ప్రధాన మంత్రి కార్యాలయం
తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా...దేశంలోని తత్వవేత్తలు, కవులు, ఆలోచనాపరులలో ఒకరైన తిరువళ్లువర్ ను స్మరణకు తెచ్చుకుంటున్నాం: ప్రధాన మంత్రి
ఆయన పద్యాలు తమిళ సంస్కృతి సారానికీ, మన తాత్విక వారసత్వానికీ ప్రతిబింబం: ప్రధాన మంత్రి
ఆయన బోధనల్లో ధర్మం, దయ, న్యాయం...: ప్రధాన మంత్రి
Posted On:
15 JAN 2025 12:37PM by PIB Hyderabad
నేడు తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా గొప్ప తమిళ తత్వవేత్త, కవి, ఆలోచనాపరుడు తిరువళ్లువర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్మరించుకున్నారు. తమిళ సంస్కృతి సారాన్నీ, మన తాత్విక వారసత్వాన్నీ తిరువళ్లువర్ గొప్ప పద్యాలు ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. “అజరామరమైన ఆయన కృతి ‘తిరుక్కురల్’ అనేక అంశాలపై లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తూ ప్రేరణకు దీప్తిగా నిలుస్తుంది” అని శ్రీ మోదీ తెలిపారు.
“తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా... మన దేశ గొప్ప తత్వవేత్త, కవి, ఆలోచనాపరుడైన మహానుభావుడు తిరువళ్లువర్ ను స్మరించుకుంటాము. ఆయన పద్యాలు తమిళ సంస్కృతినీ, మన తాత్త్విక వారసత్వాన్నీ ప్రతిబింబిస్తాయి. ఆయన బోధనలు ప్రధానంగా ధర్మం, కరుణ, న్యాయాన్ని ఉపదేశిస్తాయి. అజరామరమైన ఆయన కృతి ‘తిరుక్కురల్’ అనేక అంశాలపై లోతైన బోధలను అందిస్తూ ప్రేరణకు దీప్తిగా నిలుస్తుంది. మన సమాజానికి ఆయనా చూపిన దిశలో కొనసాగడానికి కృషి చేస్తూనే ఉంటాము” అని ప్రధానమంత్రి ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
***
(Release ID: 2093189)
Visitor Counter : 7
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam