ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘ఈటీ నౌ’ ప్రపంచ వాణిజ్య సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 15 FEB 2025 11:33PM by PIB Hyderabad

శ్రీ వినీత్ జైన్పరిశ్రమల నేతలుసీఈఓలుఇతర గౌరవనీయ ప్రతినిధులుఅందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను!

క్రితం సారి ఈటీ సమిట్ ఎన్నికలు బాగా దగ్గర పడిన సమయంలో ఏర్పాటయ్యిందిమేం పాలన చేపట్టిన మూడోసారి భారత్ మరింత వేగంతో పనిచేస్తుందని అప్పుడు మీకు  సవినయంగా మనవి చేశానుగుర్తుంది కదాఅప్పుడు ప్రస్తావించిన వేగాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా చూడగలగడందేశం నా ఆశయానికి మద్దతుగా నిలవడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోందికొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా బీజేపీఎన్డీఏకు తమ దీవెనలను అందిస్తున్నారువికసిత్ భారత్ (సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంఆశయానికి ఒడిశా ప్రజలు గత జూన్ లో మద్దతునివ్వగాఅటు తరువాత హర్యానా ప్రజలుఇప్పుడు ఢిల్లీ పౌరులూ భారీ మద్దతును తెలిపారువికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజలంతా ఏకతాటిపై నిలబడుతున్నారు అనేందుకు ఇదో తార్కాణం!

మిత్రులారా,

అమెరికా ఫ్రాన్స్ దేశాల పర్యటన ముగించుకుని నేను నిన్న రాత్రే దేశానికి తిరిగి వచ్చానని మీకు తెలుసుఅటు అగ్రదేశాలు కానివ్వండిఇటు వివిధ అంతర్జాతీయ వేదికలు కానివ్వండివీరంతా భారత్ పట్ల మునుపెన్నడూ లేని విధంగా గొప్ప విశ్వాసం చూపుతున్నారుప్యారిస్ లో జరిగిన ఏఐ యాక్షన్ సమిట్ చర్చల్లో ఈ విషయం స్పష్టమయ్యిందిభవిష్యత్తుకు సంబంధించిన అనేక చర్చల్లో ఇప్పుడు భారత్ కేంద్రంగా ఉందినిజానికి కొన్ని చర్చలకు మనమే ప్రాతినిధ్యం వహిస్తున్నాంఅప్పుడప్పుడూ నాకో ఆలోచన వస్తూ ఉంటుంది.. 2014లో ఈ దేశ ప్రజలు మమ్మల్ని ఎన్నుకోకపోయి ఉంటేకొత్త సంస్కరణల వెల్లువ మొదలయ్యేదాఈ మార్పును మనం చూడగలిగేవారమాఊహూఅది సాధ్యపడేదని నేను నమ్మడం లేదుమీ మాటా అంతేననుకుంటానుఅసలు ఇంత పెద్దఎత్తున మార్పులు జరిగేవామీలో హిందీ భాషను అర్ధం చేసుకునే వారికి నేను చెప్పేది వెంట‌నే అర్ధమై ఉంటుందిమేం అధికారంలోకి రాక ముందు కూడా దేశంలో పరిపాలన సాగిందిఅయితే ఇక్కడ రెండు అంశాలు గమనించదగ్గవిఒకటికాంగ్రెస్ హయాంలో నత్తనడకన సాగిన అభివృద్ధిరెండుఆ ప్రభుత్వంలో వేళ్ళూనిన అవినీతి.  ఇవి కొనసాగి ఉంటే ఏమై ఉండేదిదేశానికి కీలకమైన సమయం వృధా అయ్యుండేది! 2014లో కాంగ్రెస్ ప్రకటించిన లక్ష్యం - 2044 కల్లా దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంఅంటే వారి ఆలోచనలుప్రణాళికలు 30 ఏళ్ళ సుదీర్ఘ కాలానికి సంబంధించినవన్న మాటఅదీకాంగ్రెస్ వారి వేగవంతమైన వృద్ధి నమూనా.. ఇక మా ‘వికసిత్ భారత్’ వృద్ధి వేగాన్ని మీరే గమనిస్తున్నారు..  కేవలం ఒక దశాబ్ద కాలంలో భారత్ ప్రపంచ అయిదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో చోటు దక్కించుకుందిరానున్న మరి కొద్ది సంవత్సరాల్లో మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలువగలమని నేను పూర్తి బాధ్యతతోనమ్మకంతో చెబుతున్నాను.  మీరే పోల్చి చూడండి.. మనకి కావలసింది 2044 నమూనానా లేక నేటి శరవేగమైన‌ అభివృద్ధామనవంటి యువ దేశానికి గట్టి వేగం అవసరంమనం సరిగ్గా అటువంటి వేగంతోనే ముందుకి పరుగు పెడుతున్నాం.  

మిత్రులారా..

గత ప్రభుత్వాలు సంస్కరణల పట్ల ఉదాసీనత చూపాయన్న విషయాన్ని మనం మరువకూడదుఈటీ యాజమాన్యం ఈ విషయాన్ని మరిచిపోయి ఉండవచ్చు... కాబట్టి నేను గుర్తు చేస్తున్నానువారు ప్రవేశపెట్టిన అరకొర సంస్కరణలు నమ్మి చేసినవికాకకేవలం తప్పక చేపట్టినవేఅయితే ఈ రోజున దేశంలో అమలవుతున్న  సంస్కరణలను మేం పూర్తి విశ్వాసంతో ప్రవేశపెట్టాంసంస్కరణలు అవసరమావాటి కోసం అంత శ్రమ దేనికి అన్న ధోరణిని గత ప్రభుత్వాలు చూపేవిమనల్ని ఎన్నుకున్నారు... అయిదేళ్ళపాటు హాయిగా అనుభవిద్దాంఅయిదేళ్ళు పూర్తయ్యాక ఎన్నికల సమయం వచ్చాక అప్పుడు చూసుకోవచ్చన్న రీతిలో వారి ఆలోచనలు సాగేవి.  పెను సంస్కరణలు దేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేసి మార్పుకు శ్రీకారం చుడతాయ‌న్న చర్చ జరిగినట్లే కనపడదుమీరంతా వ్యాపార సామ్రాజ్యానికి చెందినవారుమీరు కేవలం అంకెలతో సరిపెట్టుకోక మీ వ్యూహాలను సమీక్షించుకుంటారుఒకప్పుడు లాభాలు తెచ్చిపెట్టిన పద్ధతులైనప్పటికీకాలం చెల్లినవిగా గుర్తిస్తే వాటిని విడిచిపెట్టేందుకు వెనుకాడరుపనికిరాని పద్ధతుల బరువుతో ఏ పరిశ్రమా ముందుకు సాగలేదుఅటువంటి వాటిని వదిలించుకుంటుందిఅయితేకొన్ని ప్రభుత్వాలు స్వాతంత్ర్యానంతరం కూడా సామ్రాజ్యవాద పద్ధతుల బరువుని మోస్తూసొంత ఆలోచనకు తావివ్వక బ్రిటీషు పాలన నాటి విధానాలని కొనసాగించాయిసకాలంలో అందని న్యాయం వ్యర్థం అన్న నానుడిని మీరు వినే ఉంటారుపరిపాలనలో అదొక తారకమంత్రం వంటిదిఎంతోకాలంగా వింటున్న మాటే అయినా సత్వర న్యాయాన్ని అందించేందుకువ్యవస్థని సంస్కరించేందుకు ఎవరైనా గట్టి ప్రయత్నం చేశారాలేదే!  అసమర్థత అలవాటుగా మారిమార్పు ఆవశ్యకతనే మర్చిపోయాంఇకపోతేసకారాత్మక చర్యల గురించిన చర్చలకి అడ్డుపడే ఒక సంస్కృతి నాడు ఉన్నంత కాకపోయినానేడూ అక్కడక్కడా కనిపిస్తూనే ఉందిప్రగతిని అడ్డుకోవడమే ఇటువంటి వారి పనిఅందుకోసమే తమ శక్తియుక్తులని వెచ్చిస్తారు వీరుఅయితే ప్రజాస్వామ్యంలో చెడుని విమర్శించడం ఎంత ముఖ్యమోమంచి పనుల గురించి చర్చించుకోవడమూ అంతే ముఖ్యంప్రతికూల వాతావరణాన్ని వ్యాప్తి చేయడమే ప్రజాస్వామ్యం అన్న ధోరణి పెరుగుతూజరిగిన ప్రగతి గురించి మాట్లాడడం బలహీన ప్రజాస్వామ్యానికి సంకేతంగా మారే విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోందిఇటువంటి ధోరణికి స్వస్తి పలకడం అత్యంత అవసరంఈ విషయంలో కొన్ని ఉదాహరణలు చెబుతాను..

మిత్రులారా,

ఇటీవలి కాలం వరకూ భారత్ లో అమలైన నేర చట్టాలు 1890 నాటివిమీరు విన్నది సరైనదే. 1890 నాటి చట్టాలవి!  దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ నాటి బూజుపట్టిన చట్టాలని మార్చాలని అప్పటి ప్రభుత్వాలకి తట్టలేదుబ్రిటీష్ కాలం నాటి బానిస భావాలతో జీవించడం అలవాటుగా మారిపోయింది. 1890 చట్టాల పరమార్థం ఏమిటిదేశంలో బ్రిటీషు పాలనని బలపరచడంభారత పౌరులని శిక్షించడం.. అంతే కదూశిక్షలే పరమావధిగా తయారైన వ్యవస్థ... న్యాయం గురించి ఆలోచిస్తుందాఅందుకనే ఆ పద్ధతిలో న్యాయం కోసం ఏళ్ళపాటు నిరీక్షించవలసి వచ్చేదిఅందుకనే మేం భారీ మార్పులను ప్రవేశపెట్టాం – ఈ పని అంత సులభంగా ముడిపడలేదుకొన్ని లక్షల గంటలు వెచ్చించి భగీరథ ప్రయత్నం చేయవలసి వచ్చిందిఎట్టకేలకు జాతికి భారతీయ న్యాయ సంహితను (బీఎన్ఎస్అందించగలిగాంభారత పార్లమెంటు కొత్త న్యాయ చట్టాలకు ఆమోదం తెలిపిందినూతన చట్టాలు అమలు మొదలై 7-8 నెలలే అయినప్పటికీ ఇప్పటికే మార్పు స్పష్టంగా కనిపిస్తోందిదినపత్రికల్లో ఈ మార్పుల గురించి మీకు ఎక్కువగా కనపడకపోవచ్చు కానీ ప్రజల మధ్యకు వెళ్ళండిమార్పును మీరే గమనిస్తారున్యాయ సంహిత అమలు ప్రారంభమయ్యాక న్యాయాన్ని అందించే తీరులో వచ్చిన మార్పులని మీకు ఉదాహరణాల ద్వారా తెలియజేస్తానుమూడు హత్యలకు సంబంధించిన ఒక  కేసులో ఎఫ్ఐఆర్ నమోదు నుంచీ తుది తీర్పు వెలువడేందుకు పట్టిన సమయం కేవలం 14 రోజులుమిత్రులారానిందితుడికి యావజ్జీవ కారాగారశిక్షను విధించారుఇక ఒక మైనర్ హత్యకు సంబంధించిన కేసును న్యాయస్థానాలు 20 రోజుల్లో పరిష్కరించాయిగుజరాత్ లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఎఫ్ఏఆర్ అక్టోబర్ 9న నమోదవగాఅక్టోబర్ 26న చార్జిషీటు దాఖలు చేశారుఇక ఈరోజుఅంటే ఫిబ్రవరి 15న కోర్టు నిందితులకు జైలుశిక్ష విధించిందిఆంధ్ర‌ప్రదేశ్ లో 5-నెలల శిశువు పట్ల జరిగిన అకృత్యం విషయంలో కోర్టు నిందితుడికి 25 ఏళ్ళ కారాగారాన్ని విధించిందిఈ కేసులో డిజిటల్ సాక్ష్యాధారాలు కీలకమయ్యాయిమరో అత్యాచారంహత్య కేసులో నిందితుడిని ‘ఈ-ప్రిజన్’ వ్యవస్థ ద్వారా పట్టుకున్నారుఇక ఇలాంటిదే మరో అత్యాచారం హత్య కేసులో నిందితుడి నేర నమోదు ఒక రాష్ట్రంలో జరిగినట్లుఅప్పటికే ఆ నిందితుడు మరో రాష్ట్రంలో మరో నేరం చేసినందుకు జైల్లో ఉన్నట్లూ వెల్లడయ్యిందిఎటువంటి జాప్యం లేకుండా అతడిని అరెస్టు చేశారుసత్వర న్యాయం అందిస్తున్న ఇటువంటి కేసులు అనేకం.  

 

స్నేహితులారా,

ఆస్తి హక్కుల విషయంలో సంస్కసరణలను సైతం తీసుకువచ్చాంఅనేక దేశాల్లో ప్రజలకు ఆస్తి హక్కులు లేకపోవడం ప్రధాన సమస్యగా పరిణమించిందని ఐక్యరాజ్యసమితి చేపట్టిన అధ్యయనం గుర్తించిందిప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వద్ద వారి ఆస్తులకు సంబంధించిన చట్టపరమైన పత్రాలు లేవుఆస్తి హక్కులు పేదరికాన్ని తగ్గించడంలో దోహదపడతాయిగతంలో ప్రభుత్వాలు దీన్ని గుర్తించలేదుఒకవేళ గుర్తించినాఆ తలనొప్పిని ఎవరు భరిస్తారుదీనికోసం ఎవరు శ్రమిస్తారుఈ పనికి ప్రధాన వార్తల్లో చోటు దక్కదు కదాఅలాంటప్పుడు ఎందుకు ఇబ్బంది పడాలిఅని భావించి ఉంటారుదేశాలను నిర్వహించాల్సిన లేదా నిర్మించాల్సిన పద్ధతి ఇది కాదుఅందుకే మేము స్వామిత్వ యోజన ప్రారంభించాంఈ పథకం ద్వారా దేశంలో లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వేలు చేపట్టాం. 2.25 కోట్లకు పైగా ప్రజలు వారి ఆస్తులకు సంబంధించిన యాజమాన్య పత్రాలు అందుకున్నారుఈ రోజు నేను ఈటీకి ఒక ముఖ్యమైన వార్తను ఇస్తున్నానుస్వామిత్వ గురించి రాయడం ఈటీకి అంత సులభం కాదని నాకు తెలుసుకాలం గడిచే కొద్దీ అలవాట్లు మారిపోతాయి!

స్వామిత్వ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ. 100 లక్షల కోట్ల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయిఅంటే గ్రామాల్లో పేదలకు చెందిన ఈ రూ.100 లక్షల కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు ఆర్థికాభివృద్ధి దిశగా వినియోగించుకోలేదుతమ ఆస్తులపై గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆస్తి హక్కులు లేకపోవడంతో వారు బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోయేవారుఇప్పుడు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందిస్వామిత్వ కార్డుల ద్వారా ప్రజలు పొందుతున్న ప్రయోజనాల గురించి నివేదికలు తెలియజేస్తున్నాయికొన్ని రోజుల క్రితంఈ పథకం ద్వారా యాజమాన్య హక్కులు పొందిన రాజస్థాన్‌కు చెందిన ఓ సోదరితో నేను మాట్లాడానుఆమె కుటుంబం 20 ఏళ్లుగా ఓ చిన్న ఇంట్లో నివసిస్తోందిఆస్తి కార్డు వచ్చిన వెంటనే బ్యాంకు నుంచి రూ.8 లక్షల రుణాన్ని ఆమె తీసుకుందిఆ సొమ్ముతో ఓ దుకాణాన్ని ప్రారంభించిందితద్వారా వస్తున్న ఆదాయంతో తన కుటుంబానికిపిల్లల ఉన్నత విద్యకు సాయపడుతోందిమార్పు ఇలాగే వస్తుందిమరో రాష్ట్రంలో తన ఆస్తి కార్డుతో ఓ వ్యక్తి రూ. 4.5 లక్షల రూపాయల రుణం తీసుకున్నారుఈ సొమ్ముతో ఓ వాహనాన్ని కొని రవాణా వ్యాపారాన్ని ప్రారంభించారుమరో గ్రామంలో ఓ రైతు తన ఆస్తి కార్డు ఉపయోగించి రుణం తీసుకున్నారుదానితో తన పొలంలో ఆధునిక నీటిపారుదల యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారుగ్రామీణులకుపేదవారికి కొత్త ఆదాయ మార్గాలను అందిస్తున్న ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయిఇవన్నీ సంస్కరణలుఆచరణపరివర్తనలకు సంబంధించిన వాస్తవ కథలుఇవి వార్తాపత్రికల్లో ప్రచురితం కానిటీవీల్లో ప్రసారమవని కథనాలు.

స్నేహితులారా,

స్వాతంత్ర్యం తర్వాత మనదేశంలో అనేక జిల్లాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయిదీనికి కారణం బడ్జెట్ లేకపోవడం కాదుపరిపాలనా వైఫల్యమేనిధులు కేటాయించారుప్రకటనలు చేశారుస్టాక్ మార్కెట్లలో పెరుగుతున్నతగ్గుతున్న సూచీల గురించి నివేదికలు కూడా ప్రచురించారువీటికి బదులుగా ఈ జిల్లాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించి ఉండాల్సిందిఅలా చేయకపోగావాటిని వెనబడిన జిల్లాలు అని ముద్ర వేసి వదిలేశారువాటిని అభివ‌ృద్ధి చేసేందుకు ఎవరూ ప్రయత్నించలేదుఆ జిల్లాల్లో పోస్టింగ్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు దాన్ని ఓ శిక్షగా భావించేవారు.

స్నేహితులారా,

ఈ ప్రతికూల అంశాన్ని సవాలుగా పరిగణించి మొత్తం విధానాన్నే నేను మార్చానుదేశంలో ఒకప్పుడు వెనకబడినవిగా ముద్రపడిన 100 జిల్లాలను గుర్తించాంనేను వాటిని వెనకబడిన జిల్లాలు అని కాకుండా ఆకాంక్షాత్మక జిల్లాలు అని పిలవడం ప్రారంభించానుఈ జిల్లాలకు యువ అధికారులను నియమించి క్షేత్ర స్థాయిలో పరిపాలనను మెరుగుపరిచాంఈ జిల్లాలు ఏ అంశాల్లో వెనకబడ్డాయో గుర్తించిన అనంతరం ప్రభుత్వ ప్రధాన పథకాలను ప్రత్యేక శిబిరాల ఏర్పాటు చేసి వేగంగా అమలు చేశాంఇప్పుడు ఈ ఆకాంక్షాత్మక జిల్లాలో చాలా వరకు స్ఫూర్తిదాయక జిల్లాలుగా రూపాంతరం చెందాయి.

అస్సాంలో ఆకాంక్షాత్మక జిల్లాల గురించి నేను మీతో చర్చించాలనుకుంటున్నానువాటిని మునపటి ప్రభుత్వాలు వెనకబడ్డ జిల్లాలుగా ముద్ర వేశాయిఇప్పుడు అవి సాధించిన అభివృద్ధిని మీ ముందుంచుతున్నానుఅస్సాంలోని బార్పేట జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ 2018లో 26శాతం పాఠశాలల్లో మాత్రమే విద్యార్థిఉపాధ్యాయుల నిష్పత్తి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండేదికేవలం 26 శాతం పాఠశాలల్లోఇప్పుడు ఈ జిల్లాలో ఆ నిష్పత్తి నూరు శాతానికి చేరుకుందిప్రతి పాఠశాలలోనూ విద్యార్థిఉపాధ్యాయ నిష్పత్తి మధ్య సమతౌల్యం ఏర్పడిందిఅదే విధంగా నిధులువనరులు అందుబాటులోనే ఉన్నప్పటికీ బీహార్‌లోని బేగుసరాయిలో 21 శాతం మంది గర్భిణీలకు మాత్రమే పోషకాహారం లభించేదిఉత్తర ప్రదేశ్‌లోని చందౌలీలో ఇది మరింత తక్కువగా 14 శాతం మాత్రమే ఉండేదిఈ అంశంలో ఈ రెండు జిల్లాలు 100 శాతానికి చేరుకున్నాయిచిన్నారులకు టీకాలు వేయడంలోనూ మేము పురోగతిని సాధించాంఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తిలో టీకాలు వేయించుకున్నవారి శాతం 49 నుంచి 86 శాతానికి పెరిగిందితమిళనాడులోని రామంతపురంలో 67 నుంచి 93 శాతానికి పెరిగిందిఈ విజయాల అనంతరం క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకొచ్చే పద్ధతి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని మేం గుర్తించాంఅందుకే, 100 ఆకాంక్షాత్మక జిల్లాలను విజయవంతంగా గుర్తించిఈ కార్యక్రమాన్ని తర్వాతి దశకు తీసుకెళ్లాం. 500 ఆకాంక్షాత్మక బ్లాకులను గుర్తించి వాటిని వేగంగా అభివృద్ధి చేసేలా దృష్టి సారించాంఈ 500 బ్లాకులు ప్రాథమికంగా అభివృద్ధి సాధిస్తే మొత్తం దేశాభివృద్ధి సూచీలే మారిపోతాయి.

స్నేహితులారా,

ఇక్కడ పెద్ద సంఖ్యలో పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారుమీరు అనేక దశాబ్దాల పాలనను చూశారుసుదీర్ఘకాలంగా వ్యాపార రంగంలో ఉన్నారుభారత్‌లో వ్యాపార విధానం ఇలా ఉంటే బాగుంటుంది అని మీరు ఊహించుకుని ఉండి ఉంటారుఇప్పుడు ఆలోచించండి.. పదేళ్ల క్రితం మన ఎక్కడ ఉన్నాంఇప్పుడు ఎక్కడకి చేరుకున్నాందశాబ్దం క్రితం భారత బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందిఅది చాలా సున్నితంగా ఉండేదిమిలియన్ల మంది భారతీయులు బ్యాంకింగ్ సేవల వ్యవస్థకు వెలుపల ఉన్నారువినీత్ జీ మాట్లాడుతూ జన్ ధన్ ఖాతాల గురించి ప్రస్తావించారుఒకప్పుడు రుణం పొందడం కష్టతరంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉండేది.

మిత్రులారా,

బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టపరచడానికి మేం ఒకే సమయంలో అనేక స్థాయిలలో మా కృషిని కొనసాగించాంబ్యాంకింగ్ సేవలను అందుకోకుండా మిగిలిపోయిన సామాజిక వర్గాల వారికి ఆ సేవలను చేరువ చేయడంపూచీకత్తు లేని రుణాలను ఇవ్వడం ద్వారా అవసరార్థులకు భద్రతను కల్పించడంనిధుల అండ ఇన్నేళ్లుగా లభించని వారికి ఆ లోటును తీర్చడం.. ఇదీ మేం అనుసరించిన వ్యూహంపదేళ్ల కిందటఆర్థిక సేవలను సమాజంలో అన్ని వర్గాల వారి చెంతకు చేర్చడం సాధ్యమయ్యే పని కాదనిబ్యాంకుల శాఖలు తగినన్ని లేకపోవడం దీనికి కారణమన్న వాదన ఉండిందికానీ ప్రస్తుతంభారత్‌లో ప్రతి గ్రామంలో ఒక బ్యాంకు శాఖనోలేదా 5 కిలోమీటర్ల లోపు బ్యాంకింగ్ కరెస్పాండెంట్ సేవలు అందుతూ ఉండడాన్నో గమనించవచ్చురుణాల అందుబాటు మెరుగుపడిందనడానికి ఒక ఉదాహరణ ‘ముద్ర’ (MUDRA) యోజనేపాత బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాలకు ఎన్నడూ నోచుకోని వర్గాలకురూ.32 లక్షల కోట్లను ఈ పథకంలో భాగంగా సమకూర్చారుఇదొక భారీ మార్పుఎంఎస్ఎంఈ రుణాలు చాలా సులభతరంగా మారాయిప్రస్తుతంవీధుల్లో తిరుగుతూ సరుకులను అమ్మే వ్యాపారస్తులు కూడా పూచీకత్తు అక్కర లేని రుణాలను అందుకొంటున్నారురైతులకు ఇస్తున్న రుణాలు రెండింతలకు మించాయిమనం పెద్ద పెద్ద మొత్తాలలో రుణాలను ఇస్తుండడం ఒక్కటే కాకుండా మన బ్యాంకులు లాభాల్లో ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకొంటున్నాంఒక దశాబ్ద కాలం కిందటఎకనామిక్ టైమ్స్’ కూడా బ్యాంకింగ్ స్కాములను గురించివసూలయ్యే అవకాశం లేని రుణాలు (ఎన్‌పీఏలుఎంత మేరకుందీ తన శీర్షికల్లో తెలియజేస్తూ ఉండేదిమన బ్యాంకింగ్ రంగం ఎంతటి దుర్బలత్వంతో ఉన్నదీ సూచిస్తూ సంపాదకీయాల్లో ఆందోళనను వ్యక్తం చేసేవారుమరి ఇవాళ ఎలాంటి కథనాల్ని ప్రచురిస్తున్నారుఏప్రిల్డిసెంబరుల మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1.25 లక్షల కోట్ల లాభాలను ఆర్జించాయని తెలిపారుమిత్రులారాఇది ఒక్క శీర్షికల్లో చోటుచేసుకున్న మార్పు కాదుఇది వ్యవస్థలో వచ్చిన మార్పుదీనికి కారణం మన బ్యాంకింగ్ సంస్కరణలేఇది మన ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ ఎరుగనంత బలంగా ఉన్నాయని నిరూపిస్తోంది.

మిత్రులారా,

వ్యాపారం చేయడానికి భయపడడాన్ని మేం గత దశాబ్దంలో వ్యాపారం చేయడంలో సౌలభ్యంగా మార్చేశాంజీఎస్‌టీ తోభారత్‌లో ఇప్పుడు ఒకే భారీ మార్కెట్‌ ఏర్పడిందిఇది పరిశ్రమలకు ఎంతో మేలు చేసిందిఇదివరకు ఎరుగని స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగడం రవాణా ఖర్చులను తగ్గించడంతోపాటు సామర్థ్యాన్ని కూడా పెంచిందిఅనవసరంగా వందల నియమాలను పాటించవలసి రావడాన్ని మేం తప్పించాంఅంతేకాకుండా ఇప్పుడు ‘జన్ విశ్వాస్ 2.0’ ద్వారా వాటిని మరింత తగ్గించాంప్రభుత్వ జోక్యం చాలావరకు తగ్గి కనీస స్థాయికి చేరాలని నేను దృఢంగా నమ్ముతాను.  దీనిని సాధించడానికిమేం నియంత్రణలను మరింత సువ్యవస్థీకరించడానికి ఒక డీరెగ్యులేషన్ కమిషనును కూడా ఏర్పాటుచేస్తున్నాం.

మిత్రులారా,

ప్రస్తుతంభారత్ మరో పెద్ద మార్పును చూస్తోందిఇది మనను రాబోయే కాలానికి సన్నద్ధం చేస్తోందితొలి పారిశ్రామిక విప్లవం మొదలైనప్పుడుభారత్ వలస పాలనలో మగ్గిపోతూ ఉండింది.

రెండో పారిశ్రామిక విప్లవం కాలంలోప్రపంచం కొత్త కొత్త విషయాలను కనుగొంటూ ఫ్యాక్టరీలను నెలకొల్పుతున్నప్పుడుభారత్‌లో స్థానిక పరిశ్రమలను ధ్వంసం చేస్తూ పోయారుముడిపదార్థాలను భారత్ నుంచి బయటకు ఎగుమతి చేశారుదీంతో మనం వెనుకబడ్డాంస్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడాస్థితిలో పెద్ద మార్పేమీ లేదుప్రపంచం కంప్యూటర్ విప్లవం దిశగా కదులుతున్న వేళభారతీయులు ఒక కంప్యూటర్‌ను కొనాలన్నా అందుకోసం లైసెన్సును తీసుకోవాల్సి వచ్చేది.  మొదటి మూడు పారిశ్రామిక విప్లవాల లాభాలను భారత్ అందుకోలేకపోయిందిఅయితే నాలుగో పారిశ్రామిక విప్లవంలోమనం ప్రపంచంతో భుజం భుజం కలిపి ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం.

మిత్రులారా,

వికసిత్ భారత్’ గమ్యం వైపు దూసుకుపోతున్న క్రమంలోప్రైవేటు రంగాన్ని ఒక కీలక భాగస్వామిగా చేసుకోవాలని మా ప్రభుత్వం ఆలోచిస్తోందిప్రైవేటు ప్రాతినిధ్యం కోసం అంతరిక్ష రంగం సహా అనేక కొత్త రంగాల తలుపులను తెరచి ఉంచిందిఇవాళఅనేక మంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతోపాటు అంకుర సంస్థలు (స్టార్ట్-అప్స్కూడా అంతరిక్ష రంగంలో గొప్ప గొప్ప తోడ్పాటులను అందిస్తున్నాయిఇదే మాదిరిగాఒకప్పుడు ప్రజల భాగస్వామ్యానికి ఆమడ దూరంలో ఉండిపోయిన డ్రోన్ రంగం ప్రస్తుతం యువతీయువకులకు భారీ అవకాశాల్ని కల్పిస్తోందిమేం వాణిజ్య సరళిలో బొగ్గు గనుల తవ్వకం రంగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు అందిస్తున్నాంవేలంపాట విధానాన్ని మరింత సరళం చేశాందేశం పునరుత్పాదక ఇంధన రంగంలో సాధించిన విజయాల్లో ప్రైవేట్ రంగానిది పెద్ద పాత్రఇప్పుడిక మేం సమర్ధతను పెంచడానికి ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో సైతం ప్రైవేటు రంగం ప్రాతినిధ్యాన్ని విస్తరిస్తున్నాంఈ సంవత్సరం బడ్జెటులో అతి ప్రధాన సంస్కరణల్లో ఒకటి ఏమిటంటే.. అది ఇదివరకు ఎవ్వరూ చేయడానికి సాహసించనిది.. పరమాణు రంగాన్ని కూడా ప్రైవేటు ప్రాతినిధ్యానికి వీలున్న రంగంగా మేం మార్చాం.

మిత్రులారా,

ప్రస్తుతంమన రాజకీయాలు కూడా పనితీరు ప్రధానమైనవిగా మారిపోయాయిక్షేత్ర స్థాయిలో సంబంధాలను విడనాడకుండాసిసలైన ఫలితాలను అందించేవారే మనుగడ సాగించగలుగుతారు.. ఈ విషయాన్ని భారత్ ప్రజలు తేటతెల్లం చేశారుప్రభుత్వం అనేది ప్రజల సమస్యలను అర్థం చేసుకొనేదిగా ఉండాలిసుపరిపాలనకు మొట్టమొదటి యోగ్యత ఇదేదురదృష్టవశాత్తుమా కన్నా ముందు విధాన రూపకల్పన బాధ్యత వహించిన వారిలో ఇటు సూక్ష్మగ్రాహ్యత గానిఅటు వాస్తవిక మార్పును తీసుకొచ్చే సంకల్ప శక్తి గాని.. ఈ రెండూ లోపించాయిమా ప్రభుత్వం ప్రజల సమస్యలను సహానుభూతితో ఆలకించివాటిని ఉద్వేగంతోనునిబద్ధతతోను పరిష్కరించడానికి ధైర్యం గలతిరుగులేని చర్యలను తీసుకొందిపౌరులకు గత పదేళ్లలో ప్రాథమిక సౌకర్యాలను కల్పించినందువల్ల 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని పలు అంతర్జాతీయ అధ్యయనాలు తేల్చిచెప్పాయిఈ భారీ మార్పు ఒక సరికొత్త నవ్య మధ్య తరగతిని తెర మీదకు తెచ్చిందిఈ వర్గం వారు ప్రస్తుతం వారి తొలి ద్విచక్ర వాహనాన్నితొలి కారునుతొలి ఇంటిని కొనాలని ఉవ్విళ్లూరుతున్నారుమధ్య తరగతికి అండగా నిలబడడానికి మేం ఈ సంవత్సరం బడ్జెటులో ఒక ప్రధాన మార్పును తీసుకు వచ్చాం.. మేం సున్నా పన్ను పరిమితిని రూ.లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచివేశాంఈ నిర్ణయం మధ్య తరగతిని బలపరుస్తుందిఅంతేకాకదేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలకు మద్దతిస్తుంది కూడాఒక ప్రభుత్వం క్రియాశీలంగా ఉంటూప్రజల అవసరాలను అర్థం చేసుకొని వాటిని తీర్చేదయితేనే ఇది సాధ్యపడుతుంది.

మిత్రులారా,

వికసిత్ భారత్’ పక్కా విశ్వాసం పునాది మీదే నిలబడుతుందిఆ విశ్వాసం ప్రజల్లోప్రభుత్వంలోవ్యాపార రంగ ప్రముఖుల్లో ఏర్పడాలిపురోగమించడానికి ఈ విశ్వాసమనే మూలకం ఎంతో ముఖ్యంప్రజల్లో ఈ తరహా విశ్వాసాన్ని బలపరచడానికి మా ప్రభుత్వం అలుపెరుగక కృషి చేస్తోందిమేం ఆవిష్కర్త (ఇన్నొవేటర్)లలో నమ్మకంధైర్యంలతో కూడిన వాతావరణాన్ని కల్పిస్తున్నాందాంతోవారు తమ ఆలోచనలకు ఊపిరి పోయగలుగుతారన్నమాటవ్యాపారాలు స్థిర వృద్ధిని సాధిస్తూ పోవడానికి వాటికి నిలకడతనంతో కూడి ఉండేసమర్థనను అందించగలిగే విధానాల అండదండలు లభించేటట్లు మేం చూస్తున్నాంఈ ‘ఈటీ సమ్మిట్’ ఈ విశ్వాసాన్ని మరింత పటిష్టపరుస్తుందని నేను ఆశిస్తున్నానుఈ మాటలతోనేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నానుమీకందరికీ శుభాకాంక్షలుమీకు అనేకానేక ధన్యవాదాలు.

గమనికఇది ప్రధాని ప్రసంగానికి భావానువాదంఆయన హిందీలో మాట్లాడారు.

 

***


(Release ID: 2104250) Visitor Counter : 18