా, నవకల్సనకు చోదకశక్తులుగా మారేలా, వినోద పరిశ్రమ భవిష్యత్తుకు రూపురేఖలను తీర్చిదిద్దేలా ఈ శిఖరాగ్ర సదస్సు వారికి ఒక వేదిక లాగా ఉపయోగపడుతుంది. క్రియేట్ ఇన్ ఇండియా పోటీల కోసం ఇప్పటికే 73,000కు పైగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ పోటీలు సృజనాత్మక శ్రేష్ఠత్వానికి ఒక హుషారైన వాతావరణాన్ని ఏర్పరుస్తున్నాయి. రెజోనేట్: ది ఈడీఎం పోటీని నిర్వహించడం ద్వారా వేవ్స్ ప్రపంచ వినోద రంగంలో భారత్ పాత్రను మరింత బలపరుస్తోందని చెప్పాలి.
అర్హత, పోటీలో పాల్గొనడానికి మార్గదర్శకాలు
విదేశీ కళాకారులు, కంపోజర్లు, సంగీతకారులు, ప్రదర్శనలిచ్చేవారు పాల్గొనవచ్చు. అయితే వారికి ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (ఈడీఎమ్)ను రూపొందించడంలోను, ఆవిష్కరించడంలోను ముందస్తు అనుభవం ఉండాలి. ఈ పోటీకి ఎంపిక చేసిన ఇతివృత్తం ‘‘రెజోనేట్: ది ఈడీఎం చాలెంజ్’’. ప్రపంచ సంగీత శైలులను ఉపయోగించి సాంస్కృతికంగా సుసంపన్నంగా ఉండే, జనసమూహాల్ని కలిపి ఉంచే స్వరకల్పన అనే అంశం ఈ పోటీలో ప్రధానమైన అంశం.
v. పోటీలో పాలుపంచుకోవడానికి ఈ ఏడాది మార్చి నెల 10లోపు నమోదు చేసుకోవాలి.
v. ఈ పోటీలో పాల్గొనేవారి వయస్సు కనీసం 18 ఏళ్లుండాలి.
v. వ్యక్తులు, సృజనశీల జట్లు (ఇద్దరికి మించకూడదు) మాత్రమే దరఖాస్తు చేయాలి. కార్పొరేట్ సంస్థలు దీనిలో పాల్గొనడానికి వీలు లేదు.
v. పాల్గొనే ప్రతి ఒక్కరు లేదా జట్టు ఒక దరఖాస్తును దాఖలు చేయడానికి అనుమతిస్తారు.
v. మనుషులు రూపొందించిన కంటెంటునే ఈ పోటీలో పరిశీలిస్తారు. కృత్రిమ మేధ సాయంతో రూపొందించే సంగీతాన్ని లెక్కలోకి తీసుకోరు.
v. ఈ పోటీలో పాల్గొనడానికి సంబంధించిన నియమాలను మరింత క్షుణ్నంగా అర్థం చేసుకోవడానికి, దయచేసి ఈ కింది లింకును చూడగలరు..:
Terms and Conditions.
పోటీ ఫార్మేట్ ఇలా ఉంటుంది
దరఖాస్తు చేసే పద్ధతి
v. పోటీలో పాల్గొనేవారు ఆ సంగతిని wavesatinfo@indianmi.org కు ఈమెయిల్ చేసి తెలపాలి.
v. వివరాలను నిర్దిష్ట నమూనా ను ఉపయోగించుకొంటూ సమర్పించాలి. నిర్దిష్ట నమూనా కోసం చూడాల్సిన లింకు : Submission Template
న్యాయ నిర్ణయం చేసేందుకు ఉద్దేశించిన ప్రమాణాలు
బహుమతులు, గుర్తింపు... అదనపు సమాచారం కోసం:
· https://wavesindia.org/challenges-2025
· https://indianmi.org/resonate-the-edm-challenge/
· https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2104458
· https://indianmi.org/wp-content/uploads/2025/02/Terms-and-Conditions-Resonate_The-EDM-Challenge.pdf
Click here to see PDF:
***
(Release ID: 2105166)
Visitor Counter : 10