రాష్ట్రపతి సచివాలయం
ఫిబ్రవరి 2 నుంచి ప్రజల సందర్శనార్థం తెరుచుకోనున్న అమృత్ ఉద్యాన్
Posted On:
21 JAN 2025 11:55AM by PIB Hyderabad
ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30, 2025 వరకు ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్‌ను తెరచి ఉంచుతారు. నిర్వహణ కారణంగా సోమవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు ఉదయం 10 గం.ల నుంచి సాయంత్రం 6 గం.ల వరకు ప్రజలు ఉద్యానవనాన్ని సందర్శించవచ్చు. ఫిబ్రవరి 5న (ఢిల్లీ శాసనసభ ఎన్నికల సందర్భంగా), ఫిబ్రవరి 20, 21 (రాష్ట్రపతి భవన్లో సందర్శకుల సమావేశం కారణంగా), మార్చి 14న (హోలీ సందర్భంగా) ఉద్యాన్ మూసి ఉంచుతారు.
రాష్ట్రపతి ఎస్టేట్ గేట్ నెం. 35 నుంచి సందర్శకులకు ప్రవేశం, నిష్క్రమణ మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇది నార్త్ ఎవెన్యూతో రాష్ట్రపతి భవన్ అనుసంధానమయ్యే ప్రదేశానికి సమీపంలో ఉంటుంది. సందర్శకుల సౌకర్యార్థం సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుంచి గేట్ నెం. 35 వరకు షటిల్ బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ సేవలు ఉదయం 9.30 గం.ల నుంచి సాయంత్రం 6 గం.ల వరకు ప్రతి 30 నిమిషాలకు అందుబాటులోఉంటాయి.
కింద పేర్కొన్న తేదీల్లో ప్రత్యేక విభాగాలకు చెందిన వారికి మాత్రమే అమృత్ ఉద్యాన్ ప్రవేశం:
∙ మార్చి 26 – ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులకు
∙ మార్చి 27 – రక్షణ, పారామిలటరీ, పోలీసు సిబ్బందికి
∙ మార్చి 28 – స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు, గిరిజన మహిళలకు
∙ మార్చి 29 – సీనియర్ సిటిజన్లకు
ఉద్యానంలోనికి ప్రవేశం, బుకింగ్ ఉచితం. https://visit.rashtrapatibhavan.gov.in/ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. నేరుగా కూడా ఉద్యానవనాన్ని సందర్శించవచ్చు.
మార్చి 6 నుంచి 9 వరకు అమృత్ ఉద్యాన్ లో భాగంగా వివిధత కా అమృత మహోత్సవ్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది నిర్వహిస్తోన్న మహోత్సవ్ కార్యక్రమం దక్షిణ భారతానికి చెందిన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని, విశిష్ట సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది.
***
(Release ID: 2094812)
Visitor Counter : 26