సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత వినోద, సృజనాత్మక పరిశ్రమకు ప్రధాని పిలుపు: వేవ్స్ లో పాల్గొని అంతర్జాతీయ వేదికపై భారత సృజనాత్మక శక్తిని చాటండి


5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి యువ సృజనకారుల ఉత్తేజకరమైన, క్రియాశీల తోడ్పాటు ఊపునిస్తుంది: శ్రీ నరేంద్ర మోదీ

శత జయంతి సందర్భంగా భారత సినీ దిగ్గజాలకు ప్రధాని నివాళి

Posted On: 29 DEC 2024 1:44PM by PIB Hyderabad

భారత సృజనాత్మకవినోద రంగంలో ప్రధాన ఘట్టానికి సంబంధించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 117వ ఎపిసోడ్ లో ఉత్తేజకరమైన సమాచారాన్ని పంచుకున్నారుజాతినుద్దేశించి ప్రసంగిస్తూవచ్చే ఏడాది ఫిబ్రవరి 5-9 మధ్య ప్రపంచ శ్రవ్య దృశ్య వినోద సదస్సు (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ – వేవ్స్)ను మొదటిసారిగా భారత్ లో నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు.

వేవ్స్ సదస్సుభారత సృజనాత్మక ప్రతిభకు అంతర్జాతీయ వేదిక

ప్రపంచంలోని ఆర్థిక దిగ్గజాలు సమావేశమయ్యే దావోస్ వంటి కార్యక్రమాలతో వేవ్స్ సదస్సును పోలుస్తూ.. ‘‘భారత సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశం రాబోతున్నదిమీడియావినోద పరిశ్రమకు చెందిన దిగ్గజాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనకారులందరూ భారత్ కు వస్తారుసృజనాత్మక రంగంలో భారత్ ను అంతర్జాతీయ వేదికగా నిలిపే దిశగా ఈ సదస్సు ముఖ్యమైన ముందడుగు’’ అని ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు.

వేవ్స్ సన్నాహకాల్లో యువ సృజనకారుల పాత్ర కీలకమైనదనీభారత సృజనాత్మక రంగపు చేతనాత్మకమైన స్ఫూర్తిని అది ప్రతిబింబిస్తుందని ఉద్ఘాటించారుదేశ యువత ఉత్సాహమూసృజనాత్మక ఆర్థిక వ్యవస్థ త్వరితంగా వృద్ధి చెందడంలో వారి పాత్రా గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా పురోగమించడంలో భారత్ కు అది కీలకమైన చోదకంగా ఉపయోగపడుతుందన్నారు.

‘‘మీరు యువ సృజనకారులైనాలబ్ధ ప్రతిష్ఠులైన ప్రముఖులైనా.. మీది బాలీవుడ్ అయినాప్రాంతీయ సినిమా అయినా.. టీవీ పరిశ్రమ నిష్ణాతులైనా లేదా యానిమేషన్ గేమింగ్ నిపుణులైనా లేదా వినోద సాంకేతికతలో ఆవిష్కర్తలైనా.. వేవ్స్ సదస్సులో భాగం కావాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’ అని ఆయన అన్నారువినోదసృజనాత్మక పరిశ్రమల్లో భాగస్వాములందరినీ వేవ్స్ సదస్సులో క్రియాశీలకంగా పాల్గొనవలసిందిగా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.

సహకారాన్ని పెంపొందించడంతోపాటు ప్రపంచ స్థాయి సృజనాత్మక రంగ కేంద్రంగా భారత సామర్థ్యాన్ని చాటుతూ.. భారత సృజనాత్మక ప్రతిభకు అంతర్జాతీయ వేదికగా నిలిచేందుకు వేవ్స్ సదస్సు సిద్ధమవుతోందియానిమేషన్గేమింగ్వినోద సాంకేతికతప్రాంతీయ ప్రధానస్రవంతి సినిమాలలో భారత పురోగతిని కూడా ఇది ప్రముఖంగా చాటుతుందిభారత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి.. మీడియావినోద రంగాల్లో అంతర్జాతీయ అగ్రగామిగా భారత స్థానాన్ని సుస్థిరం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

శత జయంతి సందర్భంగా సినీ దిగ్గజాల సంస్మరణ

పలువురు భారత సినీ దిగ్గజాల శత జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి హృదయపూర్వక నివాళి అర్పించారుచిరస్మరణీయమైన తన చిత్రాల ద్వారా భారత కళాత్మక శక్తిని రాజ్ కపూర్ చాటి చెప్పారనీమంత్ర ముగ్ధులను చేయగల మహమ్మద్ రఫీ గాత్రం అన్ని తరాల్లోనూ ప్రతిధ్వనిస్తుందనీభారతీయ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తెలుగు సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో అక్కినేని నాగేశ్వరరావు విశేషంగా కృషి చేశారనీ ప్రధానమంత్రి గుర్తుచేశారుఐక్యతా స్ఫూర్తినీఅవగాహననూ కలిగించేలా తపన్ సిన్హా సామాజిక స్పృహతో సినిమాలు తీశారన్నారుభారత చలనచిత్ర రంగంలో స్వర్ణయుగాన్ని రూపుదిద్దడంతోపాటు... భారతయ సాంస్కృతిక వారసత్వాన్ని ఈ దిగ్గజాలు ఏ విధంగా బలోపేతం చేశారో శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారుతరతరాలకూ ఆరాధ్యనీయమైనఅందరిలోనూ స్ఫూర్తిని నింపగల శాశ్వతమైన వారసత్వాన్ని వారు మిగిల్చారన్నారు.

55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీసందర్భంగా కూడా రాజ్ కపూర్తపన్ సిన్హాఅక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్), మహమ్మద్ రఫీలకు వారి అద్వితీయమైన ఘనతను స్మరించుకుంటూ ప్రదర్శనలుముఖాముఖి వంటి కార్యక్రమాల ద్వారా నివాళి అర్పించడమూ.. తద్వారా ఈ దిగ్గజాల సేవలను సినిమా ప్రపంచానికి చాటడమూ తెలిసిందే.

 

***


(Release ID: 2088818) Visitor Counter : 24