ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని నరైనాలో లోహ్రీ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి: లోహ్రీ పునరుత్తేజానికి, ఆశకు ప్రతీక: ప్రధాని

Posted On: 13 JAN 2025 10:15PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఢిల్లీలోని నరైనాలో జరిగిన లోహ్రీ వేడుకల్లో పాల్గొన్నారుచాలా మందికిముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందిన వారికి లోహ్రీ పర్వదినానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అన్నారు. " కొత్త ఉత్సాహానికికొత్త ఆశలకు లోహ్రీ ప్రతీకఇది వ్యవసాయంకష్టపడి పనిచేసే మన రైతులతో కూడా ముడిపడి ఉందిఅని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

"లోహ్రీ చాలా మందికిముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందిన వారికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందిఇది కొత్త ఉత్సాహానికికొత్త ఆశలకు ప్రతీకఇది వ్యవసాయంకష్టపడి పనిచేసే మన రైతులతో కూడా ముడిపడి ఉందిఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని నరైనాలో లోహ్రీ వేడుకల్లో పాల్గొనే అవకాశం నాకు లభించిందిఈ వేడుకల్లో వివిధ వర్గాల ప్రజలుముఖ్యంగా యువతమహిళలు పాల్గొన్నారుఅందరికీ లోహ్రీ శుభాకాంక్షలుఅని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.

 

 

"Some more glimpses from the Lohri programme in Delhi."

 

 

***

MJPS/VJ


(Release ID: 2092885) Visitor Counter : 34