ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవీ ముంబయిలో ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ ఆలయ ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

Posted On: 15 JAN 2025 6:30PM by PIB Hyderabad

హరే కృష్ణ – హరే కృష్ణ!

హరే కృష్ణ – హరే కృష్ణ!

మహారాష్ట్ర గవర్నర్ సి.పిరాధాకృష్ణన్ గారూప్రజాదరణ పొందిన ఇక్కడి ముఖ్యమంత్రి శ్రీ దేవా బావూఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే గారూపూజనీయ గురుప్రసాద స్వామిగారూహేమామాలిని గారూ, గౌరవనీయ అతిథులూభక్తులూసోదరీ సోదరులారా!

జ్ఞానానికీభక్తికీ నిలయమైన ఈ నేలన ఇస్కాన్ కృషితో శ్రీశ్రీ రాధా మదన్ మోహనాలయం నేడు ప్రారంభమవుతోందిఈ దివ్య క్రతువులో పాలుపంచుకునే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానుఇవి ఇస్కాన్ సాధుసంతుల అపారమైన ప్రేమానురాగాలుశ్రీల ప్రభుపాద స్వామి ఆశీస్సులుపూజనీయ సాధుసంతులందరికీ నా కృతజ్ఞతలు.. వారికి పాదాభివందనంశ్రీ రాధా మదన్ మోహన్ జీ ఆలయ సముదాయపు రూపురేఖలను చూస్తూనే ఉండిపోయానుఈ ఆలయ భావనదీని శైలి మొత్తం ఆధ్యాత్మిక సంప్రదాయాన్నీజ్ఞానాన్నీ ప్రతిబింబిస్తాయిదైవానికి గల వివిధ రూపాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. ‘ఏకో అహం బహు స్యం’ అన్న మన భావననూ అవి వ్యక్తపరుస్తాయికొత్త తరం ఆసక్తులకు అనుగుణంగావారిని ఆకట్టుకోవడం కోసం రామాయణంమహాభారతం ఆధారంగా ఓ ప్రదర్శనశాలను కూడా ఇక్కడ నిర్మిస్తున్నారుబృందావనంలోని 12 వనాల ఆధారంగా ఓ ఉద్యానవనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారుభారతీయ జాగృతినీవిశ్వాసాన్నీ సుసంపన్నం చేసే పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ సముదాయం రూపు దిద్దుకుంటుందని నేను విశ్వసిస్తున్నానుఈ మహోన్నత కృషిపట్ల ఇస్కాన్ సాధుసంతులుసభ్యులందరికీ.. మహారాష్ట్ర ప్రజలకూ నా శుభాకాంక్షలు.

మిత్రులారా,

ఈ సందర్భంగా అత్యంత పూజనీయుడైన గోపాల కృష్ణ గోస్వామి మహరాజ్ ని నేడు భావోద్వేగభరితంగా స్మరించుకుంటున్నానుఈ ప్రాజెక్టులో ఆయన దార్శనికత ఉందిఅపారమైన కృష్ణభక్తితో కూడిన ఆయన ఆశీస్సులు దీనికున్నాయినేడు భౌతికంగా ఆయన ఇక్కడ లేకపోవచ్చుకానీఆధ్యాత్మికంగా ఆయన ఉనికిని మనం అనుభూతి చెందుతున్నాంనా జీవితంలో ఆయన ఆత్మీయతఆయన జ్ఞాపకాలకు ప్రత్యేక స్థానముందిప్రపంచంలో అతిపెద్ద భగవద్గీతను ఆయన విడుదల చేసిన సమయంలో నన్ను దానికి ఆహ్వానించారుఆ పవిత్ర ప్రసాదాన్ని నేను కూడా స్వీకరించానుశ్రీల ప్రభుపాద జీ 125వ జయంతి సందర్భంగా కూడా ఆయనను కలిసే అవకాశం నాకు దక్కిందిఆయన మరో కల నెరవేరుతుండమూదానికి నేను సాక్షీభూతుడిగా నిలవడమూ ఎంతగానో సంతృప్తినిస్తున్నాయి.

మిత్రులారా,

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ అనుచరులందరినీ కృష్ణ భక్తి అనే సూత్రం అనుసంధానించిందివారందరినీ కలిపే మరో సూత్రముంది.. 24 గంటలూ అది ప్రతి భక్తుడికీ మార్గనిర్దేశం చేస్తూంటుందిఅదే శ్రీల ప్రభుపాద స్వామి భావవాహికదేశం బానిస సంకెళ్లలో ఉన్న తరుణంలో వేదాలువేదాంతంభగవద్గీత ప్రాధాన్యాన్ని ఆయన చాటారు. భక్తి వేదాంతాన్ని జనసామాన్యపు చేతనతో అనుసంధానించే క్రతువును ఆయన చేశారుఇక తమ విధులన్నీ పూర్తయినట్టు ప్రజలు భావించే 70 ఏళ్ల వయస్సులో ఇస్కాన్ వంటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారుతర్వాత నిరంతరం ప్రపంచమంతా పర్యటిస్తూ శ్రీకృష్ణుడి సందేశాన్ని ప్రపంచం నలుమూలలకు చేర్చారు. నేడు ప్రపంచం నలుమూలలా కోట్లాది మంది ఆయన తపఃఫలాన్ని పొందుతున్నారుశ్రీల ప్రభుపాద స్వామి క్రియాశీలతఆయన కృషి నేటికీ మనకు స్ఫూర్తినిస్తాయి.

మిత్రులారా,

మన భారత్ అద్వితీయమైనఅద్భుతమైన భూమిభారత్ కేవలం భౌగోళిక హద్దులున్న భూభాగం మాత్రమే కాదుభారత్ సజీవ ధాత్రిభారత్ సజీవ సంస్కృతిభారత్ సజీవ సంప్రదాయంభారత ఆధ్యాత్మికత ఈ సంస్కృతికి చేతననిస్తోందికాబట్టి, భారతదేశాన్ని అవగాహన చేసుకోవాలంటే ముందుగా ఆధ్యాత్మికతను పుణికిపుచ్చుకోవాలి. ప్రపంచాన్ని భౌతిక దృష్టితో మాత్రమే చూసే వారు భారతదేశాన్ని కూడా పలు భాషలుప్రాంతాల సమూహంగానే చూస్తారు. కానీఇక్కడి సాంస్కృతిక చేతనతో మీ ఆత్మను అనుసంధానం చేస్తే భారత స్వరూప విస్తృతి అవగతమవుతుందిఅత్యంత తూర్పు ప్రాంతాన ఉన్న బెంగాల్ భూమిలో జన్మించిన చైతన్య మహాప్రభు వంటి సాధుసంతులు అప్పుడు మీకు కనిపిస్తారుసంత్ నామ్ దేవ్తుకారాంజ్ఞాన్ దేవ్ వంటి సాధువులు పశ్చిమాన మహారాష్ట్రలో జన్మించారుచైతన్య మహాప్రభు మహావాక్య మంత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మహారాష్ట్ర సాధువులు రామకృష్ణ హరి మంత్రంతో ఆధ్యాత్మిక సుధలను పంచారుశ్రీ జ్ఞానేశ్వర్ తన జ్ఞానేశ్వరీ గీత ద్వారా శ్రీకృష్ణుని నిగూఢ తాత్వికతను ప్రజలకు చేరువ చేశారు. అదేవిధంగా శ్రీల ప్రభుపాద ఇస్కాన్ ద్వారా భగవద్గీతను ప్రాచుర్యంలోకి తెచ్చారు. భగవద్గీత వ్యాఖ్యానాలను ప్రచురించి.. గీతా స్ఫూర్తితో ప్రజలను ఆయన అనుసంధానించారు. వేర్వేరు చోట్ల జన్మించిన ఈ సాధుసంతులంతా తమదైన శైలిలో కృష్ణ భక్తి ప్రవాహం మరింత వేగంగా ప్రవహించేలా కృషిచేస్తున్నారు సాధు సంతుల వయస్సులోభాషలలోపద్ధతులలో ఎంతో వైవిధ్యం ఉంది.. అయినప్పటికీ అవగాహనఆలోచనలుచైతన్యం ఒకేలా ఉన్నాయిభక్తి కాంతులతో ప్రతి ఒక్కరూ సమాజానికి కొత్త జీవం అందించారుసమాజానికి సరికొత్త దిశానిర్దేశం చేసి నిరంతర శక్తిని ప్రసాదించారు.

మిత్రులారా,

మీ అందరికీ తెలుసు.. సేవా స్ఫూర్తే మన ఆధ్యాత్మిక సంస్కృతికి మూలంప్రజలకుమానవాళికి సేవ ఆధ్యాత్మికతలో ఒకటిగా మారిందిమన ఆధ్యాత్మిక సంస్కృతి సాధకులను సమాజంతో అనుసంధానించి వారిలో కారుణ్య భావనను కలిగిస్తుందిఈ భక్తి భావన వారిని సేవ వైపు నడిపిస్తుంది.

దాతవ్యమ్ ఇతి యత్ దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తత్ దానం సాత్వికం స్మృతం.

నిజమైన సేవ అర్థాన్ని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పాడు. స్వార్థం లేనిదే నిజమైన సేవ అని ఆయన చాలా అందంగా వివరించాడు. మన మత గ్రంథాలన్నీ సేవాభావమే ప్రధానమని చెప్తున్నాయిఇస్కాన్ లాంటి బృహత్తర సంస్థ కూడా ఇదే సేవా స్ఫూర్తితో పనిచేస్తుంది. విద్యఆరోగ్యంపర్యావరణానికి సంబంధించిన అనేక కార్యాలు మీ కృషి ద్వారా నెరవేరుతాయి. కుంభమేళాలో ఇస్కాన్ అనేక పెద్ద సేవా కార్యక్రమాలు చేస్తోంది.

మిత్రులారా,

మా ప్రభుత్వం కూడా దేశప్రజల ప్రయోజనాల కోసం పూర్తి అంకితభావంతోఈ సేవా స్ఫూర్తితో పనిచేస్తుండడం సంతోషాన్నిస్తోందిప్రతి ఇంట్లో టాయిలెట్ల నిర్మాణంప్రతి పేద మహిళకూ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంప్రతి ఇంటికీ కుళాయి నీటి సదుపాయం కల్పించడంప్రతి పేద వ్యక్తికీ రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడం 70 ఏళ్లు పైబడిన వృద్ధులను దీని పరిధిలోకి తేవడంఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ శాశ్వతమైన ఇళ్లు అందించడం... సేవాభావంతోఅంకితభావంతో చేసిన పనులే ఇవన్నీమన గొప్ప సంస్కృతీ సంప్రదాయాల ప్రసాదంగానే వాటిని నేను భావిస్తున్నానుఈ సేవాస్ఫూర్తి నిజమైన సామాజిక న్యాయాన్ని అందించడంతో పాటు నిజమైన లౌకికతత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.

మిత్రులారా,

కృష్ణ సర్క్యూట్ ద్వారా దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలూ ఆధ్యాత్మిక స్థలాలను ప్రభుత్వం అనుసంధానిస్తోంది. గుజరాత్రాజస్థాన్హర్యానాఉత్తరప్రదేశ్ఒడిశా రాష్ట్రాల్లో ఈ సర్క్యూట్ విస్తరించి ఉంది. స్వదేశ్ దర్శన్ ప్రసాద్ యోజన ద్వారా ఈ ప్రదేశాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ దేవాలయాల్లో శ్రీకృష్ణుడి వివిధ రూపాలను దర్శించుకోవచ్చుకొన్ని చోట్ల కృష్ణుడు బాలుడి రూపంలో కనిపిస్తే.. మరికొన్ని చోట్ల ఆయనతో పాటు రాధారాణి కూడా పూజలందుకుంటారు. కొన్ని ఆలయాల్లో ఆయన కర్మయోగి రూపం కనిపిస్తుందిమరికొన్ని చోట్ల రాజుగా ఆయన పూజలందుకుంటున్నాడుశ్రీకృష్ణుడి జీవితానికి సంబంధించిన వివిధ ప్రాంతాల సందర్శనఆలయాల దర్శనాలను సులభతరం చేయడం కోసమే మా ఈ ప్రయత్నంఇందుకోసం ప్రత్యేక రైళ్లు కూడా నడుస్తున్నాయి. కృష్ణ సర్క్యూట్ లోని ఈ ఆధ్యాత్మిక కేంద్రాలకు భక్తులను రప్పించడంలో ఇస్కాన్ కూడా తప్పక దోహదపడుతుందిమీ కేంద్రానికి వచ్చే భక్తులందరినీ వాటిలో కనీసం అయిదు ప్రదేశాలకు పంపవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.

మిత్రులారా,

దశాబ్దకాలంలో దేశంలో అభివృద్ధీ సాంస్కృతిక వారసత్వమూ రెండూ వేగంగా పురోగమిస్తున్నాయివారసత్వం ద్వారా అభివృద్ధి అన్న ఈ మిషన్ కు ఇస్కాన్ వంటి సంస్థలు ఎంతగానో చేయూతనిస్తున్నాయిమన దేవాలయాలు లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలు శతాబ్దాలుగా సాంస్కృతిక చైతన్యానికి కేంద్రాలుగా ఉన్నాయివిద్యనైపుణ్యాభివృద్ధిలో మన గురుకులాలు కీలక పాత్ర పోషించాయిఇస్కాన్ కూడా తన కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో భాగం చేసుకునేలా యువతకు స్ఫూర్తినిస్తోందిఇస్కాన్ యువ సాధకులు సంప్రదాయాన్ని అనుసరిస్తూనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకోవడం అబ్బురపరుస్తోందిమీ సమాచార వ్యవస్థ నుంచి ఇతరులు చాలా నేర్చుకోవచ్చు.

ఇస్కాన్ మార్గదర్శకత్వంలో సేవాభావంఅంకితభావంతో దేశ ప్రయోజనాల కోసం యువత పనిచేస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఈ సముదాయంలో భక్తివేదాంత ఆయుర్వేద వైద్య కేంద్ర సదుపాయం కూడా ప్రజలకు లభిస్తుంది. నా అభిప్రాయమేమిటంటే.. ‘భారత్ లో స్వస్థత (హీల్ ఇన్ ఇండియా)’ – ప్రపంచానికి నేనెప్పుడూ ఈ సందేశాన్నిస్తున్నానుసంరక్షణ కోసం, అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండడం కోసంశ్రేయస్సు కోసం ‘హీల్ ఇన్ ఇండియా. వైదిక విద్య కోసం భక్తి వేదాంత కళాశాలను కూడా ఇక్కడ నెలకొల్పారుప్రతీ సమాజమూ యావద్దేశమూ దీని ద్వారా ప్రయోజనం పొందుతాయి.

మిత్రులారా,

మనం చూస్తున్నాం... ప్రస్తుత సమాజం ఆధునికతను సంతరించుకుంటున్న కొద్దీ అదే స్థాయిలో సునిశితత్వాన్నీ అలవరచుకోవడం అత్యావశ్యకంసునిశితత్వం గల వ్యక్తులతో కూడిన సమాజాన్ని మనం నిర్మించాలిఅలాంటి సమాజం మానవీయ విలువలతో ముందుకు సాగుతుందిఅలాంటి ఆత్మీయతా భావన నిండిన సమాజాన్ని నిర్మించాలిఇస్కాన్ వంటి సంస్థ భక్తివేదాంతం ద్వారా ప్రపంచంలో సునిశితత్వానికి కొత్త జీవం పోయగలదు. మీ సంస్థ తన సామర్థ్యాలను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా మానవీయ విలువలను వ్యాప్తి చేయగలదుప్రభుపాద స్వామి ఆశయాలను సజీవంగా ఉంచడానికి ఇస్కాన్ మహాశయులు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారని నేను విశ్వసిస్తున్నాను. రాధా మదన్మోహన్ జీ ఆలయ ప్రారంభోత్సవం సందర్బంగా ఇస్కాన్ కుటుంబానికిదేశప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు.

అందరికీ ధన్యవాదాలు.

హరే కృష్ణ – హరే కృష్ణ!

హరే కృష్ణ – హరే కృష్ణ!

హరే కృష్ణ – హరే కృష్ణ!

గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది ఇంచుమించు అనువాదంవాస్తవ ప్రసంగం హిందీలో ఉంది

 

***


(Release ID: 2095355) Visitor Counter : 18