ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ, ఒడిశా ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మధ్య ఎంఓయూ జరిగిన సందర్భంగా ఒడిశా ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 13 JAN 2025 7:00PM by PIB Hyderabad


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ, ఒడిశా ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మధ్య ఎంఓయూ జరిగిన సందర్భంగా ఒడిశా ప్రజలకు అభినందలు తెలియజేశారు. అందుబాటు ధరల్లో అత్యున్నత నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణను, ముఖ్యంగా నారీ శక్తికి, ఒడిశాలోని వృద్ధులకు ఈ పథకం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.


ఒడిశా ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన ఒక పోస్టుకు ప్రధాని ఈ విధంగా బదులిచ్చారు.


“ ఒడిశా ప్రజలకు అభినందనలు.
ఒడిశాకు చెందిన నా సోదర సోదరీమణులకు ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలను గత ప్రభుత్వం నిరాకరించడం నిజంగా హాస్యాస్పదం. అందుబాటు ధరల్లో అత్యున్నత నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ అందేలా ఈ పథకం చూసుకుంటుంది. ఇది ముఖ్యంగా నారీ శక్తికి, ఒడిశాలోని వృద్ధులకు మేలు చేస్తుంది”

 

 

 

***

MJPS/VJ


(रिलीज़ आईडी: 2095866) आगंतुक पटल : 55
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam