ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్ జయంతి.. ప్రధానమంత్రి శ్రద్ధాంజలి

నాడు పోస్టు చేయడమైనది: 28 JAN 2025 1:17PM by PIB Hyderabad

పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు
:
‘‘
భరత మాత ముద్దుబిడ్డ, కర్తవ్యపరాయణుడు ‘పంజాబ్ కేసరి’ లాలా లాజ్‌పత్ రాయ్‌కు ఆయన జయంతి సందర్భంగా శత కోటి వందనాలు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ మహానాయకుడు విదేశీ పాలనకు ఎదురొడ్డి నిలిచి, తన జీవితాన్నే సమర్పణం చేశారు. మాతృభూమి పట్ల ఆయన కనబరచిన అంకితభావాన్నీ, సేవాభావాన్నీ మనం ఎప్పటికీ  శ్రద్ధ పూర్వకంగా స్మరించుకొంటూ ఉంటాం.’’

 

***


(రిలీజ్ ఐడి: 2097015) సందర్శకుల సూచీ సంఖ్య : : 84