వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ పసుపు బోర్డును ప్రారంభించిన వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ పీయూష్ గోయల్

నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు

దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకునే పండుగ రోజున పసుపు బోర్డు ప్రారంభమైంది: శ్రీ గోయల్

‘గోల్డెన్ స్పైస్’ రైతుల సంక్షేమం, మంచి వంగడాల అభివృద్ధి, ఎగుమతులపై బోర్డు ప్రత్యేకంగా దృష్టిసారించాలి: శ్రీ గోయల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పసుపు దిగుబడి పెంచేందుకు అపారమైన అవకాశాలు: శ్రీ గోయల్

Posted On: 14 JAN 2025 12:57PM by PIB Hyderabad

జాతీయ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ ఈ రోజు న్యూఢిల్లీ నుండి ప్రారంభించారుపసుపు బోర్డు మొదటి అధ్యక్షునిగా శ్రీ పల్లె గంగారెడ్డి పేరును శ్రీ గోయల్ ప్రకటించారునిజామాబాద్‌లో బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకునే పండుగ రోజున జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం జరిగిందని మంత్రి పేర్కొన్నారుజాతీయ పసుపు బోర్డులో వివిధ మంత్రిత్వ శాఖల ప్రాతినిధ్యంతో పాటు ఎగుమతిదారులుఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.

పసుపును 'గోల్డెన్ స్పైస్అని కూడా పిలుస్తారన్న మంత్రిమహారాష్ట్రతమిళనాడుఆంధ్రప్రదేశ్తెలంగాణమధ్యప్రదేశ్మేఘాలయ సహా 20 రాష్ట్రాల్లో గల పసుపు రైతుల సంక్షేమంపై కొత్తగా ఏర్పడిన బోర్డు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కేంద్ర మంత్రి సూచించారుఆంధ్రప్రదేశ్తెలంగాణ రాష్ట్రాల్లో పసుపు ఉత్పత్తిని పెంచేందుకు అపారమైన అవకాశాలున్నాయన్న ఆయనపసుపు బోర్డు ఏర్పాటుతో దేశంలోని పసుపు ఉత్పత్తిదారుల ఆదాయం పెరుగుతుందన్నారు.

కొత్త పసుపు ఉత్పత్తుల పరిశోధనఅభివృద్ధిని కొత్త బోర్డు ప్రోత్సహిస్తుందనిఅలాగే విదేశాల్లో మార్కెటింగ్ కోసం పసుపు సంబంధిత ఉత్పత్తుల విలువ పెంపును పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారుపసుపులో గల మేలైనవైద్యపరమైన గుణాలను గురించి అవగాహన పెంపొందించడందాని దిగుబడిని పెంచే మార్గాలను అలాగే కొత్త మార్కెట్లలోకి వాణిజ్యాన్ని విస్తరించుటకు లాజిస్టిక్స్ అండ్ సప్లయి చైన్‌ను అభివృద్ధి చేసేందుకు మార్గాలను కూడా బోర్డు పరిశీలిస్తుందని ఆయన చెప్పారుపసుపు ఉత్పత్తిఎగుమతుల నాణ్యతను అలాగే భద్రతా ప్రమాణాలను కూడా బోర్డు నిర్ధారిస్తుందని శ్రీ గోయల్ తెలిపారు.

గత 2023-24 సంవత్సరంలోదేశంలో 3.05 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పసుపు సాగుతో10.74 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించినట్లు శ్రీ గోయల్ చెప్పారుప్రపంచ పసుపు ఉత్పత్తిలో 70 శాతానికి పైగా భారతదేశంలోనే ఉత్పత్తి అవుతోందని అలాగే 30 రకాల పసుపు మన దేశంలో ఉత్పత్తి అవుతోందని ఆయన వివరించారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బోర్డు అధ్యక్షునితో పాటుఆయుష్ మంత్రిత్వ శాఖఫార్మాస్యూటికల్స్ శాఖవ్యవసాయరైతు సంక్షేమ శాఖ అలాగే వాణిజ్య శాఖల ప్రతినిధులు కూడా బోర్డుకు నామినేట్ అయ్యారుపసుపు అత్యధికంగా పండించే రెండు ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్రతెలంగాణల ప్రతినిధులతో పాటులకడాంగ్ పసుపు సాగుతో ప్రసిధ్ది చెందిన మేఘాలయ రాష్ట్ర ప్రతినిధులకు కూడా బోర్డులో ప్రాతినిధ్యం కల్పించనున్నారుదేశంలో పసుపు రంగం అభివృద్ధిఎదుగుదలపై జాతీయ పసుపు బోర్డు దృష్టి సారిస్తుంది.

జాతీయ పసుపు బోర్డు పసుపు రంగానికి సంబంధించిన విషయాల్లో నాయకత్వాన్నివిస్తరణకు అవకాశాలను అందించడంతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు/ఏజెన్సీలతో సమన్వయాన్ని సులభతరం చేస్తుందిఅలాగే దేశంలో పసుపు రంగ అభివృద్ధివిస్తరణ కోసం తోడ్పాటునందిస్తుందిముఖ్యంగా పసుపులో గల ఆరోగ్యంశ్రేయస్సు సంబంధిత ప్రయోజనాల దృష్ట్యా పసుపుదాని ఉత్పత్తుల వ్యాపారాభివృద్ధి కోసం గల విస్తారమైన సామర్థ్యాలపై దృష్టి సారించుటలో సహాయపడుతుంది.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారువినియోగదారు అలాగే ఎగుమతిదారుగా ఉంది.  ప్రపంచ వాణిజ్యంలో మన దేశం 62 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. 2023-24లో 226.5 మిలియన్ యూఎస్ డాలర్ల విలువైన 1.62 లక్షల టన్నుల పసుపుపసుపు ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.

 

***


(Release ID: 2092881) Visitor Counter : 35