మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘పరీక్షా పే చర్చ’ 8వ సంచిక: ఇంతకు ముందు ఎన్నడూలేనంత స్పందన 2.7 కోట్లను మించిన రిజిస్ట్రేషన్లు

Posted On: 09 JAN 2025 1:34PM by PIB Hyderabad

విద్యార్థినీ విద్యార్థుల్లో పరీక్షలకు సంబంధించిన ఒత్తిడిని తగ్గించిపరీక్షలకు సన్నద్ధమయ్యే ప్రక్రియను నేర్చుకోవడంగానూఅదే సమయంలో ఒక సంబరంగా జరుపుకొనేలాగానూ మార్చివేసే ఉద్దేశంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొదలుపెట్టిన ‘పరీక్షా పే చర్చా’ (పీపీసీకార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం తరహాలో వర్ధిల్లుతోందిపీపీసీ 2025 ఈ కార్యక్రమంలో 8వ సంచికదీనిలో పాల్గొనడానికి భారతదేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా విద్యార్థినీ విద్యార్థులుటీచర్లువిద్యార్థుల తల్లితండ్రులు 2.79 కోట్ల మందికి పైగా వారి పేర్లను నమోదు చేసుకొన్నారుఈ అసాధారణ ప్రతిస్పందనను పరిశీలిస్తే ఈ కార్యక్రమం సిసలైన ‘జన్ ఆందోళన్’ (ప్రజా ఉద్యమం)గా అంతకంతకూ ఆదరణను పెంచుకొంటోందని స్పష్టమవుతోంది.

పీపీసీ 2025 లో పాల్గొనడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మైగవ్‌డాట్ఇన్ (MyGov.inపోర్టల్‌లో స్వీకరిస్తున్నారుకిందటి ఏడాదిలో డిసెంబర్ 14న రిజిస్ట్రేషన్ల స్వీకరణను మొదలుపెట్టారురిజిస్ట్రేషన్లు చేసుకొనేందుకు ఈ సంవత్సరం జనవరి నెల 14 వరకు కూడా అవకాశముందిఈ కార్యక్రమానికి  విస్తృత స్థాయిలో లభిస్తున్న ఆదరణను గమనిస్తేఇది విద్యార్థుల మానసిక అభ్యున్నతికి బాటపరచి పరీక్షలంటే వారిలో ఒక సానుకూల దృక్పథాన్ని పెంచడంలో విజయం సాధించిందని స్పష్టమవుతోంది.

ప్రతినిధులు ముఖాముఖీగా పాలుపంచుకొనే ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖలోని పాఠశాల విద్యఅక్షరాస్యత విభాగం ఏటా నిర్వహిస్తోందిఈ కార్యక్రమమంటే విద్యార్జన రంగంలో చాలా మంది ఎంతో ఆసక్తితో ఎదురుచూసే పండుగలాంటి స్థితి ఏర్పడిందిపీపీసీ 7వ సంచికను 2024లో న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్‌లో భారత్ మండపంలో ఓ టౌన్ హాల్ ఫార్మేట్‌లో నిర్వహించగాఈ కార్యక్రమానికి విస్తృత ప్రశంసలు లభించాయి.

పీపీసీ స్ఫూర్తికి అనుగుణంగా 2025 జనవరి 12వతేదీ (జాతీయ యువ దినోత్సవంమొదలు 2025 జనవరి 23 (నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతివరకు పాఠశాల స్థాయిలో విద్యార్థులు పాల్గొనే వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారువిద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధికి ఊతాన్నిచ్చివారు పరీక్షలకు హాజరు కావడాన్ని ఒక ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారన్న భావనను కలగజేయాలన్నదే ఈ కార్యక్రమాల ఉద్దేశంఈ కార్యకలాపాల్లో ఈ కింద ప్రస్తావించినవి భాగంగా ఉంటాయి:

      •     దేశవాళీ ఆటలకు సంబంధించిన కార్యక్రమాలు

      •     మారథాన్ల నిర్వహణ

      •     మీమ్‌లకు సంబంధించిన పోటీలు

      •     వీధి నాటకాలు

      •     యోగధ్యానం కార్యక్రమాలు

      •     పోస్టర్‌ను రూపొందించేందుకు సంబంధించిన పోటీలు

      •     ప్రేరణనిచ్చే చిత్ర ప్రదర్శనలు

      •     మానసిక స్వస్థత కార్యశాలలుసలహా కార్యక్రమాలు

      •     కవిత్వంపాటప్రదర్శనలు

ఈ కార్యక్రమాల ద్వారా దృఢత్వంసానుకూల మనస్తత్వంనేర్చుకోవడంలో ఆనందం.. అనే అంశాలు నిండిన సందేశాన్ని పీపీసీ 2025 అందిస్తూవిద్యార్జనను ఒత్తిడితో కూడిన పని అనే భావనకు లోనవడానికి బదులు ఒక యాత్ర మాదిరిగా ఆనందిస్తూ పూర్తి చేయాలని సూచిస్తున్నదని చెప్పుకోవచ్చన్నమాట.

మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నాఈ కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న వారు మైగవ్ పోర్టల్ (MyGov.in)ను సందర్శించిఈ మార్పు ప్రధాన కార్యక్రమంలో పాలుపంచుకోవచ్చు.

 

***


(Release ID: 2091652) Visitor Counter : 9