సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒటీపీ ఫీచర్ గురించి ఆందోళనను సమీక్షించిన సిబ్బంది, శిక్షణల విభాగం (డీఓపీటీ) కొత్త ఫీచర్ల వల్ల ఆర్టీఐ పోర్టల్ పనితీరుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదని స్పష్టీకరణ

Posted On: 09 JAN 2025 2:43PM by PIB Hyderabad

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐపోర్టల్ పనితీరుపై అందిన సందేహాలను సమీక్షించిన సిబ్బందిశిక్షణల విభాగంఓటీపీ(వన్ టైమ్ పాస్ వర్డ్) ఫీచర్ ను జోడించిన అనంతరం పోర్టల్ యధావిధిగా పనిచేస్తోందనిఇప్పుడు మరింత మెరుగైన తీరులో కొనసాగుతోందని స్పష్టం చేసిందిపోర్టల్ కు కొత్తగా జోడించిన మెరుగైన భద్రత నియమావళి సహా అన్నీ ఫీచర్లు సక్రమంగా పనిచేస్తున్నాయనివీటిని ఉపయోగించడం మరింత సులువయ్యిందని సమగ్ర సమీక్ష జరిపిన అనంతరం డీఓపీటీ తెలియజేసింది.

ఆర్‌టి‌ఐ పనితీరుపై అందిన ఫిర్యాదులకు స్పందిస్తూజనవరి 2వ తేదీన జోడించిన ఓటీపీ ఫీచర్వేదిక వినియోగదారుల ధ్రువీకరణ కోసమే కాక సమాచార హక్కు వినతి పత్రాల్లోని వ్యక్తిగత సమాచార భద్రత కోసమేనని డీఓపీటీ స్పష్టం చేసిందిధ్రువీకరణ పొందిన వారికే పోర్టల్లో ప్రవేశం కల్పించడం ద్వారా సైబర్ భద్రత మెరుగవుతుందనిఇవి సంస్థ అమలు చేసే ఉత్తమ పద్ధతులకు అనుగుణమైన చర్యలని తెలిపింది.   

ఓటీపీలు అందడం ఆలస్యం అవుతోందన్న ఫిర్యాదులు అందడంతోఎన్ఐసీ ఈమెయిల్ డొమైన్ ద్వారా ఓటీపీలు ఎప్పటికప్పుడు పంపిణీ అవుతాయని వివరించిన డీఓపీటీ... ఎన్ఐసీ సర్వర్లపై కానీజీమెయిల్యాహూ మెయిల్ వంటి ఇతర సర్వర్ల పై కానీ  అధిక ట్రాఫిక్ నమోదు అయిన సందర్భాల్లో అరుదుగా ఓటీపీలు ఆలస్యంగా అందే అవకాశం ఉందని చెప్పిందిముఖ్యంగా ఓటీపీ ని ఎంటర్ చేసేంత వరకూ వాటిని నమోదు చేయడానికి వీలుకాకుండాపోయే అవకాశం లేదనిఓటీపీ అందటం ఆలస్యం అయిన సందర్భాల్లో సైతంఅందిన వెంటనే ఓటీపీని యూజర్లు వినియోగించుకుని తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోగలుగుతారని వివరించింది.

జనవరి 9వ తేదీఉదయం 10.55 వరకూ 9,782 వినియోగదారులు కొత్త పద్ధతిని ఉపయోగించి తమ దరఖాస్తు పరిస్థితిని తెలుసుకున్నారనిదీంతో కొత్త పద్ధతి సజావుగా పనిచేస్తోందని నిర్ధారణ అయ్యిందని విభాగం తెలిపింది.

అదనంగా మరో మెట్టు జోడించడం వల్ల ప్రక్రియ జఠిలమైందన్న కొందరి విమర్శకు సమాధానమిస్తూ... వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు కొత్త ఫీచర్ అనివార్యమనికొత్త ప్రక్రియలు సజావుగా పనిచేస్తున్నాయన్న నిర్ధారణ కోసం పలు దఫాల్లో పరీక్షలు నిర్వహించామని చెప్పింది.

హెల్ప్ లైన్లు అందుబాటులో లేవన్న ఫిర్యాదులకు స్పందిస్తూ011-24622461 అనే ఆర్టీఐ హెల్ప్ డెస్క్ నంబర్ కు కార్యాలయ వేళల్లో (ప్రభుత్వ సెలవుదినాలు తప్పసోమవారం నుంచీ శుక్రవారం వరకూఉదయం గంటల నుంచి సాయంత్రం 5.30 లోపుఫోన్ చేసి తక్షణ సహాయం పొందవచ్చని స్పష్టం చేసింది.

పౌరులకు పారదర్శకమైనఅందుబాటులో ఉండే సేవలను అందించేందుకు కట్టుబడి ఉన్నామని డీఓపీటీ స్పష్టం చేసిందివినియోగదారుల సంతృప్తి తమకు ముఖ్యమనిప్రక్రియలన్నీ మరింత సమర్థంగా పనిచేస్తున్నాయో లేవో తెలుసుకునేందుకు ఆర్టీఐ పోర్టల్  పై పర్యవేక్షణ కొనసాగుతోందని డీఓపీటీ హామీ ఇచ్చిందిఆర్టీఐ చట్టం కింద పౌరుల హక్కుల పరిరక్షణ సహా డిజిటల్ సేవల విస్తరణమెరుగుదల లక్ష్యాలుగా ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల్లో భాగంగా కొత్త ఫీచర్ల జోడింపు ప్రక్రియ చేపట్టామని డీఓపీటీ తెలిపింది.  

***


(Release ID: 2091651) Visitor Counter : 7