ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీని కలిసిన మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల
प्रविष्टि तिथि:
06 JAN 2025 8:55PM by PIB Hyderabad
మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
భారత్ లో మైక్రోసాఫ్ట్ ప్రతిష్ఠాత్మక విస్తరణ, పెట్టుబడి ప్రణాళికలపై శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. సాంకేతికత, ఆవిష్కరణ, కృత్రిమ మేధలకు సంబంధించిన వివిధ అంశాలపై సమావేశంలో ఇద్దరూ చర్చించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో సత్య నాదెళ్ల చేసిన పోస్టుపై స్పందిస్తూ, శ్రీ మోదీ ఈ విధంగా పేర్కొన్నారు:
“@satyanadella! మిమ్మల్ని కలవడం నిజంగా చాలా ఉత్సాహాన్నిచ్చింది. భారత్ లో మైక్రోసాఫ్ట్ ప్రతిష్ఠాత్మక విస్తరణ, పెట్టుబడి ప్రణాళికల గురించి తెలుసుకోవడం సంతోషాన్నిచ్చింది. సాంకేతికత, ఆవిష్కరణ, కృత్రిమ మేధలకు సంబంధించి వివిధ అంశాలపైనా మన సమావేశంలో చర్చించడం అత్యంత హర్షణీయమైన అంశం.’’
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2095871)
आगंतुक पटल : 48
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam